సబ్ ఫీచర్

సెల్ సంభాషణ.. ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో సెల్‌ఫోన్ లేని ఇల్లే లేదు. మారుమూల గ్రామాలలో కూడా సెల్‌ఫోన్ల వినియోగం ఎక్కువైపోయింది. ప్రపంచీకరణ నేపధ్యంలో అర చేతిలోనే విశ్వమంతా మనకు కనబడుతోంది. మంచిదే దీనిలో కొన్ని దుష్ఫరిణామాలు, మంచి పరిణామాలు ఉన్నాయి. ముందు సెల్ సంభాషణ బాగుండాలి. చాలావరకు సెల్ సంభాషణలు ‘‘చెప్పండి, మాట్లాడుకోండి’’అని మర్యాద మన్నన లేకుండా మాట్లాడుతున్నారు. ముందు ‘హలో, ఎవరు ఎక్కడనుంచి, ఎవరు కావాలి’అని మర్యాదగా పలకరించాలి. మన సంభాషణ ఎంత సౌమ్యంగా ఉంటుందో, అవతల వారి సంభాషణ కూడా అంత సౌమ్యంగా వుంటుంది. మనం కరుకుగా మాట్లాడితే అవతలవారి కంఠం కూడా కరుకుగానే ఉంటుంది. ఇది ఒక రకమైన ప్రమాదం.
పరిచయస్తులు, బంధువులు, మిత్రులతో సంభాషణ ఒక ఎత్తయితే, అపరిచిత కాల్స్ వచ్చినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. అవతలి నంబరు మనకు తెలియకపోయినా మన నంబర్‌కు కాల్ వస్తే వారి మాట్లాడే తీరునుబట్టి మన ప్రవర్తన ఉంటుంది. కొంతమంది గౌరవంగా సారీ, రాంగ్ నెంబర్, పొరపాటుగా వచ్చిందండి అని చెబుతారు. మరి కొందరు ఎలా వస్తుందండి, నంబర్ చూస్కో అక్కరలేదా! అని ఘాటుగా చెప్పేవారు ఉన్నారు. మనం ఎంత సౌమ్యంగా మాట్లాడినా, అవతల నుంచి కరుకు సమాధానమే వస్తుంది. అలా ఇరువురు ఫోన్ ద్వారానే చెడామడా తిట్టుకునే సందర్భాలు కోకొల్లలు. ఇది మరో రకమైన ప్రమాదం. అందుకనే చాలామంది ట్రూ కాలర్ యాప్ ద్వారా అపరిచిత ఫోన్ కాల్స్ ఎవరు? వారి పేరు అన్ని కనుగొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సెల్‌ఫోన్ వినియోగం, మాట తీరు చూడ చక్కగా ఉండాలి. కొందరు రహదారులపై, వాహనాలపై మాట్లాడుకుంటూ ముందువెనుక ఏదీ చూసుకోకుండా వెళుతూ ప్రమాదాలకు గురిఅవుతున్నారు. వాహనదారులైతే మరీనూ తల ఒకప్రక్కకు వంచి మాట్లాడుకుంటూ వెళుతూ అనేక ప్రమాదాలకు గురిఅవుతున్నారు. వాహనం ఒకప్రక్కకు నిలబెట్టి ఫోన్ మాట్లాడితే ఏ ప్రమాదమూ జరుగదు. చాలామందికి ఇది తెలిసినా కొంపలంటుకుపోయినట్లు, ఏదో అర్జంటు పని ఉన్నట్లు తీవ్రమైన ట్రాఫిక్‌లో కూడా అలానే మాట్లాడుకుంటూ వెళుతూ వారు ప్రమాదానికి గురికావడమే కాకుండా ఇతరులను ప్రమాదాలకు గురిచేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించుకుంటే మనమే అని సమాధానము ఇచ్చుకోవలసిన స్థితి. ఇది చాలా శోచనీయమైన విషయం.
ఇటీవలే ఓ వాహనదారుడు బైక్‌పై ఓ మూడేండ్ల బాబును ముందు ఎక్కించుకుని పోతున్నాడు. అప్పుడే అతని సెల్ మోగడం యథాలాపంగా అతను బండి ప్రక్కకు ఆపకుండా తల వంచి ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే ముందు కూర్చున్న బాబు తూలి కింద పడిపోయాడు. అతని బండి ఆ బాలుడిపై వెళ్ళింది. ఆ బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎంత ఏడ్చినా, దిగులు పడినా ఆ బాబు వస్తాడా!
ఇక పాదచారులు కూడా కొంతమంది తల వంచుకుని మాట్లాడుకుంటూ వెళుతూ ముందు ఏమి వస్తున్నదో చూసుకోకుండా దృష్టంతా మాటలపై ఉంచి ప్రమాదానికి గురైనవారు ఉన్నారు.
కనుక వాహనదారులు, పాదచారులు గమనించండి. వాహనదారులు సెల్‌ఫోన్ మాట్లాడవలసి వస్తే వాహనం ప్రక్కకు ఆపి మాట్లాడండి. పాదచారులైతే ఒకప్రక్కగా నడుస్తూ, లేకపోతే ఒకప్రక్కగా నిలబడి మాడ్లాడండి. అందరికీ బాగుంటుంది. యాంత్రిక జీవనంలో అందరికీ అర్జంటు పనులే ఉంటాయి మరి. ఆ అర్జంటులో పడి మనం ప్రమాదాలకు లోనైతే మనకు, మన కుటుంబాలకు దిక్కెవరు? కనుక సెల్ సంభాషణలు ప్రమాదాలు తెచ్చుకునే విధంగా ఉండకూడదు.

- కనుమ ఎల్లారెడ్డి