సబ్ ఫీచర్

నిర్భయత్వం నిలువుటద్దం కావాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాన్న మాకెమన్నా ఆస్తులు ఉన్నాయా? అని పదేళ్లు దాటిన ఆ కొడుకు అడిగిన ప్రశ్నకు పుస్తకం చదువుకుంటున్న జమిందారైన తండ్రి తలెత్తి ఒక్కసారి చూశాడు. ‘వెళ్లి అద్దంలో చూసుకో’అని అనగానే ఆ కొడుకు నిలువుటద్దం ముందు నిలుచుకున్నాడు. అణువణువునా ఆత్మవిశ్వాసం తొణికసలాడే ఆ తేజోమయ రూపం.. కరుణామృతాన్ని కురిపించే విశాలమైన నేత్రాలు, ఆ నేత్రాలలో కనిపించే నిర్భయత్వం.. ఇది చాలు. ఈ ప్రపంచానే్న జయిస్తాను అని అనుకున్నాడు. ఆ తేజోమయ రూపం భౌతికంగా ఉన్నది కేవలం 39 సంవత్సరాల ఆరు నెలలు మాత్రమే. నాలుగు పదుల వయసు కూడా చూడలేదు. కాని ఆ రూపం తొమ్మిదేళ్లపాటు యావత్ ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకుంది. భారతీయుడంటే ఇతడే, భారతీయత అంటే ఇంత గొప్పదా అని నివ్వెరపోయేలా ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ యుగానికి సరిపడా బోధించాల్సిందంతా బోధించి కనుమరుగైంది. భౌతకంగా రూపం కనుమరుగైనా ఆ సందేశాల వాణి మాత్రం ఈనాటికీ వేయి గొంతుకలై వినిపిస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటావలే మనసును తాకుతుంది. ఆ రూపం స్పృశించని అంశం అంటూ లేదు. నిలువెత్తు ఆ తేజోమయ రూపమే స్వామి వివేకానంద. ఈ యుగానికి ఒక్కడు చాలు అనేలా ఆయన యావత్ జాతిని మేలుకొల్పాడు. ఇలాంటి నిర్భయత్వం నేడు పిల్లల్లో కొరవడటం వల్ల అనేక మానసిక, శారీరక రుగ్మతులతో బాధపడుతున్నారు. పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చాం, ఎంత కూడగట్టాం అని అనుకుంటున్నాం కాని వారి ఇలాంటి విలువైన పాఠాలు ఆచరణాత్మకంగా చూపిస్తున్నామా? లేదా బోధిస్తున్నాం అని ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయ. పిల్లల్లో సృజనాత్మకంగా ఆలోచించటానికి దోహదం చేస్తుంది. అందుకే స్వామి వివేకానంద నోటి నుంచి వెలువడిన ఆ మాటలు మంత్రాలుగా పనిచేస్తున్నాయంటే ఆయన పవిత్రమైన జీవన విధానమే కారణం. సృజనాత్మకంగా ఉండే ఆలోచనలకు నిలువుటద్దం కూడా ఈ కింది విషయం.
నేటి మేకిన్ ఇండియాకు ఆనాడే బీజం వేశారు..
నేడు మనందరం అనుకుంటున్న ‘మేకిన్ ఇండియా’ సిద్ధాంతానికి బీజం వేసింది స్వామి వివేకానంద అంటే ఆశ్చర్యం కలుగక మానదు. అది 1893వ సంవత్సరం. స్వామి వివేకానంద చికాగో ప్రసంగం చేసేందుకు అమెరికాకు నౌకలో బయలుదేరారు. స్వామివారు నౌక డెక్‌మీద కుర్చీలో కూర్చొని ఉండగా.. ఎంతోమంది ఆయన వద్దకు వచ్చి మాట్లాడుతూ ఎన్నో విషయాలు ఆయన వద్ద నుంచి తెలుసుకుని వెళ్లేవారు. అలా ఆనాటి నౌకలో ప్రయాణిస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త జెంషెడ్‌జీ టాటా కూడా ఆయన వద్దకు వచ్చారు. ఆరోజుల్లో జెంషెడ్‌జీ టాటా ముడి వనరులు భారతదేశం నుంచి తీసుకుని వెళ్లి వస్తువులను తయారుచేసి భారతదేశానికి వచ్చి అమ్మేవారు. ఇదే విషయం జెంషెడ్‌జీ స్వామివారితో అనటం జరిగింది. ‘‘మీరు ఎందుకు ముడి వనరులు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లి ఉత్పత్తి చేయటం. భారతీయులలో మానవ ప్రతిభకు కొదవలేదు. ఇక్కడే పరిశ్రమలు స్థాపించి భారతీయులకు ఉపాధి, వారి ప్రతిభను వినియోగించవచ్చు కదా’’ అని సలహా ఇచ్చారు. అది జెంషెడ్‌జీ టాటాకు సలహాగా భావించలేదు. అది ఆయనకు వేద మంత్రం వలే గోచరించినట్లయింది. స్వామిజీ చెప్పిన విషయాన్ని ఆచరణలో పెట్టేందుకు ఎంతో శ్రమించారు. భారతదేశంలో‘ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెంటర్’ను నెలకొల్పేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆ సెంటర్‌ను నెలకొల్పేందుకు కావల్సిన భూమి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వలేదు. చివరకు మైసూర్ దివాన్ శేషాద్రి అయ్యర్ సహాయంతో బెంగళూరులో 372 ఎకరాలు సంపాదించగలిగారు. అలా ఏర్పాటైన ఆ సెంటరే కాలాంతరంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌గా రూపాంతరం చెందింది. ఈ రోజు ఎంతోమంది గొప్ప గొప్ప శాస్తవ్రేత్తలు ఇక్కడ నుంచి వచ్చినవారే. నిత్య జీవితంలో మనం వాడే అగ్గిపెట్టె వద్ద నుంచి అంతరిక్ష విజ్ఞానం వరకు ఈ ఇన్‌స్టిట్యూట్ అందిస్తుంది. అలా స్వామి వివేకానంద ఇచ్చిన సందేశంతోనే టాటా గ్రూప్ శాఖోపశాఖలుగా విస్తరించి పెద్ద వ్యాపార సామ్రాజ్యానే్న నెలకొల్పింది. ఆనాడు స్వామి వివేకానంద చెప్పిన ఈ సందేశం ఈనాటి ‘మేకిన్ ఇండియా’కు నాంది పలికిందనటంలో ఎలాంటి సందేహం లేదు.

-ఆశాలత