సబ్ ఫీచర్

గుడ్డు వెరీ గుడ్డే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెజ్ ఎగ్‌ఫ్రైడ్ రైస్ అతి త్వరగా, సులభంగా తయారుచేసుకునే వంటకం. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గాను, మధ్యాహ్నం భోజనం, లేదా డిన్నర్‌లోనూ కమ్మగా తినవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. చిన్న పిల్లలైతే మరీ ఇష్టంగా తినే ఈ ఎగ్‌ఫ్రైడ్ రైస్ లంచ్‌బాక్స్‌లకు తయారుచేసి పంపవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ఈ ఎగ్‌ఫ్రైడ్ రైస్ వేడి వేడిగా తినటానికి ఇష్టపడతారు. గుడ్డులో హై క్వాలిటీ ప్రొటీన్స్ ఉంటాయి. ఎగ్ తినటం వల్ల మెదడును చురుకుగా ఉంచుతుంది. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకున్నట్లయితే బరువు తగ్గటానికి బాగా ఉపకరిస్తుంది. ఇందులో విటమిన్ బి, డి, ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి. మరికొన్ని ఆరోగ్య గుణాలున్న ఈ వెజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
కావల్సిన పదార్థాలు
బియ్యం-ఒకటిన్నర కప్పు, ఉప్పు-సరిపడినంత, ఉల్లిపాయ-ఒకటి, పచ్చిమిరప కాయలు-2, క్యారెట్-1, క్యాప్సికమ్- అర, కొత్తిమీర- పావుకప్పు, అలంకరించడానికి వెన్న-ఒక టేబుల్ స్పూన్, గుడ్లు-3, పెప్పర్-ఒక టీ స్పూన్, రెండు టీ స్పూన్ల నూనె, మూడు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి రెబ్బలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్-1 టీ స్పూన్.
తయారుచేయు విధానం: కడిగిన బియ్యాన్ని రైస్ కుక్కర్లో వేయాలి. మూడు కప్పుల నీరు జోడించండి. తరువాత తగినంత ఉప్పు వేసి మూత పెట్టండి. రెండు విజిల్స్ వచ్చేవరకు రైస్‌ను ఉడికించాలి. ఈలోగా ఉల్లిపాయ పొట్టు తీసి సగానికి కట్ చేయాలి. తరువాత దీన్ని సన్నగా, పల్చగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకుని సగానికి కట్ చేయాలి. తరువాత వాటిని మధ్యలో రెండు అంగుళాల పొడవుగా కట్ చేయాలి. క్యారెట్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. క్యాప్సికమ్‌ను సగానికి కట్ చేయాలి. క్యాప్సికమ్ పైభాగాన్ని కూడా కట్ చేయండి. క్యాప్సికమ్ లోపల విత్తనాలు ఉన్న భాగాన్ని తొలగించండి. కొత్తిమీరు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇపుడు వేడిచేసిన పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ బట్టర్ వేసి కరగనివ్వాలి. గుడ్డును పగులగొట్టి వేయాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు పొడి వేయాలి. పచ్చిగా ఉన్న గుడ్డు బాగా విడిపోయే వరకు వేగిస్తూ గరిటతో విడగొడుతూ వేయించాలి. పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కూడా వేయాలి. ఒక టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు తరిగిన క్యారెట్ ముక్కలు కూడా వేసి మిక్స్ చేయాలి. రెండు నిమిషాలు బాగా వేయించాలి. కట్ చేసిన క్యాప్సికం ముక్కలను, అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. మొత్తం మిశ్రమం రెండు నిముషాల తరువాత ముందుగా వండుకున్న అన్నం వేయాలి. మరో రెండు స్పూన్లు మిరియాల పొడి కలిపి మొత్తం మిశ్రమాన్ని కలగలపాలి. అలాగే కొద్దిగా బటర్ వేయడం వల్ల రైస్ పొడిపొడిగా వస్తుంది. చివరిగా, ఫ్రై చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులతో అలంకరించాలి. ఒక గినె్నలో తీసుకుని, వేడి వేడిగా వడ్డించండి.