సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్యాగంవల్లనే అమృతత్వం
నీవు కూడబెట్టిన సంపద నీది కాదు. నీవు నలుగురితోనూ పంచుకొనేదే నీది. సంపదను నీవు దాచుకోనవసరం లేదు. పదిమందికీ ఉపయోగపడేలా చేయవచ్చు. అప్పుడే సంపదకు శోభ. అందుకే ఉపనిషత్తులు: ‘త్యాగేనైకే అమృతత్వ మానశుః’ -త్యాగం చేతనే అమృతత్వం చేకూరుతుంది. (కాని, సంతానంవల్లా సంపదలవల్లా కాదు)- అని ఘోషిస్తున్నాయి.
తస్మాత్ జాగ్రత్త!
మీ పక్కింట్లో దొంగలు పడ్డారని తెలుస్తే మీరేంచేస్తారు? ఇంకా ఎక్కువ జాగ్రత్తపడతారు. రాత్రిళ్లు తలుపులు వేసున్నాయో లేదోనని ఒకటికి రెండుసార్లు చూస్తారు. బీరువాతాళం వేసుందో లేదో చూసుకుంటారు.
మరి పక్కింట్లో ఎవరైనా చనిపోయారని తెలుస్తే ఏంచేస్తారు? దొంగ మనింటికి ఎక్కడ వస్తాడో అని జాగ్రత్తతీసుకున్నట్లు, మృత్యువు వస్తే దానికి కూడ తగిన తయారీలో వుండాలికదా! ఉంటున్నారా? ఇళ్లు కడుతున్నారు, పొలాలు కొంటున్నారు. బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకొంటున్నారు. పిక్నిక్‌లకు పోతున్నారు. ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఇలా ఏవేవో చేస్తున్నారు. కాని ‘మృత్యువు లేని జీవితం’కోసం ఏం చేస్తున్నారు? త్యాగం ద్వారా, సేవద్వారా అమృతత్వం సిద్ధిస్తుంది కదా, అందుకు ప్రయత్నం చేస్తున్నారా? తెలివి కలవాడు చేయవలసిన పని ఏమిటి? తానెవరో, తానెందుకు వచ్చాడో, తానేంచేయాలో తెలిసికోవడం. అసలు పని వదిలిపెట్టి, ఎన్ని పనులు చేసి ఏం ప్రయోజనం?
పాపం, పరమాత్మ!
ఆత్మ అందరిలోనూ వుంది. అయితే, ఆ సంగతిని అనుభవపూర్వకంగా తెలుసుకొనటం అవసరం. అనాదిగా భారతీయుల దృష్టి ఆత్మదర్శనం పైనే వుంటూ వచ్చింది. ఆ దివ్యానుభూతిని పొందాలంటే స్థిరచిత్తంతో త్యాగ, సేవాభావాలతో ముందుకు సాగిపోవాలి.
కాని, ఇప్పుడలాంటి మనస్థైర్యం మనకు కనిపించదే! మన సమయం మనకే సరిపోదు. పరులకోసం ఏంచేస్తాం? పైగా, ఇవి ఫ్యాషన్ల రోజులు గదా! పొద్దున వేసికొనే డ్రస్సు మధ్యాహ్నానికి పనికిరాదు. మధ్యాహ్నానిది, సాయంకాలానికి పనికిరాదు.
గంటగంటకూ ఫ్యాషన్లు మారుతుంటాయి. మనం కోరింది దొరికితే దేవుణ్ణి పొగిడేస్తాం. కోరింది దొరక్కపోతే ‘ఈ దేవుడుండి వొరిగించిందేమిటి’అని దులిపేస్తాం! పాపం, పరమాత్మ!
విత్తినదే పండుతుంది
ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ మనుజ జన్మ. సంసార సముద్రాన్ని తరించటానికి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. భగవద్గీత ‘దేహమే క్షేత్రం’అంటుంది. క్షేత్రం అంటే పొలం. ఈ పొలంలో పుణ్యాన్నిగానీ, పాపాన్ని కాని నాటవచ్చు. విత్తినదే పండుతుంది. వేప విత్తునాటితే మామిడి మొక్క వెలువడదు. కనుక ఏ పంట పండించాలంటే దాని విత్తనాలనే ఎన్నుకోవాలి. త్యాగాన్ని నాటు. అమృతాన్ని పొందు. ఇదే ఉపనిషద్వాణి.
దైవానుగ్రహం
నీవు గుడికి వెళతావు. భగవన్మూర్తి సన్నిధిలో నిలుచుంటావు. కళ్లు మూసుకొని ప్రార్ధిస్తావు. ఎందుకు? ఆయన దర్శనం చేసుకోగల్గింది అంతర్దృష్టి మాత్రమే. అందుకే బాహ్యదృశ్యాలను చూసేందుకు మాత్రమే ఉపయోగపడే రుూ కన్నులను ఆయనముందు మూసుకోడం!
ఈ ప్రాపంచిక సంపదలకై పాకులాడకండి! అంతర్దృష్టిని అలవరచుకోండి. స్వామికోసం తపించండి! స్వామి అనుగ్రహాన్ని పొందండి.
మేధా ప్రదర్శన
‘దేవుడు లేడు’అనే వారు తమనుతాము లేరు అనుకుంటున్నట్లే; వారు తమ కీర్తిని కాదనుకున్నట్లే. అందరి మనసులలో ప్రేమ వుంది. అది ఏదో ఒకరూపంలో వుంది. నిజానికి ప్రేమేదైవం. కొందరికి పిల్లలంటే ప్రేమ. కొందరికి బీదలంటే ప్రేమ. కొందరికి తమ పని అంటే ప్రేమ. కొందరికి ఇతరులకు ఉపకారంచేయటం అంటే ప్రేమ. వారివారిలో వుండే ప్రేమకణాలకు అది ప్రతీక. వారి గుండెలలోని ఆనందానికి ప్రతీక. ఆనందం ఎంత కొంచెమయినా అది దైవాంశయే. అందులో శాంతి వుంది. నిస్సంగం వుంది. సానుభూతి వుంది. త్యాగం వుంది. వారి మనోఫలకంపై ఈ దివ్యాంశలన్నీ ప్రతిఫలించేవే. సద్గుణాలయొక్క ప్రశస్తిని తేల్చే మేధాప్రదర్శనలే అవన్నీ.
ట్రస్టీవి.. అంతే!
ఏది శాశ్వతం? ఆలోచించండి! కట్టుకున్న భవంతులా? కొనుక్కున్న పొలాలా? సంపాదించిన ఆస్తులా? పెంచి, పోషించుకుంటున్న కుటుంబమా? ఏది? ఇవేవీ నిలిచేవి కావు. అన్నిటినీ వదిలి చక్కాపోక తప్పదు. పొలాలు, పుట్రా అని ఎంత కొట్టుకులాడినా చివరకు పిడికెడు మట్టయినా పట్టుకుపోలేడు. చచ్చే ప్రతీ వ్యక్తీ ఓ పిడికెడు మట్టిని పట్టుకొనిపోయే వీలుంటే, రుూ భూగోళం ఎప్పుడో వట్టిపోయేది! మట్టికి కూడా మనవాళ్లు రేషన్ పెట్టేవాళ్లు.

ఇంకా ఉంది