Others

ఆనాటి సంక్రాంతి సొబగులేవీ!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచీకరణ మనిషిని మనిషిగా ఉంచడం లేదు. మరబొమ్మగా తయారు చేస్తున్నది. కార్పొరేట్ శక్తుల మాయాజాలంలో పడి మనిషి అనివార్యంగా ప్రపంచీకరణ వైపు సుముఖంగా తలఊపాల్సి వస్తున్నది. ఇటీవల కాలంలో గ్రామాలలో చూస్తే, ఆ గ్రామంలోని నివసిస్తున్న యువత మరియు ఉద్యోగులు ఒక గ్రామకమిటీగా ఏర్పడి సంక్రాంతి మూడురోజుల నిడివి లోనూ పలు కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్రయత్నిస్తున్నారు. తద్వారా నేడు మరచిపోతున్న, అంతరించిపోతున్న సంక్రాంతి సంబరాలను ఆస్వాదించేందుకు గాను ప్రజలు ఆరాటపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు విదేశాలలో ఉండే ప్రవాస భారతీయులకు కలుగుతుంది. ఎందుకంటే వారు చిన్నతనంలో అనుభవించిన సంక్రాంతి పండుగ మధుర క్షణాలను నెమరు వేసుకొని విదేశాలలో జరుపుకునేందుకు గాను ప్రయత్నం చేయడం సర్వసాధారణమే. ఇంకా ఈమధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అనే తేడా లేకుండా సంక్రాంతి సెలవులకు ముందే, ముందస్తుగా ‘‘సంక్రాంతి సంబరాలు’’ పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ విధానాలను బట్టి చూస్తే, మనకు ఏమనిపిస్తుంది? అనేది చర్చించాల్సిన విషయమే.
భారతదేశం దాదాపుగా 90వ దశకం నుండే ప్రపంచీకరణకు తలుపులు తెరిచింది. ప్రపంచీకరణకు దారులు తెరవక ముందు రోజులలో అనగా 80వ దశకం వరకూ, వివిధ పండుగలు పబ్బాలు జరుపుకునే తీరు ఒకరకంగా ఉండేది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో అనగా తమిళనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లలో సంక్రాంతి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలు జరుపుకునేవారు. సంక్రాంతి పండుగను మన దేశ ప్రజల జీవన విధానంలో ముఖ్య భాగంగా అభివర్ణించవచ్చు. మరీ ముఖ్యంగా మన తెలుగు లోగిళ్ళలో ఉండే ప్రజలకు మధురాతి మధురమైన క్షణాలను అందించే మూడు రోజుల ‘‘పండుగగా’’ పేర్కొనవచ్చు. సంక్రాంతి పండుగ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా జరుపుకునే పండుగ. మహిళలు, పురుషులు అనే అంతరాలు లేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా కుల వృత్తుల వారు మరియు రైతులు సంతోషంగా జరుపుకునే పండుగ. యావత్తు తెలుగు జాతి తమ సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే పండుగగా సంక్రాంతిని చెప్పవచ్చు. అలాంటి పండుగ నేడు తన స్వాభావికతను కోల్పోవడం విచారకరం. ఇలా కృత్రిమంగా పొందే ఆనందాలకు అమరత్వం ఉండదు. ఆయా వేళల్లో, ఆయా రోజుల్లో సహజసిద్ధంగా జరిపే కార్యక్రమాల వల్ల వచ్చే ఆనందానికి అవధులు ఉండవు. ప్రకృతిలో మమేకమవుతూ స్వాభావికంగా ప్రజలు జరుపుకునే పండగ నేడు గాడి తప్పడం బాధాకరం.
‘‘సంక్రాంతి తల్లి సకల సౌభాగ్యాలనిచ్చే కల్పవల్లి.. సైరికులకు పౌష్యలక్ష్మిని ప్రసాదించే సిరులతల్లి...’’ సంక్రాంతి పండుగ నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి రోజుతోనే ప్రారంభ మవుతుంది. ఈ విషయంలో వైదికులు మరియు పౌరాణికులు అనేక కథలను వల్లె వేయడం అనాదిగా జరుగుతూనే ఉంది. సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే మూడు రోజులు పండుగ. కొన్ని ప్రాంతాలలో అయితే భోగి, సంక్రాంతి, కనుమ మరియు ముక్కనుమలుగా 4 రోజులు కూడా జరుపుకోవడం చూస్తుంటాం. కానీ వాస్తవానికి ఇది నిరాఘాటంగా సాగే నెల రోజుల పండుగగా చెప్పవచ్చు. ఎందుకంటే ‘‘నెలగంటు’’ పెట్టిన నుండి ఏకధాటిగా నెల రోజులు పాటు అనేక పూజాది మరియు వినోద కార్యక్రమాలతో ప్రజలు ఈ పండుగను అత్యంత ఉత్సాహంతో జరుపుకోవడం జనపదాలలో చూస్తుంటాం. నెల రోజుల పాటు ప్రతీ పల్లెటూరూ సంక్రాంతి శోభతో కళకళలాడుతాయి. ప్రతీ ఇంటినీ పరిశుభ్రం చేసే పనిలో జనాలు నిమగ్నమై ఉంటూ, సున్నాలు మరియు రంగులు అద్ది రమణీయంగా తయారు చేస్తారు. వీధులను శుభ్రం చేసి నెలంతా ప్రతీ ఇంటి ముందు ధనస్సు, రథము ఇత్యాది రంగు రంగుల ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తున్నది.
భోగి పండుగ ముందురోజు వరకు గ్రామాలలో నివసించే సకల చేతివృత్తులు, కులవృత్తులు, రైతులు మరియు శ్రామికులు తమ పెద్ద పండుగ పనుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంటారు. రైతులు చేను కోతలు, పంట నూర్పులు, పంట తయారీ, పంటలను అమ్మడం మొదలగు వ్యవసాయ పనులతో తీరిక లేకుండా ఉంటారు. అంటే సంక్రాంతి రోజులే, రైతుకు ఫలసాయం అందే రోజులన్నమాట. పంటలు అమ్మగా వచ్చిన డబ్బుతో రైతు తన కుటుంబానికి గాను సంక్రాంతి పండుగ నిమిత్తం అవసరమైన దుస్తులు మరియు వస్తువులను కొనుగోలు చేస్తారు. శ్రామికులు అయితే తమ కర్మాగార యాజమానులు ఇచ్చే అడ్వాన్స్, బోనస్ మరియు వేతనాలతో తమ పండుగ అవసరాలను తీర్చుకుంటారు. కులవృత్తుల వారు అయితే తమ వృత్తి పనులను క్షణం తీరిక లేకుండా కొనసాగించి, సంపాదించిన మొత్తంతో సంక్రాంతి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ కోసం పిల్లాది మొదలు పెద్దల వరకు అనేక పనులను హుషారుగా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. భోగి రోజున భోగిమంట పెద్దదిగా వేసేందుకుగాను కర్రలు, దుంగలు, కంపలు కొట్టి నెలరోజులుగా సమకూర్చుతూ ఒక చోట ఉంచుతారు. పిల్లలు అయితే తమకు దొరికే ప్రతీ కర్రాకంపా తీసుకువచ్చి అందులో వేస్తుంటారు. పక్క వీధి వారి భోగిమంట కన్నా, తమ భోగిమంటలు పెద్దగా ఎగిసిపడాలని పిల్లలు పోటీ తత్వంతో ఉవ్విళలూరుతుంటారు. నేడైతే అప్పటికప్పుడు కట్టెలు, దుంగలు కొనుక్కొని భోగిమంట వేసుకునే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి పొలాల్లో ఉండే పెద్ద పెద్ద పణుకు(రాయి) మరియు ఇంటి గోడలపై పేడను నీటితో కలిపి ముద్దగా చేసి భోగి పిడకలగా తయారు చేస్తుంటారు. ఆ పిడకలు ఎండిన తర్వాత అందమైన దండలుగా కుడతారు. ఆయా భోగి పిడకలను తల్లి పిడక, పిల్ల పిడక అనే రకరకాల పేర్లు పెట్టి వివిధ ఆకారాలతో తయారు చేయటం విశేషం. ఈ పరిస్థితి నేడయితే గ్రామాల్లో కనబడటం లేదు. నేడు ‘‘గోమాత బ్రాండ్’’ పేరిట బజార్లో భోగి పిడకల అమ్మకం కూడా జరుగుతోంది. సంక్రాంతి అంటే రకరకాల పిండి వంటలు వండడం, వాటిని పెద్దలకు నైవేద్యంగా సమర్పించడం, కొత్తబట్టలు ధరించడం, అల్లుళ్లను ఆహ్వానించడం, పతంగులు ఎగురవేయడం, ముగ్గుల పోటీలు, భోగి పళళు పిల్లలపై జల్లడం, గంగిరెద్దులు వారి నాదస్వర గీతాలు, డు డు బసవన్న నాట్యాలు, ఎడ్లబండ్ల పోటీలు, బొమ్మల కొలువులు, హరిదాసు కీర్తనలు, గొబ్బెమ్మ పాటలు, పేరంటాల సందళళు, బావ మరదళ్ల గిలిగింతలు, జంగాల పొగడ్తలు, దాసరులు పాటలు, కోడి పందాలు, పొట్టేళ్ల పోటీలు, చెడుగుడు ఆటలు, సాముగరిడీలు, పశువుల పూజించడం, వాటి కొమ్ములకు రంగులు పూయడం మొదలగు గ్రామీణ కళలు మరియు కళారూపాలకు ఆలవాలమై ఉంటుంది.

- పిల్లా తిరుపతిరావు 7095184846