సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తపాలా బిళ్ల
ఉత్తరాన్ని రాసింది సూపర్‌ఫైన్ కాగితం పైనే కావచ్చు. కవరెంతో ఆకర్షణీయంగా వుండొచ్చు. ఇక ఉత్తరమా? కవితా సోయగాలు అందులో జాలువారుతుండవచ్చు. కాని ఆ వుత్తరం చిరునామాదారునికి చేరాలంటే యివేవీ పనికిరావు. తగిన తపాలా బిళ్ల అంటించాలి.
తప్పట్లూ, తాళాలూ, వనె్నలూ, చినె్నలూ ఎన్నున్నా ‘్భక్తి’అన్న తపాలా బిళ్ల తగిలించనిదే నీ ప్రార్థన భగవంతునికి చేరదు.
శ్రద్ధ-సబూరి
షిర్డీలో రెండు రూపాయలు తీసుకొనేవారని మీకు తెలుసు. ఆ రెండు రూపాయలు దేనికోసము? అవే శ్రద్ధ, భక్తి. శ్రద్ధలేకపోతే భక్తి లేదు. భక్తి లేకపోతే శ్రద్ధరాదు. ఈ రెండు కూడనూ ఒక విత్తనంలోని రెండు బ్రద్దల వంటివి. ఈ రెండు బ్రద్దలూ చేరినప్పుడే మధ్యనుంచి ముక్తి అనే మొక్క మొలుస్తుంది.
దిగి రావటం
ఆత్మ శక్తితో క్రియాశక్తి. యోగశక్తి కలిసి అవతరించాయి. అవతారం అంటే దిగిరావటం- దివినుండి భువికి దిగిరావటం అని అర్థం. అది న్యూనత కాదు. ఉయ్యాలలో బిడ్డ ఏడుస్తుంటే, తల్లి వచ్చి వంగి బిడ్డను ఎత్తుకుంటుంది. అందులో ప్రేమే గాని న్యూనత లేదు. భక్తి, నమ్మకం పెంపొందించుకో, భగవాన్ నిన్ను రక్షిస్తాడు. అలాకాక లోపాలను పెంచుకుంటూ పతనవౌతూ రక్షించమంటే ఎలా?
‘నన్ను రక్షించు!’అని నీవెంత ఆదుర్దాగా అర్థిస్తున్నావో, భగవంతుని క్కూడా నిన్ను రక్షించాలని అంత ఆదుర్దా వుంటుంది. దారితప్పిన వారి పట్ల కూడా ఆయనకు ప్రేమా, కరుణా కలుగుతుంటాయి. ఆయనను ‘్భక్త్భాష్టప్రదాయకా!’ (్భక్తుల కోరికలు తీర్చేవాడు) అని పిలుస్తాం.
మీరంటుంటారు: ‘స్వామి ఎందుకో తనలోతాను నవ్వుకుంటుంటారు’- అని, భక్తులు నా హృదయాన్ని వశం చేసికోగలిగినప్పుడల్లా నాకు కలిగే ఆనందానికి గుర్తు అది!
అర్హత
నీవు గొప్ప పండితుడవు కావచ్చు. గొప్ప చక్రవర్తివి కావచ్చు. గొప్ప యోధాగ్రేసరుడివి కావచ్చు. దరిద్రంతో కుమిలిపోయే ఒక దౌర్భాగ్య జీవివి కావచ్చు. నీవెవరివైనా సరే! భగవంతునియందు భక్తివుంటే తరిస్తావు లేకపోతే నిన్ను ఎవరూ పట్టించుకోనవసరం లేదు. నీకు ఏరకమైన గౌరవాదరాలకు అర్హత లేదు.
కాయికమే కైలాసం
భగవధ్యానం సత్కారక్షేమం. అప్పుడు పాడుపనులకు సమ యం వుండదు. ఇంకొకరిని దూషించటానికీ, మరొకరికి అపకారం చేయటానికీ వీలుండదు. ఏది జరిగినా అది ఆయన దయే అనుకుంటావు. ప్రేమలో బ్రతుకును ఓలలాడించుకోగల్గుతావు. అలావుంటే గృహమే స్వర్గసీమ అవుతుంది. నీ మనసులో కలిగే హాయి వైకుంఠానికి ప్రతీక. నీ కర్తవ్యం పట్ల నీవు చూపే దీక్ష కైలాసానికి గుర్తు. (కాయికమే కైలాసం!) ఈ ఆశయాలకు అంకితమైన హృదయాలు సాక్షాత్తూ బంగారమే.
భక్తి వ్యాపారం కారాదు
తీర్థయాత్రలవల్ల ఆధ్యాత్మికంగా పురోగతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. తిరుపతి, రామేశ్వరం, బదరీ, అమరనాథ్ వంటి క్షేత్రాలను దర్శిస్తుంటారు. తమ యిబ్బందులు తొలగిపోవాలని ప్రార్థిస్తుంటా రు. మరికొంతమంది లాటరీ తగలాలనో, మరేదో లాభంకలగాలనో కోరుకుంటూ, అనుకున్నది అయితే తల వెంట్రుకలు స్వామికి యిస్తామని మొక్కుతుంటారు. స్వామికి వాళ్ల జుట్టుతో ఏం పని? ఈ బేరసారాలు కేవలం ఆత్మవంచన. భగవంతుని వంచించాలన్న ప్రయత్నం.
‘కీర్తి, ప్రతిష్ఠ: సిరీ, సంపద: ఆస్తి, అంతస్థు లభించాలి. తలపెట్టిన పనులుకావాలి’- భగవంతుని ఇలా ఏదీ అడక్కూడదు. నిజమైన భక్తుడు దేవుని ప్రార్థిస్తాడు కాని దేనినీ అడగడు.

ఇంకా ఉంది