సబ్ ఫీచర్

చలికి వెచ్చదనం ఇచ్చేదిలా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలి తీవ్రత చోటు చేసుకుంది. మెల్లగా సాయం త్రం మొదలై రాత్రులు బాగా పెరిగి మరుసటి రోజు పొద్దెక్కినా చలి విడవనంటుంది. పొగమంచు స్వైర విహారం చేస్తుంది. ఈ చలికాలంలో ఎన్నో సమస్యలు. ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో అస్సలు అశ్రద్ధ చెయ్యొద్దు. శరీరానికి వెచ్చగా ఉంచే ఆహారంతో పాటు.. శరీరంలో వ్యాధి కారకాలను నియంత్రించి అత్యుత్తమ ఆహారం తీసుకోవడం కూడా ఎంతో అవసరం.
వీచే చల్లనిగాలులు, కురిసే పొగ మంచు మనుషుల రూపురేఖలను మార్చేస్తుంది. ముఖ్యంగా పెదవులు, ముఖం, చేతులు, పాదాల మీద చలిగాలి ప్రభావం తీవ్రంగా వుంటుంది. చర్మం పొడారిపోయినట్లు అవటమే గాక దురద కూడా వుంటుంది. పెదాలు పగులుతాయి. ముఖంమీద చెమటపొక్కులు ఏర్పడతాయి. పాదాల చివర పగుళ్లు వస్తాయి. చర్మానికి ఏర్పడే ఇటువంటి మార్పులవల్ల చర్మపు సౌందర్యానికి అవరోధం కలిగి చర్మం బిరుసెక్కి ముఖం అందవికారంగా కన్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ అందానికి ఆరోగ్యానికి అనేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
చలికాలంలో చల్లని పచ్చగడ్డిపై నడవకూడదు. మంచు కప్పిన గడ్డపై పాదరక్షలు లేకుండా నడిస్తే జ్వరం, దగ్గు జలుబు వస్తాయి. ఇక వేడివేడిగా తిని ఆపై వెంటనే చల్లటి పదార్థం తినటం శరీరానికి చేటు. గరంగరం చాయ్ తాగి ఆపై ఐస్‌క్రీం మెక్కాలనుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరగటం, తగ్గటం అని, డైఫ్రూట్స్, జీడిపప్పు, పిస్తా, వేరుశెనగ పప్పు మితిమీరి తింటే జాండీస్, అజీర్ణం, అన్నం అరగకపోవటం, కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. చన్నీటి స్నానంవల్ల ఎముకల్లో నెప్పి, ఆరోగ్యానికే భంగం. చల్లని ఐస్‌క్రీం బాగా తిని ఆపై వేడి చాయ్ తాగరాదు. ఆరోగ్యానికి మంచిది కాదు. రక్తం గడ్డకట్టి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. గోరువెచ్చని స్నానం బెస్ట్. ఎలక్ట్రానిక్ రగ్గుల వాడకం విదేశాల్లో మంచు కప్పేచోట ఫర్వాలేదు కానీ మనకు అవి వద్దే వద్దు. గదిలో హీటర్ బాగా చలిగా వున్నపుడే వాడాలి. హీటర్ని వాడేటప్పుడు ఒక పాత్రలో నీటిని నింపి ఉంచాలి. గది తలుపు తెరిచే ఉంచాలి. దానివల్ల కార్బన్ డై ఆక్సైడ్ బైటికి పోయి, ఆక్సిజన్ లోపలికి వస్తుంది. మన దేశంలో చలికాలంలో పదిమందిలో ఒకరు ఈ హీటర్‌వల్ల కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి అయి చనిపోతున్నారట. జంక్‌ఫుడ్, వేపుళ్ళు తినరాదు. పళ్లు, సూప్స్ తీసుకోవాలి. రాత్రి తిండి ఎక్కువైతే బరువు, లావు పెరగడం ఖాయం. నీరు కనీసం 8 గ్లాసులు తాగాలి. సూర్యకాంతి తగ్గటంవల్ల శరీరంలో స్టోర్ అయి ఉన్న బ్రెయిన్ కెమికల్ తగ్గుతుంది. అందుకే మాటిమాటికి ఏదేదో తినాలన్పిస్తుంది. ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, సెనగ, పెసరపప్పులు తినాలి. శీతాకాలంలో ప్రకృతి సహజ రంగులున్న కూరలు తినాలి. క్యారెట్, క్యాబేజీ, టమోటా, ఉల్లి సలాడ్స్ తింటే ఉత్తమం. చలికి దాహం అన్పించదు కానీ ఆకలేస్తుంది.
చలికాలంలో సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ వల్ల మనకి ఎప్పుడు సంతోషం, ఎప్పుడు దుఃఖం కలుగుతుందో చెప్పలేం. మన మూడ్స్ మారుతుంటాయి. దీనే్న మూడింగ్ డిజార్డర్ అని అంటారు. యువకులు ఈ సీజన్‌లో హార్మోనల్ ఇన్‌బాలెన్స్‌కి గురవుతారు. చదువు, కెరీర్‌ని గూర్చిన దిగులు వేధిస్తుంది. స్ర్తిలు కుటుంబ సమస్యలు, మెనోపాజ్‌వల్ల చిటచిటలాడుతారు. అందుకే మన మూడ్ బాగుండేలా పాజిటివ్ థింకింగ్ రావాలి.
శీతాకాలంలో పసివారి సంరక్షణ
అన్ని కాలాలకి పెద్దవారు తట్టుకోగలరు కానీ పసికూనల సంగతేంటి? చలికి వారు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతారు. జలుబు, దగ్గు, ముక్కుదిబ్బడ, ఊపిరాడకపోవడం, జ్వరం, చెవి, గొంతు ఇన్‌ఫెక్షన్ ఇలా ఎన్నో బాధలు. పసివారిలో వైరస్ త్వరగా దాడిచేసి వారిని, తల్లిదండ్రులను అతలాకుతలం చేస్తుంది. డాక్టర్‌కు చూపి మందులు వాడుతున్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శిశువుని బాగా శుభ్రంగా ఉంచాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. శుభ్రంగా తుడవటం చేయాలి. రాత్రి పొత్తిగుడ్డలు మారుస్తుండాలి. బాగా బిగుసుకుపోయేలా ఉన్ని దుస్తులు వేయరాదు. చెమటలు పట్టి, చలివేసి ఆపై జలుబు, దగ్గు దాడి చేస్తాయి. మొహాన్ని బట్టతో కప్పరాదు. స్నానం చేయించాక పొడి దుస్తులు తొడగాలి. ఏడాదిలోపల పిల్లల తలభాగం చాలా సున్నితంగా ఉంటుంది. మెత్తటి నూలు బట్టని స్కార్ఫ్‌లాగా తలకి అమర్చి ఆపై నూలు టోపీ పెట్టాలి.
శీతాకాలం ఫ్యాషన్లు
చలికాలం బాగా బ్రైట్ కలర్స్, టైట్స్ ఫ్యాషన్‌గా మారాయి. సరియైన టాప్, షూస్‌తో వేసుకోకుంటే అంతా గడబిడే. ప్లెయిన్ సెల్ఫ్ కలర్డ్ టైట్స్ బాగా పాపులర్. వీటితో పంప్, హైహీల్, ఓపెన్ ఏర్ శాండిల్స్, షూస్ బాగుంటాయి. చలేస్తుంటే ట్యూనిక్‌లో బ్లేజర్ కూడా ధరించాలి. భారీకాయంవారు గాఢ రంగులో వున్న టైట్స్ ధరించాలి. నేడు ఎక్కడ చూసినా లెగ్గింగ్స్ మంచి ఫామ్‌లో ఉన్నాయి. కార్డిగన్, పులోవర్ మంచి స్మార్ట్‌లుక్ ఇస్తాయి. ప్రస్తుతం బాయ్‌ఫ్రెండ్ జాకెట్స్ హవా నడుస్తోంది. ఇంబెలిష్ట్ జాకెట్, స్కర్ట్ వెల్వెట్‌వి అయితే గ్లామరస్ లుక్ వస్తుంది. బ్రౌన్, ఖాకీ, బ్లాక్‌తో బ్రైట్ పింక్ బటర్ కప్ ఎల్లో, లైమ్ గ్రీన్ చాలా అందాన్నిస్తాయి.
ఈ వెచ్చని సూత్రాలు చక్కగా పాటిస్తే కవి చెప్పినట్టు శీతవేళను గదిలోకే కానీ మదిలోకి రాదు.. రానీయకూడదు.

- కంచర్ల