సబ్ ఫీచర్

హింస, అబద్ధాలు, పదవులే ప్రజాస్వామ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరసత్వ సవరణ చట్టం గురించి కెటిఆర్ నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. అమెరికాలో చదివిన విద్యావంతుడు లోక్‌సభ రాజ్యసభల్లో పాసయిన ఈ బిల్లును ‘బిజెపి పాచిక’అంటున్నారు. మజ్లిస్‌తో బంధం ఆయన్ను, ఆయన పార్టీని కళ్ళుమూసుకునేలా చేస్తోంది. నెగెటివ్ రాజకీయాల్లో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ, యితర పార్టీలు ముస్లిం సోదరుల్ని రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాయి. వ్యతిరేకించడం తప్ప ప్రజలకనుకూలంగా వ్యవహరించడం ఈ పార్టీలకు చేతకాని విషయం. అందుకే చట్టసభల్లో ఓడినా, లోక్‌సభలో గెలవాలన్న పంతంతో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈ పార్టీలు ఎంత వ్యతిరేకిస్తే అంతగా పాలకపార్టీ మెజారిటీ ప్రజాబలం పెరుగుతుందని 2019 ఎన్నికల్లోనూ ఋజువయింది. చట్టంపై కనీస అవగాహన కొరవడి నిరసనను హింసగా మారుస్తున్నారు. నెటిజన్ల మద్దతుంటే సిటిజన్ల మద్దతున్నట్లేనని కెటిఆర్ భావిస్తే పొరపాటే. ఎన్నికలు తప్ప మరో ఆలోచనలేని పార్టీలివి. ఇది నిజంగా ఎన్నికల కోసం కాదని పాలక పార్టీ కేంద్రంలో చెబుతూనే వుంది. అదే అయితే 2023లో ఈ చట్టం తెచ్చేవారు. శరణార్థులుగా వచ్చిన వారిలో 80 శాతం మంది దళితులే. ‘బిజెపి’ని మొదటినుంచి దళిత వ్యతిరేక పార్టీ అని అపప్రచారం చేసినవారు యిపుడు చేస్తున్నదేమిటి? ‘సబ్‌కా వికాస్ మంత్రంతో’ మోడీ ప్రభుత్వం గత 5 1/2 ఏళ్ళలో 2కోట్లు యిళ్ళు కడితే, అందులో 31 శాతం మైనారిటీలకు కేటాయించారని ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పారు. తాజాగా పాకిస్తాన్‌లో నాన్ కానాసాహెబ్ గురుద్వారా మీద జరిగిన రాళ్ళ దాడి, అంతకుముందు సిక్కు యువతిని బలవంతంగా మతం మార్చడం, పెళ్ళి చేసుకోవడం, యివన్నీ పాకిస్తాన్‌లో మైనారిటీల మీద జరుగుతున్న అత్యాచారాలకు నిదర్శనం. ఇలా జరగడాన్ని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దోస్త్ నవజ్యోత్‌సింగ్ సిద్ధూ అంగీకరిస్తారా? నాన్‌కాన్‌సాహెబ్ పేరు మారుస్తామని, సిక్కులను యిక్కడ అనుమతించమని, వారిని బతకనివ్వమని బహిరంగంగా దాడులు జరిపినవారు నినదిస్తుంటే కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్ ‘అది సమస్యేకాదు’ అంటూ నవ్వుతూ దాటవేయడం చూస్తుంటే నిజాన్ని అంగీకరించే నీతి రీతి కొందరు నేతల్లో కొరవడిందనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో వారు చెప్పిందే వేదం. కనీసం దాడిని ఖండించేందుకూ గులాంనబీ అజాద్ సిద్ధపడలేదు. నిజానికి నాన్‌కానాసాహెబ్, సిక్కు మతస్థాపకుడు గురునానక్ జన్మస్థలం. సిక్కులకు పవిత్ర స్థలం. గతంలో ఈ గురుద్వారా రక్షణకోసం 250 మంది వీరులు బలిదానమయ్యారు. కేరళ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం తమ రాష్ట్రంలో అమలుచేయమని అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ ఆ తీర్మానానికి చట్టబద్ధత లేదని గవర్నరు ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్ అన్నారు. పౌరసత్వం కేంద్ర పరిధిలోని అంశమని, రాష్ట్రాలకు ఈ విషయమై ఏ అధికారమూ లేదని అన్నారు.
సిఎఎ అమలు విషయంలో అంగుళం కూడా వెనక్కు తగ్గమని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈమేరకు అమలుకై కేంద్రం చురుకుగా వ్యవహరిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. కేంద్రం యిందుకోసం ఓ యాప్‌ను కూడా సిద్ధంచేస్తోంది. అమిత్‌షా మోదీకి సమర్ధనగా 8866288662 నంబరుకు కాల్ చేయమని కూడా ప్రజల్ని ప్రేరేపిస్తున్నారు. సిఎఎకు వ్యతిరేకంగా ఈనెల 10న శుక్రవారంనాడు మసీదులో ప్రార్థనల అనంతరం ర్యాలీకి మజ్లిస్ పార్టీ యోచన చేసింది. శుక్రవారంనాడే ఎందుకు చేశారో ఒవైసీ చెప్పాలి. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన హింస కూడా శుక్రవారంనాడే మసీదు ప్రార్థనల అనంతరం జరిగింది. భాజాపాను రాజకీయంగా ఎదుర్కోలేక హైద్రాబాద్‌లో జనవరి 4న జరిగిన ర్యాలీ అధికార తెరాస అన్ని రకాల మద్దతునందించడం చర్చనీయాంశం అయింది. మరోపక్క దేశవ్యాప్తంగా సిఎఎపై అవగాహన కార్యక్రమాలను, జనజాగరణను చేపట్టడం ద్వారా కేంద్రం ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నది. సిఎఎను వ్యతిరేకిస్తున్న వారికి హఠాత్తుగా జామియామిలియా విశ్వవిద్యాలయం విద్యార్థుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. కానీ విద్యార్థులతోబాటు 250 మంది బయటి ప్రజలు పోలీసులపైకి రాళ్ళు విసిరారు. అంతాకలిసి అనేక బస్సులు తగలబెట్టారు. దాన్ని మీడియా కొండంతలు చేసి టిఆర్‌పి పెంచుకునేందుకూ ప్రయత్నించింది. కానీ ప్రభుత్వం పోలీసులు మాత్రం ఆందోళనకారులపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదట, కానీ హింస, విధ్వంసం మాత్రం జరగచ్చట. హింస ఎక్కువగా బిజెపి పాలిత ప్రాంతాలలో జరగడం చూస్తే హింసను ఎవరు ప్రేరేపించారో అర్థమవుతున్నది.
దేశ విభజన జరిగిన రోజున 15 ఆగస్టు 1947న నెహ్రూ మాట్లాడుతూ రాజకీయ సరిహద్దుల మూలంగా మననుండి వేరుపడిపోయిన మన సోదర సోదరీమణులు ఈ సంతోష సమయాన్ని మనతో పంచుకోలేక పోతున్నారు. వాళ్ళు ఎప్పటికీ మనవాళ్ళే, వాళ్ళ బాగోగులు మనవే అన్నారు. 15 నవంబరు 1950లో పార్లమెంటు నుద్దేశించి ఆయనే మాట్లాడుతూ విభజన సమయంలో యిక్కడికి వచ్చిన వారందరికీ పౌరసత్వం యివ్వాల్సిందే. అందుకు చట్టపరమైన అడ్డంకులు ఏవైనా ఉంటే చట్టాన్ని సవరించాల్సిందే అన్నారు. 26 సెప్టెంబరు 1947న మహాత్మాగాంధీ కూడా ‘పాకిస్తాన్‌లో నివశిస్తున్న హిందువులు, సిక్కులకు అక్కడ సుఖంగా, శాంతిగా జీవించడానికి తగిన పరిస్థితులు లేవనిపిస్తే వారు వెంటనే నిరభ్యంతరంగా భారత్‌కు రావచ్చును. అలాంటి వారిని తప్పక ఆహ్వానించాలి, అన్నారు. 25 నవంబరు 1947న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం కూడా ‘శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులందరికీ ఆశ్రయం కల్పించాలి’ అని చెబుతున్నది.
ఇదిలా వుండగా కేంద్రం నుంచి ఎన్‌పిఆర్ ప్రకటన వెలువడింది. జనాభా లెక్కల సేకరణ 2011 తరువాత ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 30లోగా పూర్తిచేస్తామని ప్రకటన యిచ్చింది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి కంటగింపైంది. జనాభా లెక్కల సేకరణ గత 70 ఏళ్లుగా జరుగుతున్నదే. మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి జనగణన యిది. ఇందుకోసం రూ.8,500 కోట్లు ఖర్చును కేంద్రం మంజూరుచేయనుంది. భారత్‌లో నివసిస్తున్న ప్రజానీకం వివరాలను సేకరించే ప్రక్రియ యిది. 1955 పౌరసత్వ చట్టం, పౌరసత్వ నియమావళి 2003 ప్రకారం 6 నెలలపాటు అంతకు ముందు భారత్‌లో నివసిస్తున్న వారిని పౌరులంటారు. ఆధార్, చరవాణి, పాన్, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ ఐడి, భారత్ పాస్‌పోర్టు వంటి వివరాల సేకరణ జరుగుతుంది. పౌరుడి పేరు, తల్లిదండ్రులు, పుట్టిన తేదీ, వివాహం వివరాలు, చిరునామా, చేస్తున్న పని, చదువు యిలా అన్నిటినీ సేకరిస్తారు. 2015లో కంటే సమగ్రంగా యిది జరుగనుంది. అస్సాంలో నేషనల్ రిజిష్టర్ ఫర్ సిటిజన్స్ తయారీలో వుండడంతో అస్సాంను ఈ ప్రక్రియలో మినహాయించారు. జనగణనలో అనేక అంశాలను జోడించారు. ప్రభుత్వ కుటుంబ సంక్షేమ పథకాలకు అర్హులైన పేదలను గుర్తించే దిశలో సమాచార సేకరణ చేస్తారు. లేకపోతే పథకాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదముంది. జనానికి రక్షిత నీటి సౌకర్యం వుందా? మరుగుదొడ్డి వుందా? వంటి వివరాలు సేకరించడం సౌకర్యాల అవసరాన్ని, ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడంకోసమే. శోషణముక్త, సమతాయుక్త సమాజ నిర్మాణానికి ఈ విషయాలు ప్రాతిపదిక అవుతాయి. కాని కాంగ్రెస్ యితర పక్షాలకు దీన్నికూడా విమర్శించడం, దీన్ని ఎన్‌ఆర్‌సికు లింకుపెట్టి మాట్లాడడం, దీనిపై కూడా అసత్యాలు ప్రచారం చేయడం మామూలయిపోయింది. ఎన్‌ఆర్‌సి కేవలం అస్సాంకే పరిమితమని ప్రధాని చెప్పారు కూడ. దేశమంతా ఎన్‌ఆర్‌సి అమలు విషయంలో ఏ స్థాయిలోనూ యింకో నిర్ణయం జరగలేదు. బంగ్లాదేశ్‌లో పౌరసత్వ చట్టం ఎన్‌ఆర్‌ఐసి పేరున, ఆప్ఘనిస్తాన్‌లో ఇ-తజ్‌కేరా పేరున, పాకిస్తాన్ ఎన్‌ఎడిఆర్‌ఎ పేరున వుంది. మనకు మాత్రం ఏ చట్టం అక్కరలేదా? ఎన్‌పిఆర్ గురించి నాడు గృహమంత్రిగావున్న చిదంబరం అనేక ప్రశ్నలకు సమాధానం యిస్తూ ఎన్‌పిఆర్ ద్వారా, రెసిడెంట్ కార్డ్ యివ్వబడుతుందని, తరువాత అది సిటిజెన్‌షిప్ కార్డు యిచ్చేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. కాని నేడు ఆయన మాట మార్చి రాజకీయం చేస్తున్నారు. సిఎఎ చట్టం అమలును వ్యతిరేకిస్తున్న ఆందోళనల్లో హింస ప్రజ్వరిల్లచేసిన అసాంఘిక శక్తులను యుపి పోలీసు యంత్రాంగం గుర్తించింది. సిమి నుంచి పేరుమార్చుకున్న పి.ఎఫ్.ఐ ఈ దాడుల్లో తుపాకులు కూడా ఉపయోగించింది. పిఎఫ్‌ఐ మీద గత రెండేళ్ళుగా నిఘా వున్నప్పటికీ నిషేధం దిశగా కేంద్రం అడుగులు వేయలేదు. అదో తీవ్రవాద మతోన్మాద సంస్థ. ముస్లింలు ఎదుర్కొనే సమస్యలపైకాక ఈ సంస్థ ప్రజల జీవించే హక్కునే ప్రశ్నిస్తున్నది. అనేక తీవ్రవాద ముఠాలతో సంబంధాలు, ఆయుధాలు కల్గివుండడం, కిడ్నాపులు, హత్యలు చేయడం, విద్వేషాలు రెచ్చగొట్టడం, అల్లర్లు, లవ్ జీహాదీ వంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ యిది. నవంబరు 2012లో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈ సంస్థ దేశమంతా ప్రదర్శనలు జరిపింది. కేరళ కేంద్రంగా ఈ సంస్థ అనేక విచ్ఛిన్నకర కార్యకలాపాలు సాగిస్తోంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ, బీహార్, ఝార్ఖండ్, ఒరిస్సాల్లోని కొన్ని భాగాలు కలిపి గ్రేటర్ ఇస్లామిక్ బంగ్లాదేశ్ ఏర్పాటు దేశంగా ఈ సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. హిందుత్వ ఫర్ ఛేజింగ్ టైమ్స్ పుస్తకంలో ఆర్‌యస్‌యస్ సిద్ధాంతకర్త శ్రీ నందకుమార్ వివరించారు. మే 2013లో ఎన్‌ఐఎ దర్యాప్తులో సురేంద్ర, విఘ్నేష్ అనే యిద్దరు బాలురను 2011లో కిడ్నాప్ చేసి, హత్య చేసినందుకు ఐదు కోట్ల రూ.లు ఈ సంస్థ తమ నిధికి జమచేసుకుందని తేలింది. 2012లో కేరళ ప్రభుత్వం పిఎఫ్‌ఐకు 27 హత్యలతో సంబంధం వుందని హైకోర్టుకు తెలిపింది. పిఎఫ్‌ఐ భయంతో పూనా, చెన్నై, హైద్రాబాద్, ఢిల్లీలనుండి సుమారు 30,000 మంది ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమ తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. పిఎఫ్‌ఐ తీవ్రవాద నేపథ్యం బయటపెట్టినందుకు అర్నబ్ గోస్వామి అనేక సం.లు పనిచేసిన టైమ్స్ నౌ భారత్‌ను నిషేధించమని ఉద్యమం చేసింది. పిఎఫ్‌ఐ మహిళా విభాగం అధినాయకి జైనాభా నాయకత్వంలో సుమారు 2000 మంది హిందూ స్ర్తిలు లవ్ జీహాద్ చర్యలకు బలయ్యారని దైనిక్ జాగరణ్ వ్రాసింది. ఇండియా టుడే ఈ విషయమై అనేక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించింది.

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్ 9676190888