సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వ కుటుంబం
దేవుడు ప్రేమాస్పదుడు. దేవుని ప్రేమించు. దేవుని సృష్టిని ప్రేమించు. ఇందులో ఎక్కువ తక్కువలు లేవు.
ప్రేమసాగరంలో మునకలు వేయి. సంకుచిత స్వభావాన్నీ, విచారాన్నీ, ద్వేషాన్నీ, ప్రేమ ద్వారానే జయించు. జనన మరణ దుఃఖాలనుండి ప్రేమే రక్షిస్తుంది. మనసులను కలిపి కట్టే మెత్తని పట్టుతాడది. ప్రేమతో చూస్తే సర్వం సత్యం, శివం, సుందరమే!
ఆలోచిస్తే, ప్రపంచమంతా ఒక పెద్ద కుటుంబం!
అమృత స్వరూప
‘ప్రేమ అమృత స్వరూపాచ’అన్నాడు నారదుడు. ప్రేమ అమృత స్వరూపము. ఈ బాహ్య ప్రపంచమునందు మానవుడు చతుర్విద పురుషార్థములను మాత్రమే లక్ష్యమునందుంచుకొని ఇదియే మోక్షానికి తగిన మార్గమని భ్రమిస్తున్నాడు. కాదు...కాదు...్ధర్మ, అర్థ, కామమోక్షములు మాత్రమే పురుషార్థములుకాదు. పంచమ పురుషార్థం కూడనూ ఒకటున్నది. అది మోక్షమునకంటే అతీతమైనది. అదియే పరమప్రేమ. ఈ ప్రేమతత్త్వమే దైవత్వము.
వెదకదగిన మార్గం
ఒకానొక సమయంలో ఒక భక్తుడు జీసస్ వద్దకువెళ్ళి ‘స్వామీ! తనను తాను రక్షించుకొనగలుగు శక్తి ఏమిటి?’అని అడిగాడు. ‘నాయనా! నీవు భగవంతుణ్ని ప్రేమించినప్పుడు ఆ శక్తి నిన్ను రక్షిస్తుంది’ అని జవాబిచ్చాడు ఏసు. భగవద్గీత యందు కూడ, ‘స్వామీ! భగవత్ ప్రేమకు పాత్రులు కావడానికి ఏమిచేయాలి?’అంటే ‘పిచ్చివాడా! భగవంతుడిని ప్రేమించేటటువంటి మార్గాన్ని వెతుకు’ అని సమాధానం చెప్పారు.
ప్రేమ జలధార
రాముడంటే భక్తి, రావణుడంటే అసహ్యం ఎందుకు? రాముడు మనకేం మేనత్త కొడుకా? రావణుడు ఏమన్నా సవతి పిల్లాడా? రామునిలోని మంచితనం, ప్రేమ మనకాయనపట్ల భక్త్భివాన్ని ప్రేరేపిస్తాయి. రావణుని దుర్మార్గమే మనకతని పట్ల అసహ్యాన్ని కలిగిస్తుంది.
‘రామ, రామ’ అని భగవంతుని నామాన్ని పెద్దగా జపించాల్నా?’ ప్రేమాదరణలతో నిండు మనస్సుతో భావిస్తే చాలు. మీ మనసులో ప్రేమ ధార యింకిపోతే, పూజ, స్తోత్రం వంటి సాధనాలను ఉపయోగించండి! తప్పక ప్రేమ జల వుప్పొంగి వస్తుంది.
ప్రేమ విత్తనాలు
బీటలుబారిన ఎడారి భూముల్లో ప్రేమ విత్తనాలు వెదజల్లండి. అవి మొలకెత్తి పచ్చందనాలు పరుస్తాయి. కుసుమించి సౌరభాలు విరుస్తాయి. ప్రేమ సెలయేరయి పారి గలగలారవాలతో లోయల వెంట పరుగులిడుతుంది. ప్రతి జంతువు, ప్రతి బిడ్డ ప్రేమ గీతాన్ని ఆలపిస్తారు.
ప్రేమలో పెరిగిపో
అనంతునికి అంకితంకా, ఆయనలో లీనమయేందుకే ఆతురత పడు.
‘నాకుద్యోగం కావాలి. సంతానం కావాలి. సంపద కావాలి’ అని దేవుని ప్రార్థిస్తే, నీ భక్తి దేవునిపట్ల కాదు: నీవు కోరే ఉద్యోగంమీద. సంతానం మీద, సంపద మీద అని అర్థం.
భగవంతుని కోసమే భగవంతుని ధ్యానించాలి. ప్రేమించు. ఎందుకు? ప్రేమించటం నీ స్వభావం కనుక. ప్రేమ తప్ప నీవు మరొకటి ఎరుగవు కనుక. నీ పరిధిని విస్తరించుకో! అందర్నీ నీ ప్రేమాలింగనంలోకి చేర్చుకో. ప్రేమలో పెరిగిపో!
దివ్య పథం
ఎప్పుడూ ఐహిక చింతలతో సతమతమవుతూ వుంటే నీకు తిండీ, నిద్రా, సరదాలూ, సంబరాలూ, ఆవేశకావేశాలూ, అసూయా ఆడంబరాలూ వీటితోటే సరిపోతుంది. వీటిని వదిలించుకో. బయటపడు. నీకు సుఖశాంతులు లభిస్తాయి. దివ్యపథం ప్రేమపథం దానిలో వెళ్లేవారికి గమ్యం చేరకపోవటం అంటూ వుండదు.
ప్రేమే దైవం
లౌకిక సుఖాలకై చేసే ప్రార్థనలు దేవునిదాకా చేరవు. అటువంటి పరిమితమైన పరిధులకు సంబంధించిన దేవతలకు మాత్రమే అవి చేరుతాయి. నిష్కల్మమైన ప్రేమవల్ల కలిగే ఆర్తితో చేసే పూజలన్నీ భగవంతుని చేరుతాయి. భగవంతుని ప్రేమస్వరూపం కదా! వెనె్నల మూలంగా మనం చంద్రుని గమనిస్తామని తెలుసు. అలాగే ప్రేమ రూపియైన భగవంతుని కూడా ప్రేమద్వారానే దర్శించగలం.
ప్రేమే దైవం. ప్రేమలో జీవించు.
కుట్ర వాసః?
‘కుట్ర వాసః’ అంటే, ‘ఎక్కడ నివసిస్తున్నావు?’ అని అడిగినప్పుడు నేను ఫలానా పేటలో, ఫలానా ఇంట్లో నివసిస్తున్నానంటావు. కాని ఇవన్నీ నీ దేహము నివసించే స్థానములే కాని, నీవు నివసించే స్థానములు కావు. నీ దేహము ఆ నెంబరు ఇంట్లో నివసిస్తుండాలి. నిజమే. కాని నీవెక్కడ నివసిస్తున్నావు? నీ నివాసమే ఆత్మ నివాసము. అదియే ప్రేమ స్వరూపము. అట్టి ప్రేమలో నీవు నివసించాలి. అట్టి ప్రేమలో నీ జీవితాన్ని గడపాలి. అట్టి ప్రేమకే నీ జీవితాన్ని అంకితం గావించాలి.
ఇంకా ఉంది
*
శ్రీ సాయి గీత - భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ సారాంశ సుమమాల
- కూర్పు, సమర్పణ : శ్రీ వేద భారతి , హైదరాబాద్ , వెల:రూ. 100/-లు.