సబ్ ఫీచర్

కానె్సఫ్ట్ నిర్ణయాధికారం ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిలబస్ లోపల ఆంధ్రప్రదేశ్ హిస్టారికల్ రివ్యూ ఉంటుంది. ఉపాధ్యాయుడు ఆ సిలబస్‌లో వున్న పాఠాల బాటలో గుడ్డిగా నడపడు. ఉపాధ్యాయుడు స్వతహాగా కొన్ని కానె్సప్ట్స్ తీసుకుంటాడు. కందుకూరి వీరేశలింగం జాతీయవాది అన్నది దృక్పథం ఉంది. తెలంగాణలో వ్యవసాయ పరిణామాలు ఎలా వచ్చాయి? లాంటి వాటిలో కొన్ని కానె్సప్ట్‌లు ఆధారంచేసుకుని పాఠాన్ని ఎలా బోధించాలో విశే్లషించుకుంటాడు. దీని ద్వారా జనంలోకి పోతాడు. చరిత్ర అంటే గతాన్ని నెమరువేసుకోవటం కాదని, గతాన్ని వర్తమానంతో కలిపి భవిష్యత్తుకు బాటలువేస్తాడు. ఏ చిన్న పనినైనా తన లక్ష్యంవైపు నడిపించటమే గొప్ప ఉపాధ్యాయుని లక్షణం. కానె్సప్ట్ అనేది నిర్ణయించేది సిలబస్‌నే ఆధారంచేసుకుని తనయొక్క ప్రణాళికను రూపొందించుకుంటాడు. ప్రతిరోజు ఎన్నో విషయాలు చర్చిస్తాం. పిల్లల చేత పుస్తకాలు చదివించాలని సిలబస్‌లో ఉంటుంది. ఉపాధ్యాయుడు తన కానె్సప్ట్‌ను దృష్టిలోపెట్టుకుని పిల్లలచేత ఏ పుస్తకాలు చదివించాలో ఆలోచిస్తాడు. కొందరు మహనీయుల ఆత్మకథలు లేక కొంతమంది త్యాగాలకు ప్రతీక అయిన మహనీయుల జీవిత కథలు, వారి ఆచరణలు చదివించాలి. సామాజిక అంశాలు, సమాజంలో స్థితిగతులు, సమాజ మార్పు అన్న అంశాలపై పుస్తక పఠనం అనే సిలబస్‌ను ఉపాధ్యాయుడు తయారుచేస్తాడు. టీచర్ తన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లలను తన దృక్పథం వైపుకు తీసుకుపోతాడు. అదే మాదిరిగా జామెంట్రీ సిద్ధాంతాలని సిలబస్‌లో ఉంటుంది. తన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ జామెంట్రీ సిద్ధాంతాలకు తను కొన్ని సూచనలు చేసి పిల్లలతో అభ్యాసనం చేయిస్తాడు. ఎందుకు న్యూక్లేనియన్స్ ఈ యుగానికి సిద్ధాంతకర్తలు కారు అనే విషయం చెప్పటానికై సరళరేఖ అనే కానె్సప్ట్ ఎందుకు మారవలసి వచ్చింది. భూమి చదునుగా ఉన్నదని అనుకున్నప్పుడు సరళరేఖ అనే కానె్సప్ట్ ఉంటుంది కాబట్టి, భూమి గుండ్రంగా ఉందని చెబుతున్నప్పుడు సరళరేఖల కంటే వక్రరేఖలే భూమిపై ఉంటాయని చెప్పాలి. కనపడే వక్రరేఖలన్నింటిలో రెండు స్థలాలను కలుపుతున్నప్పుడు ఎన్నో వక్రరేఖలుంటాయి. అన్నింటిలో కనిష్టదూరం ఉన్న దానిని సరళరేఖ అంటాం. అది కూడా వూహాజనితమే కానీ అది వాస్తవం కాదు. ఈ మాదిరిగా మనం చెప్తే పిల్లలు మనం నిజాయితీని ప్రశంసిస్తారు. కానె్సప్ట్ నిర్ణయం ఉపాధ్యాయుని యొక్క ప్రివిలేజ్.
ఉపాధ్యాయుడు ఏదో టూకీగా కానె్సప్ట్‌ను నిర్ణయం చేయడు. తాను ఎంచుకున్న అంశంపై విశేషమైన అధికారం ఉపయోగిస్తాడు. అదే పాఠానికి ఇంధనం. అధ్యయనానికి అదొక సొరంగం. సిలబస్‌ను గుడ్డిగా చెప్పటం టీచర్ పనికాదు. సొరంగాలను సృష్టించి ఏ మార్గంలోపోతే రతనాలు దొరుకుతాయో పిల్లలకు ప్రయోగాత్మకంగా చూపిస్తాడు. అందుకే ఉపాధ్యాయుణ్ణి మార్గదర్శి అంటాం. ఈ బాటలో నడవమని చెబుతాడు.

- చుక్కా రామయ్య