సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఔదార్యం ఎక్కడ?
సంపద పెరిగినప్పుడు దానికి తగినటువంటి త్యాగము కూడనూ పెరగాలి. ఐశ్వర్యము పెరిగినప్పుడు ఔదార్యము కూడా పెరగాలి. కాని ఈనాడు ఐశ్వర్యము పెరుగుతున్నది కాని ఔదార్యము పెరగడం లేదు.
నగలంటే..
‘హస్తస్య భూషణం దానం
సత్యం కంఠస్య భూషణం
శ్రోత్రస్య భూషణం శాస్త్రం
భూషణైసె్తైః కరోతి కిమ్?’
హస్తమునకు దానంకంటె మరొక అలంకారము లేదు. మాటకు సత్యమే భూషణం. శాస్త్ర చర్చలే చెవులకు దివ్యమైన సౌందర్యం. ఇట్టి తరగని, పెరగని అలంకారం మానవుని యందుంచుకొని, అనిత్యమైన, అశాశ్వతమైన అలంకారముల నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు. ఎంత చిత్రం!
గణపతి త్యాగం
వ్యాసుడు భారతం వ్రాయటానికి కూర్చున్నాడట. అప్పుడు సహాయం చేస్తారని వినాయకుడు వెళ్ళాడుట. ‘వినాయకా! ఎంత దయామయుడవయ్యా! నీవునాకు చాలా ఉపకారం చేయటానికి వచ్చావు’, అంటూ వ్యాసుడు ‘నేను చెప్పినదంతా ఎక్కడా గంటం ఆపకుండా, మళ్ళీ అడక్కుండా చక్కగా వ్రాయాలని’, ఒక షరతు పెట్టాడు. గణపతి మాత్రం తక్కువవాడా! ‘నా గంటం నిలువకుండా వ్రాసేట్లు చెప్పాల’ని షరతుపెట్టాడు. వ్రాస్తూ వుండినప్పుడు గంటం విరిగిపోయిందట. అప్పుడు గణపతి చటుక్కున తన దంతము నొకదానిని విరిచి వ్రాయటం మొదలుపెట్టాడుట. ఆనాటినుండి గణపతి ‘ఏకదంతుడు’ అయినాడు. గణపతి ఎట్టి త్యాగముకైనా ఏమాత్రం వెనుకంజ వేసేవాడు కాదని దీనినిబట్టి తెలుస్తున్నది. ‘త్యాగేనైకే అమృతత్వ మానశుః’అని వేదములు కూడా ఘోషిస్తున్నాయి.
త్యాగపథం
ప్రాచీన శాస్త్రాలలో ఋషులు సాధనను చక్కగా వివరించారు. భగవత్ సృష్టిఅయిన ప్రకృతిని చూసి ఆశ్చర్యానందాలతో వారు భగవానుని లీలలను కీర్తించారు. త్యాగ పథాన్ని అనుసరించి ఆత్మదర్శనం సాధించేందుకు, శాశ్వతానందాన్ని అందుకొనేందుకు మానవుడు ప్రయత్నంచేయాలన్నదే మహర్హుల ఆదేశం.
రాముడు-్భష్ముడు
తండ్రి మాట జవదాటని తనయుడు రాముడు. తన సుఖం చూసుకొన్నవాడు కాదు. భీష్ముడుకూడా తండ్రికోసం పెండ్లి మానుకున్నాడు. రాముడు చేసిన త్యాగంకన్నా కూడా భీష్ముని త్యాగం గొప్పది. దశరథుడు తానిచ్చిన మాటకోసం కొడుకును అడవులకు పంపవలసింది పధ్నాలుగేళ్లే కాని శంతనుడు తన ఇంద్రియ సుఖంకోసం కొడుకును ఆజన్మ బ్రహ్మచారిగా వుంచేశాడు!
తండ్రి కోరిక అన్నది యిక్కడ ప్రధానం కాదు. సత్యానికీ, ధర్మానికీ కట్టుబడి వారు చూపిన ఆదర్శం త్యాగం!
ఘనతకు గీటురాయి
నందిని పందిని, తిమ్మిని బ్రహ్మిని చేసి గొప్పవాడివై పోవాలని ఆలోచిస్తున్నావేమో! చూడు. ఈ ప్రపంచం నేటికీ గుర్తుంచుకొని గౌరవిస్తున్న వారంతా ఏంచేశారు? వారికి అంత గౌరవం ప్రజలెందుకిస్తున్నారు? ఆలోచించు. త్యాగధనులనే సమాజం గుర్తుంచుకొంటోంది. నివాళులర్పిస్తోంది. ఎంతో దుర్ఘటమైన ఆత్మదర్శనం సాధించిన వారికే ఆరాధన లభిస్తోంది. కాని డబ్బూ దస్కం సంపాదనలో ముందుండటం కాదు ముఖ్యం.
జనన మరణ చక్రం
పుట్టినప్పుడే మనిషికి రిటర్న్ టిక్కెట్టు రిజర్వయే వుంది. అది జేబులో వుంచుకొనే, సంపాదిస్తున్నాడు, ఖర్చుపెడుతున్నాడు. కిందాపైనా అవుతున్నాడు. ఆటా, పాటా, ఏడుపూ, నవ్వూ అంతా సాగిస్తున్నాడు. కాని, గమ్యం మరిచిపోతున్నాడు. బతుకుబండి సాగేది చివరకు ప్రేతభూమికేనని అతడికి గుర్తులేదు. జనన మరణ చక్రంలో చిక్కుకున్న వ్యక్తి గొప్ప ఏముంటుంది? దానినుండి విడివడటమే గొప్ప.
అమృతస్య పుత్రః
సంసార చక్రంనుండి ఎప్పుడు బయటపడగలవు? మాయను జయించినప్పుడే! జనన మరణ వలయం నుండి కూడ నీకప్పుడే విముక్తి. ఆ స్థితిని నీవే పేరుతోనన్నా పిలువు. గమ్యాన్ని చేరటం అను; సాయుజ్యం అను; బ్రహ్మసాక్షాత్కారం అను; ఐక్యానుసంధానం అను, ఇంకా, ఏమంటావో నీ యిష్టం! పేరేదైనా కానీ, చేరే దొకచోటికే! ‘అమృతస్య పుత్రః’అన్నారు పెద్దలు జీవుడిని. అమృతత్వం నుండి జనించిన జీవాత్మ సాధించాల్సిందేమిటి? అమృతత్వమే!
ఇంకా ఉంది