సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాది ఏదీ కాదు
‘నాది’ అనే సంకుచిత భావం ఆవరించి సంసారంలో చిక్కుపడతారు. నా యిల్లూ, నా ఊరూ, నా కులం, నా మతం, నా జిల్లా, నా ప్రాంతం నా భాష అనే చిక్కులలో చిక్కుపడి, యిక బైటపడలేదు.
అందుకే ‘నాది’అన్న మమకారాన్ని అదుపుచేసికో. నిస్సంగత్వం అలవరచుకో. సంగం విముక్తినిచ్చే భగవాన్‌తోనే తప్ప ఎవరితోనూ నీకు వద్దు.
ఎవరీయన?
ఒక పెండ్లిలో ఒక పెద్దమనిషి అటూయిటూ సందడిగా తిరుగుతూ ఉంటే ఆడ పెళ్లివాళ్లు ఆయన మగ పెండ్లివారి తాలూకని, మగ పెండ్లివారు వధువు తరఫు బంధువనీ అనుకొంటూ వచ్చారు. చివరకు వారిద్దరూ కలిసి ‘ఎవరీయన?’అని ఆరాతీసేసరికి ఆ పెద్దమనిషి రంగు బయటపడి, పరారీ చిత్తగించాడు.
ప్రవృత్తికి, నివృత్తికి పెండ్లి జరుగుతుంటే మాయ అనే పెద్దమనిషి అలాగే ప్రవేశించటం జరుగుతుంది. విచారణ చేసి చూస్తే అసలు రంగు బయటపడి మాయ పరారౌతుంది.
ప్రదక్షిణం
కాళ్లరిగి పోయేలా భగవంతుని ప్రతిమ చుట్టూ గాని, లేక మందిరం చుట్టూ గాని తిరగటం ఎందుకు? ప్రతి పనీ అర్థంచేసుకుని చేయాలి. మన ప్రాచీనులు అర్థంలేని క్రియలు చేయలేదు. చేయమనలేదు. చక్రానికి ఇరుసు మధ్యలో ఉంటుంది. చక్రం ఎంత దూరం ప్రయాణించినా ఇరుసునే ఆధారంచేసుకొని ఉంటుంది. అదే విధంగా, భగవంతుణ్ణి ఆధారంగా చేసుకొనే మన పనులను మనం నెరవేర్చుకోవాలి. భగవత్సంగమే సత్సంగం. ఈ సంగతిని మనకుమనం గుర్తుచేసుకోవడానికి మందిరం చుట్టూ లేక, విగ్రహంచుట్టూ ప్రదక్షిణ చేయమంటారు.
లగేజి తగ్గించుకో!
మన పునర్జన్మ జన్మరాహిత్యం. అంతయూ మన సంకల్పముపై ఆధారపడి ఉన్నది. వడ్లగింజను మట్టిలో పెడితే ‘పునరపి జననం పునరపి మరణం’- అనగా పుట్టటం. చావటం... పుట్టటం చావటం... జరుగుతుంది. కాని దానిపై పొట్టును తీసివేస్తే- అది బియ్యపు గింజ అవుతుంది. దీనికి మళ్లీ పుట్టడమనేది లేదు. అదే విధముగా మన జీవితం వడ్లగింజ వంటిది. మన కోరికలే గింజపైన పొట్టువంటివి. ఈ కోరికలనే పొట్టు ఉండినంతవరకు మళ్లీ, మళ్లీ జనన మరణాలు తప్పవు. కనుక ఈ జీవితమనే దీర్ఘ ప్రయాణంలో కోరికలు అనే ‘లగేజి’ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అంత హాయిగా ప్రయాణం చేయవచ్చును. కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్ అన్నారు.
అర్పణ ఆయనకే!
ఏ విధంగా తగ్గించుకోవాలి ఈ లగేజిని? వాంఛలు లేకుండా మానవుడు జీవించటానికి వీలుకాదే! ఈ వాంఛలు ఏవిధంగా మనము తగ్గించుకోవడానికి వీలవుతుంది? వాంఛలు తగ్గించుకోవడమంటే వాంఛలపై నున్న మమత్వాన్ని తగ్గించుకోవడము. నీ వ్యాపారం నీవుచేసుకో, నీ ఉద్యోగానికి నీవువెళ్లు. నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించు. నీ బాధ్యతలు నీవు అనుసరించు. ఆచరించు, అనుష్ఠించు. కాని ఇవన్నీ కూడనూ భగవత్ కార్యములే అనే భావనతో నీవు అనుభవించాలి. సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అనే భావనతో నీవు అనుభవించాలి. ఇది సులభమైన మార్గము.
కర్మ ఫలం
నీవు పాపమో, పుణ్యమో ఆచరిస్తావు. గోవునుండి పాలు పితికినట్టు ఆ ఫలం తక్షణమే లభించేది కాదు. సంగమనేది నాటిన విత్తనం వంటిది. ఈనాడు నీవు పాపము చేసి, ‘అయినా నాకేమీ శిక్ష పడలేదు!’ అని విఱ్ఱవీగవద్దు. విత్తనం ఫలవంతమై, ఆ ఫలమును నీవు అనుభవించడానికి కొంతకాలం పడుతుంది. ఏది తప్పినా ఇది తప్పదు.
సమ+్ధ= సమాధి
కష్టములకు నేను క్రుంగను. సుఖములకు నేను పొంగను. ఈ రెండూ లేకుండా ఎప్పుడూ నేను సమత్వంగా ఉంటుంటాను. ఇదే ‘‘సమాధి’’-సమాధి అనగా ఏమిటి? స్పృహతప్పి పడిపోవడమా? లేక హిస్టీరియానా? కాదు...కాదు- ‘‘సమ’’అనగా సమానమైన + ‘్ధ’అనగా బుద్ధికనుక ‘ఈక్వినానిమిటీ= సమాధి. సుఖ దుఃఖములు, కష్టసుఖములు, శీతోష్ణములు-వీటన్నింటిని ఒకే విధంగా చూచుకోవాలి. అదే సహనం. అదే సంగరాహిత్యం. దీనిని పెంచుకోవాలి. ఎవ్వరు దూషించినా, ఎవ్వరు కష్టపెట్టినా, నీవు సహనాన్ని వహించాలి. దానివలన నీకు వచ్చిన నష్టమేమీ లేదు.
ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. కనుక యిప్పటినుంచి వైరాగ్యం అలవరచుకో. లేకపోతే ఆ సమయానికి నీ గుండె దుఃఖంతో చెరువవుతుంది. నీవు కట్టుకున్న యిల్లు గుర్తుకు వస్తుంది. సంపాదించిన ఆస్తి గురించి ఆలోచిస్తావు. సాధించిన మెడల్సు గురించి అనుకుంటావు. ఇవన్నీ క్షణభంగురాలని తెలుసుకో. దేవునిపట్ల అనుబంధం పెంచుకో. ఆయన నీవెంట వుంటాడు. ఆయనతో గడిపిన క్షణాలే జీవితం. మిగతాదంతా వృథా!
ఇంకా ఉంది

శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.