సబ్ ఫీచర్

మారిన మెనూవల్ల పోషకాహారం అందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కల్పించే ప్రభుత్వ విధానాన్ని మధ్యాహ్న భోజన పథకం అంటారు. 2001 నవంబర్ 28న సుప్రీంకోర్టు ధర్మాసనం మార్గనిర్దేశం నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం అన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించింది. పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలలకు వెళ్ళడం మానివేయకూడదదే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలుచేస్తున్న పథకం ఇది. ఇందులో అన్ని పని దినాలలో విద్యార్థినీ విద్యార్థులకు ఉచితంగా భోజనం పెడతారు. బాల బాలికలను ఆకలి బాధనుంచి దూరం చేయడం, పాఠశాలలో చేరే వారి సంఖ్యను, హాజరు అయ్యేవారి సంఖ్యను పెంచడం, పిల్లల్లో సామాజిక సమభావన పెంపొందించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు. మధ్యాహ్నభోజన పథకం ఆంధ్రప్రదేశ్ నందు 45,723 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో అమలు జరుగుతోంది. ఈ పథకం ద్వారా 36,10,025 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథక ఉద్దేశం తరగతి గదిలో పిల్లలు ఆకలితో లేకుండా చేయడం కోసం, పౌష్టికాహార లోపం తగ్గించడం కోసం విద్యార్థుల నమోదు హాజరు శాతం పెంచడం కోసం, పాఠశాలలో సాంఘిక సమానత్వం పెంపొందించడంకోసం తద్వారా విద్యాప్రమాణాలను పెంపొందించడం.. భోజనంపై పిల్లలకు మక్కువ పెంచడం కోసం రోజువారి భోజనంలో తగు మార్పులు చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది. దీనికి అదనంగా అయ్యే ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. బడి పిల్లల పౌష్టికాహార లోపం నిర్మూలించటానికి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అదనంగా ఇవ్వటానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఇందులో భాగంగా నూతన ఆహార పట్టికను మరియు అదనపు పౌష్టికాహారాన్ని సంక్రాంతి సెలవుల తరువాత నుండి అన్ని పాఠశాలల్లో అమలుచేయటం జరుగబోతోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నది. వంట కార్మికుల వేతనం రూ.1000/- నుంచి రూ.3000/-కు పెంచటం జరిగింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.176 కోట్లు కేటాయించటం జరిగింది. ప్రతి విద్యార్థికి వారానికి ఐదు కోడిగుడ్లు అందించడం జరుగుతుంది. ఈ వ్యయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కోడిగుడ్ల సరఫరాలో నాణ్యత పెంచడంకోసం ప్రస్తుత కొనుగోలు విధానాన్ని మార్పుచేసి రివర్స్ టెండరింగ్‌లో కోడిగుడ్లు కొనుగోలు చేయుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధానంలో డివిజినల్ స్థాయి టెండర్ ద్వారా కోడిగుడ్లను నేరుగా కోళ్ళఫారమ్‌లవద్ద నుండి కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనివలన కోడిగుడ్లలో నాణ్యత పెరగటమే కాకుండా ప్రభుత్వంపై ఆర్థికభారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది.
మధ్యాహ్నభోజన పథకంలో ఈ సంక్రాంతి సెలవుల అనంతరం మార్పులు రానున్నాయి. మెనూ మారడంతోపాటు నిర్వాహకులకు చెల్లించే సొమ్ములు కూడా పెరగనున్నాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి రూ. 4.48 ఇస్తున్నారు. ఇకనుంచి వారికి రూ. 6.60 చొప్పున ఇవ్వనున్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతం రూ. 6.11 ఇస్తుండగా.. ఇకనుంచి వారికి రూ. 8.80 ఇవ్వనున్నారు. విద్యార్థులకు అందించే ఒక్కో చిక్కీకి (వేరుశనగ పప్పు అచ్చు) రూ. 1.69 ఇవ్వనున్నారు. ఆయా పాఠశాలలో నిర్వాహకులు వీటిని తయారుచేయాల్సి ఉంది. మారిన మధ్యాహ్న భోజన పథకం మెనూపై జిల్లాస్థాయిలో, మండల స్థాయిలో ఎం.డి.ఎం. నిర్వాహకులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. అయితే మారిన మధ్యాహ్నభోజనం మెనూ ప్రకారం సోమవారం- అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, చిక్కి; మంగళవారం- పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు; బుధవారం- కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి; గురువారం- కిచిడి (పెసరపప్పు అన్నం), టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు; శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు; శనివారం- అన్నం, సాంబార్, స్వీట్ పొంగల్; తయారుచేసి స్కూలు పిల్లలకు వడ్డించాలి. ప్రస్తుతం బియ్యం, గుడ్లు మాత్రం ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. మిగతావి అన్ని అనగా కూరల తయారీకోసం ప్రభుత్వంవారు ఇచ్చిన కుకింగ్ కాస్ట్‌నుంచి ఖర్చుచేసుకోవాలి. 2019 ఫిబ్రవరి నెలనుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని వెయ్యి రూపాయలు నుంచి మూడువేల రూపాయలకు పెంచినట్లు, ఇది రాష్టవ్య్రాప్తంగా మధ్యాహ్నభోజన పథకం అమలులో కుక్ కం హెల్పర్‌గా పనిచేస్తున్న 88,296 మందికి వర్తిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన జీతాలు అరియర్స్ రూపంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందని పరిస్థితి నెలకొని ఉంది. స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం అమలుకోసం పని చేసే కార్మికులు రోజులో ఒకపూట పూర్తిగా తమ సమయాన్ని కేటాయించి పని చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయినప్పటికీ ప్రస్తుతం చెబుతున్న కొత్త మెనూ ప్రకారం ప్రభుత్వం విద్యార్థులకు ఒక్కరికి ఇస్తామంటున్న కుకింగ్ కాస్ట్ ప్రాథమిక పాఠశాల విద్యార్థికి 6 రూపాయల 60 పైసలు, ఉన్నత పాఠశాల విద్యార్థికి 8 రూపాయల 80 పైసలు ఎంతమాత్రం సరిపోదని ఎం.డి.ఎం. నిర్వాహకులు తెలుపుతున్నారు.
అక్షయపాత్ర లాంటి సంస్థలు మిడ్‌డే మీల్ అమలులో పాలుపంచుకుంటున్నప్పటికీ ఇది కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యింది. గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా ఎం.డి.ఎం. నిర్వహణ బాధ్యతలు స్థానికులే చేపడుతున్నారు. అందువల్ల ముఖ్యంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలలో తక్కువమంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు ప్రభుత్వం ఇస్తున్న కుకింగ్ కాస్ట్ సరిపోక నాణ్యమయిన ఆహారం క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అందటం లేదు. అధిక పాఠశాలల్లో ప్రభుత్వం నిర్మించిన వంట గదులు నిరుపయోగంగా మారాయి. వంటచేయడానికి అనుకూల పరిస్థితులు, నీటి సౌకర్యం లేకపోవడమే అని తెలుస్తోంది. పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు, ప్రభుత్వం నామమాత్రంగా తనిఖీలు చేయడంవల్ల నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందడం లేదు. రోజులో సమయాన్ని అంతా వంట చేయడానికి కేటాయించినప్పటికీ కనీసం కూలి కూడా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు గిట్టుబాటుకాని పరిస్థితి ఉంది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించకుండా వాటిని పరిష్కరించకుండా హడావుడిగా పథకాల పేర్లుమార్చి, మెనూ మార్చి, నామమాత్రపు నిధులు కేటాయించడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. కావున ప్రభుత్వం మధ్యాహ్నభోజన పథకం అమలు గురించి శాస్ర్తియ అధ్యయనం చేయాలి. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించాలి. మధ్యాహ్నభోజన పథకం నిర్వాహకులకు కనీస వేతనాలు అమలుచేయాలి. ప్రభుత్వం దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సరఫరాచేయాలి. ఏప్రిల్, జూన్ నెలల్లో సగం జీతం మాత్రమే ఇస్తున్నారు. పూర్తి జీతం వచ్చేలా చూడాలి. ప్రతినెలా జీతాలు, కుకింగ్ కాస్ట్ అందకపోవడంవల్ల నిర్వాహకులు అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కావున ఒకటో తేదీనాటికి కుకింగ్ కాస్ట్, వేతనాలు వారికి అందేలా చర్యలు తీసుకోవాలి. కుకింగ్ కాస్ట్ పెంచి మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలి.

- వాసిలి సురేష్, 9494615360