సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణుడు ఒకసారి నిద్ర నటిస్తున్నాడు. ఆయన మురళి ఒకప్రక్క జారిపోయి పడివుంది. ఇంతలో రాధ వచ్చింది. మురళితో యిలా అంది. ‘మురళీ! నీవు గోపాలకృష్ణుని అధరామృతాన్ని ఆస్వాదించేందుకు ఏమి పూజలుచేశావు? ఏఏ నోములు నోచావు? ఏఏ యాత్రలు చేశావు? అని.
కృష్ణుని ప్రభావంవల్ల మురళి ఇలా మాట్లాడింది. ‘‘నేను ఏ పూజలూ, వ్రతాలూ చేయలేదుకాని, నా లోపల అహంకారం, ఆశ, లోభం, అసూయ, విషయవాంఛలూ చేరి ఆయన నన్ను వూదినప్పుడు అవన్నీ అడ్డంరాకుండా వాటినన్నిటినీ తొలగించాను. ఇప్పుడు ఆయన ఊదే ప్రేమ వాయువు నా గుండా నిరాటంకంగా పోతోంది. వేణు గానంగా మారి లోకాలను అలరిస్తోంది!’’
ఒకసారి నేను చాలామందిని అడిగాను. ‘దేవుని చేతిలో ఏ వస్తువుగా మారాలని మీకుంది?’అని. రకరకాల జవాబులు వచ్చాయి. కొందరు పద్మం కావాలనుకున్నారు. మరికొందరు చక్రం: ఇంకా కొందరు శంఖం; చిత్రమేమిటంటే ఎవరూ మురళిగా మారాలని కోరుకోలేదు!
నే చెప్పేదేమిటంటే మీరు మురళిగా మారండి! అప్పుడు భగవాన్ మీ వద్దకు వస్తాడు. మిమ్మల్ని తీసుకొని ముద్దిడుకుంటాడు. వేణుగానం చేస్తాడు. మీలోనుండి ఆయన వూదే పవిత్ర వాయువు అటుయిటూ పరుగులిడుతుంటుంది. అహంకారాన్ని పూర్తిగా త్యజించి బోలుపోయిన మీ హృదయం ఆనందపరవశమైపోతుంది. ప్రకృతిని పులకింపజేసే ఆయన వేణుగానం మాధుర్యం తొణుకుతూ మీనుండే జాలువారుతుంటుంది! ఆయన స్పర్శతో అణువు అనంతంగా మారుతుంది. ప్రణవం గానమై పరవళ్లుతొక్కుతుంది. ప్రపంచానే్న పరవశింప జేస్తుంది.
జన్మదినోత్సవం
ఆత్మ శాశ్వతం. దానికి అనుక్షణం పుట్టినరోజు పండుగే. అది ఆనంద స్వరూపం. అది కాలానికి ఆతీతమైంది. కనుక అది నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు లెక్కపెట్టుకోదు. మనిషి పుట్టినరోజు పండుగ వేడుకలు ఎలా చేసికొంటాడు? దేహభ్రాంతి, మనోభ్రాంతి, ఇంద్రియ బ్రాంతి, లోకభ్రాంతి, ఇన్ని భ్రాంతులతో ఒకప్రక్క సతమతవౌతూ వుంటే, ఇంక ఈ వేడుకలేమిటి? భ్రాంతి అయిన దేహాన్ని నిజమనుకొంటున్నాడు. విషయవాసనలను వెన్నాడుతూ సుఖదుఃఖాలను పొందుతూ, ఇనే్నళ్లు వృథాగా గడిచాయి కదా! ఏం సంబరమని పుట్టినరోజు పండుగలు చేసికొంటున్నాడు?
శీల కాలుష్యం
పట్టణాలనుండి శీల కాలుష్యం పల్లెలక్కూడా వ్యాపిస్తోంది. గ్రామసీమలు అనుకరణ వ్యామోహానికి లోబడి తమకు తాముగా ప్రమాదాన్ని కొని తెచ్చుకోరాదు. సంప్రదాయసిద్ధంగా వస్తున్న నిరాడంబరత్వం, చిత్తశుద్ధి, సేవాభావం, ఆధ్యాత్మిక చింతనల వంటి సద్గుణాలను వారు జారవిడుచుకోరాదు. ఆశ, కోపం, అసూయ, గర్వం వంటి అవగుణాలను దగ్గరకు చేరనీయరాదు. సోదర భావంతో కలిసిమెలసి జీవించాల్సి వుంది.
తింటేనే రుచి
మిఠాయి వుండను చూపించి వూరిస్తే ప్రయోజనమేమిటి? నోట్లో వేసికొని తింటే కదా రుచి తెలిసేది? ఆకలి తగ్గేది? అందుకే సాధన ప్రారంభించు. అహాన్ని అణచివేయి. మనసును నిర్మలంగా వుంచు. పవిత్ర భావనలను మాత్రమే మనసులోకి రానీయి. ధర్మబద్ధమైన అవసరాలనే కోరు. ధర్మానే్న ఆచరించు.
సనాతన సారధి
నీ జీవిత రథానికి భగవంతుని సారథిగా పెట్టుకొంటే ఆయన నిన్ను చక్కని తోవన నడిపిస్తాడు. ‘వీడికి నేను సారథినా?’అన్న నామోషీ ఆయనకు లేదు. అందుకే ఆయనను సనాతన సారథి అంటాము. ఆయన అందరికీ సారథి.
ప్రేమ యోగం
దివ్యాంశలు
భగవంతునికి నాలుగు ప్రశస్తులున్నాయి. ప్రేమ, సౌందర్యం, మాధుర్యం, శోభ. భగవంతుని దర్శించాలంటే ఆయన గుణాలను అలవరచుకోవాలి. ముందు ప్రేమభావాన్ని పెంపొందించుకోండి! మిగిలిన మూడూ తమంతతామే వచ్చి చేరతాయి.
దివ్య ప్రేమతో మీ మనసును నింపుకోండి! అందరిలోనూ ఆయన ‘ప్రేమ’ స్వరూపం మీకు గోచరిస్తుంది. అదే ‘సౌందర్య’ఘట్టం! విశ్వజనీనమైన ప్రేమ సాగరంలో మునకలు వేయండి! ‘మాధుర్య’ ఘట్టాన్ని చేరుకుంటారు. మనసు అనంతాత్మతో తాదాత్మ్యం పొందినప్పుడు కలిగే ‘శోభ’ వర్ణనాతీతం.
మూసిన తలుపులు
అన్ని జీవులలోనూ వుండే దివ్యశక్తి అంతా ఒకే పరంజ్యోతికి చెందినది అయి వున్నది. ఈ సంగతి నీవుబాగా తెలిసికోవాల్సి వుంది. భగవంతుని మందిరానికి రెండు తలుపులున్నాయి. ఈ రెండూ మూసే వుంటాయి. ఒకటి ఆత్మస్తుతి. రెండు పరనింద. తలుపులకు అసూయ గడియవేసింది. దానికి అహంకారం అనే పెద్ద తాళంకప్ప వేసి వుంది.
మందిరంలోకి వెళ్లాలని నీకు కోరికగా వుంటే ప్రేమ అనే తాళంచెవిని ఉపయోగించి తాళం తీయాలి. గడియను తొలగించి తలుపులు తెరవాలి. ఇక లోపలికి వెళ్లేందుకు అడ్డేముంటుంది?
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.