సబ్ ఫీచర్

ఒత్తిడి లేని జ్ఞానం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావి భారత పౌరులైన పిల్లలకు ఎలాంటి ఒత్తిళ్లూ ఉండని సామాజిక వ్యవస్థలో వారిని ఎదిగేందుకు కుటుంబ వ్యవస్థలు, విద్యాబోధనాలయాలు అప్రమత్తంగా కృషిచేయాలి. విద్యార్థులలో నిబిడీకృతమై ఉన్న సహజమైన శక్తియుక్తులను వెలికితీసి, సామాజిక ఆర్థిక వికాసానికి తోడ్పడే విశిష్ట ప్రక్రియే విద్యగా శ్రీ స్వామివివేకానంద ప్రవచించారు. విద్య వైయక్తిక వృద్ధితోపాటు దేశాభివృద్ధికి దోహదపడుతుంది. పూర్వకాలంలో బాలలకు నేటితరం బాలలకు మేధోపరమైన ఆలోచనావిధానం బహు సునిశితంగా, సున్నితంగా ఉంటుంది. ఎంతో విలువైన మానవ వనరులను ఉపయుక్తంగా తీర్చిదిద్దడంలో చదువుపాత్ర కీలకం. సామాజికాభివృద్ధికి కేంద్ర బిందువైన విద్యావిధానంలో సమయానుసారం మార్పులుచేర్పులు చేపట్టాల్సిన అగత్యాన్ని ప్రభుత్వాలు గుర్తించి అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా నేటి తరాలకు అనుగుణంగా మార్పులుచేర్పులు చేసి ప్రతిభావంతమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరుల్ని తయారుచేయాల్సి ఉంది.
సున్నిత మనస్కులైన భావితరాలకు బ్రతుకు భరోసా, ఉన్నతంగా జీవించే వెసులుబాటు కల్పించాలి
విద్యార్థులకు నైపుణ్యం, ప్రావీణ్యం కరువైన దిశగా విశ్వవిద్యాలయాలు కేవలం పట్టాలు పంపిణీ కార్యక్రమాలకే పరిమితంకాకుండా మేధోపరమైన సాంకేతికతతో నైపుణ్యం దిశగా చొచ్చుకొని వెళ్ళే ప్రతిభకు పట్టంగట్టే విధానపరమైన నిర్ణయాత్మక వెసులుబాటును కల్పించే ప్రతిష్టాత్మక నిర్ణయాలను పాలక ప్రభుత్వాలు పట్టాలెక్కించాలి. పిల్లల తల్లిదండ్రులుగానీ, కుటుంబ సభ్యులుకానీ విద్యార్థుల మనోగతానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారి మనోభావాలకు అనుగుణంగా కోర్సులలో చేరి మనసుపెట్టి విద్యను కొనసాగించాలి. కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలవారు విద్యార్థుల మానసిక ప్రవర్తనకు అనుగుణంగా విద్యను కొనసాగించాలి.
‘ఆన్ స్కూలింగ్’ ఓపెన్ లెర్నింగ్, విద్యావిధానం విద్యార్థులకు స్ఫూర్తిదాయకం.
పారంపర్య విద్యావిధానం పిల్లల్లోని సృజనాత్మకశక్తిని హరించివేస్తోందనీ, స్వీయప్రేరణ తెలుసుకోవాలనే ఆసక్తి ఇత్యాదిని ఆవలకునెట్టేయడం జరుగుతోందని అమెరికా విద్యావేత్త జాన్‌హోల్డ్ అభిప్రాయపడ్డారు. ఆన్ స్కూలింగ్ విధానంలో తల్లిదండ్రుల తోడ్పాటు, మార్గనిర్దేశం, సలహాల ఆధారంగా ఈ పాఠశాలలు పనిచేస్తాయి. ఈ కొత్త విధానాన్ని అమెరికా, కెనడా దేశాలలో అద్భుతమైన గుర్తింపుతో రాణిస్తుండగా, భారత్‌లో పాక్షిక చట్టబద్ధతతో కొనసాగుతోంది. ప్రపంచ విద్యాసూచిలో మొదటిస్థానంలో ఉన్న ఫిన్లాండ్‌లో ఈ విద్యావిధానం చట్టబద్ధమై కొనసాగుతుండగా, అమెరికాలో మొట్టమొదటి సడ్బరీవాల్ పాఠశాలను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ తర్వాత కాలంలో గ్రీన్‌ల్యాండ్, టర్కీ, జర్మనీ, గ్రీస్ వంటి దేశాలు వివిధ కారణాలతో ఈ విధానంపై మొగ్గుచూపలేకపోయాయి. ఆన్ స్కూలింగ్ విషయంగా ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తికనబరుస్తున్నట్లు వెల్లడైంది. పిల్లల్లో తక్కువ గ్రహణశక్తి, వినికిడి లోపం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పాఠ్యాంశాలను మాత్రమే బోధిస్తే సృజనాత్మకత దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల యాజమాన్యాల అజమాయిషీ ధోరణి, విద్యార్థికి స్వేచ్ఛ లేకపోవడం, బడికెళ్ళేందుకు సుదీర్ఘ ప్రయాణం, పుస్తకాల సంచుల బరువు, అధిక రుసుములు, దండన, గ్రేడ్లు, ర్యాంకులు, మదింపు వంటి వ్యవహారాలతో పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి చదువులతో ప్రకృతి సిద్ధమైన వ్యక్తిత్వం, సృజనాత్మకత సన్నగిల్లుతుందనే భావన ప్రబలుతోంది. అందువల్లే ఓపెన్ లెర్నింగ్, జాయ్ లెర్నింగ్, హోమ్ లెర్నింగ్, ఆన్ స్కూలింగ్ వంటి కొత్త విద్యావిధానాలపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. 130 కోట్ల మానవ వనరులున్న భారత్ నైపుణ్యంవైపు మోరలెత్తి అర్రులు చాస్తోంది.
కొత్త విద్యావిధానాలపై రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. స్వీయ ప్రతిభకు సానపెట్టి నైపుణ్యభారతంగా ఎదిగే ఎగుమతుల పరంపరకు భారత్ నోచుకోవాలి. పట్టాల ప్రాతిపదికన కాకుండా సామాన్య వ్యక్తుల్లో సైతం నైపుణ్యావృద్ధిని సాధించగలిగితే ఆధునిక భారత్‌ను వేధిస్తున్న సమస్యలు సగం పరిష్కారమైనట్లే. చదువు తక్కువ ఉన్నా తమలోని నిగూఢ నైపుణ్యాలను వెలికితీసి, వాటిని పదునుపెట్టుకొని వివిధ రంగాల్లో ఖ్యాతి గడించినవారు పెక్కుమంది ఉన్నారు.
విశ్వవిఖ్యాత శాస్తవ్రేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్, కంప్యూటర్ల దిగ్గజం బిల్‌గేట్స్, పోర్డ్ కార్ల సంస్థ అధినేత హెన్రీపోర్డ్, బిర్లా సంస్థల అధినేత, ఘనశ్యామ్‌దాస్ బిర్లా, పారిశ్రామిక దిగ్గజాలు ధీరుభాయ్ అంబానీ, అజీంప్రేమ్‌జీ, గౌతమ్ అదానీ, క్రీడా ప్రముఖులు మేరీకోమ్, సచిన్ టెండూల్కర్, అందాల రాణి ఐశ్వర్యరాయ్ వంటివారు ఈ విషయంలో మనకు ఉదాహరణలుగా నిలుస్తూ తమ విజయగాథలతో ధైర్యాన్ని స్ఫూర్తిని నింపినవారే. సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతలుండే అభివృద్ధిచెందుతున్న సమాజాల్లో నూతన విద్యావిధానం క్రొంగొత్త ఒరవడిని, ప్రావీణ్యతాపరమైన దిక్సూచిగా పయనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

- దాసరి కృష్ణారెడ్డి