సబ్ ఫీచర్

పౌరసత్వ సవరణ బిల్లుపై అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందుత్వం అంటే..మతం కాదు, భారత జీవన విధానమే హిందూమతం. ప్రపంచంలో అన్ని మతాలకన్నా అన్ని రకాల సంస్కృతులకన్నా హిందుత్వ విధానం చాలా పురాతనమైనది. ఈ భారత జీవన విధానంలో తరతరాలుగా యుగయుగాలుగా ఔదార్యం, ఉదారత్వం, త్యాగం, దానం, మిళితమైపోయాయి. ఈ త్యాగ, ఔదార్యాలవల్లనే ఎంతోమంది విదేశీయులు క్రీస్తుశతాబ్దానికి ముందే భారతదేశానికి వలసవచ్చారు. చుట్టపుచూపుగా వచ్చారు. ఇక్కడే తిష్టవేశారు. మనవాళ్లు అతి మంచితనాన్ని చేతగానితనంగా భావించి చివరకు ఆంగ్లేయులు మన సార్వభౌమాధికారానే్న దక్కించుకున్నారు. మొగలాయిలు, నైజాములు, ఢిల్లీ సుల్తానులు, బహమనీ సుల్తానులు తదితర ముస్లిం రాజులు అనేకచోట్ల ఎక్కడికక్కడ పోటీ వ్యవస్థలు నడుపుతూ, సమాంతర రాజ్యాలను ఏర్పాటుచేసుకున్నారు. ఈ వర్గానికి చెందిన కొంతమంది కుట్రల ఫలితమే స్వాతంత్య్రానంతరం పాకిస్థాన్ ఏర్పాటుకు దారితీసింది. స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఈ ఏడు దశాబ్దాల కాలంలో ఏ ఒక్కరోజైనా మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామా...? అని ప్రశ్నించుకోవలసి వుంది. అడుగడుగునా ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడు బాంబులు పేలుతాయో, మరెప్పుడు మందు పాతరలు లేస్తాయో...తెలియని అయోమయ పరిస్థితి. గత పాలకులు భారతదేశంనందలి పదిపదిహేను శాతం మైనార్టీ ప్రజలను బుజ్జగించడానికి 85 శాతం మెజార్టీ ప్రజల హక్కులను కాలరాస్తూ వచ్చారు. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, చైనా తదితర దేశాలనందు స్థిరపడిన భారతీయులకు రక్షణ లేదు. అక్కడ జీవిస్తున్న హిందువులను, ఇతర మైనర్టీలను పూర్తిగా ద్వితీయశ్రేణి పౌరులుగా భావిస్తూ అడుగడుగునా అవమానించడం ఆనవాయితీగా మారింది. ఈ నేపథ్యంలో అనేక మంది మన దేశానికి వలసవచ్చి మన సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవిస్తూ.. మన పాలనావిధానాలకు కట్టుబడి భారతదేశ సార్వభౌమాధికార నిబంధనలను తూ.చ.పాటిస్తూ దశాబ్దాలుగా జీవిస్తున్నారు. ఇటువంటివారికి నేనున్నాననీ...గౌరవ భారత ప్రధాని మోదీ ఎంతో ఉదారత్వంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎటొచ్చీ ఒక ప్రత్యేక వర్గం మన దేశంలోకి కేవలం అలజడులు సృష్టించడానికి వస్తూ..పోతూ వుంటుంది. ఈ వర్గం ద్వారానే భారతదేశంలో అనేకచోట్ల బాంబుల పేలుళ్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీరికి కాశ్మీర్ ప్రాంతం స్వర్గ్ధామంలా వుండేది. ఈ వర్గ ప్రజలు అనేక మెట్రో నగరాలతోపాటు సాదాసీదా పట్టణాల్లో కూడా తిష్టవేయడం ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం సర్వసాధారణమై పోయింది. ఇటువంటివారిని సమర్థిస్తున్న శక్తులే పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టం ద్వారా భారతదేశం మరింత పటిష్ఠంకానున్నది. అందుకే.. ‘‘పౌరసత్వ సవరణ చట్టం- భారత పరిరక్షణ చట్టం’’అంటూ దేశవ్యాప్తంగా పాదయాత్రల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలని భావించాము. ఈ యాత్రలు జనవరి 1న ప్రారంభమయ్యాయి. జనవరి 1న హైదరాబాద్ నందలి సుందరయ్య పార్క్ నుంచి కొన్ని వందల మందితో హైదర్‌గూడ నందలి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్ వరకు 3 కి.మీ.లు ప్రారంభ పాదయాత్ర చేశారు. తరువాత 5వ తేదీన కరీంనగర్‌లో ఇదే విధమైన పాదయాత్ర చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ యాత్రలు సాగనున్నాయి. దేశవ్యాప్తంగా పర్యటించబోతున్న షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనున్నారు.

- తిప్పినేని రామదాసప్పనాయుడు