సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలవాన్!
మనిషి బలవంతుడు కావాలి. కాని బలహీనుడు కాకూడదు. అసత్యం, దుర్మార్గం, కపటం-ఇవన్నీ పిరికివాళ్ల లక్షణాలు. బలహీనం అంటే ఏమిటి? తన స్తోమత ఎరుగక, తననుతాను తక్కువగా ఎంచుకోవడం. నిన్ను నీవు ‘పీచు’ అనుకుంటున్నావు కానీ వాస్తవంగా నీవు ‘కొబ్బరివి’. ఇదే నీవుచేస్తున్న ఘోరమైన పొరపాటు. ‘అహమస్మి’ (నేనున్నాను) అనుకున్నంత కాలం నీకు భయం తప్పదు. ‘అహం బ్రహ్మాస్మి’ (నేనే బ్రహ్మమును) అని తెలుసుకున్న మరుక్షణం నీకు భయంపోతుంది. అజేయమైన బలం లభిస్తుంది.
విమర్శలు
సత్యసాయిలో ముఖ్యంగా కనిపించే గుణాలేవి? సమదృష్టి సహనం. ఎంతోమంది స్వామిని ఎన్నో విధాలుగా విమర్శిస్తుంటారు. హేళన చేస్తుంటారు. పత్రికలలో రకరకాలుగా రాస్తుంటారు. కరపత్రాలు వేస్తుంటారు. ప్రపంచంలో యిలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకని? అవిశ్వాసమో, అసూయో దానికి కారణం. వాటన్నిటికీ నా సమాధానం ఒకటే. మందహాసం. మంచిగా, గొప్పగా ఏం జరిగినా యిలాటివన్నీ దాంతోపాటే తలెత్తుతూ వుంటాయి. కాసే చెట్టుకే కదా రాళ్లదెబ్బలు? పండు లేని చెట్టుపైకి రాయి విసరే వారెవ్వరు?
నీ కోరికలన్నీ తీరనీ తీరకపోనీ, నీ మనసుమాత్రం దేవునిపై లగ్నం చేయి. ఏదో ఒక పిచ్చి నెపంతో భగవంతునిపై నమ్మకం అనే భాగ్యాన్ని కోల్పోకు. సాయిబాబావల్ల నీకు మేలు పైన మేలు కలిగినన్నాళ్లూ ‘సాయి శంకరా, సాయి శంకరా’ అని భజన చేస్తావు. ఆశాభంగం నీడ నీపై ఏ కాస్తపడ్డా చాలు. క్షణంలో ప్లేటుమార్చేసి ఈ సాయి దేవుడు కాడనేస్తావు!’ ఇదేనా నీ సాధన?
వివేచన
యుద్ధంలో ఒక రోజుకొకరోజు శత్రునాశనం జరుగుతుంటే సంతోషంలో అర్జునుడు కృష్ణుని సర్వవ్యాపి అనీ, సర్వశక్తిమంతుడనీ, సర్వజ్ఞుడనీ కీర్తిస్తూ వచ్చాడు. కాని తన కొడుకు అభిమన్యుడు వధించబడగానే అందుకు కృష్ణునిపై విరుచుకుపడ్డాడు. తనను కృష్ణుడు ముందుగా అలాటి ప్రమాదం గురించి హెచ్చరించలేదని ఆక్రోశించాడు. అంతటి భక్తుని మనస్సే అలా ఊగిసలాడుతూ వచ్చింది!
ఎవరైనా ఈ సంగతులను సమచిత్తంతో ఆలోచించాలి. వివేచనవల్ల భగవంతుడు నీలోనూ, అందరిలోనూ వున్నాడని తెల్లవౌతుంది. భగవంతుడు ఈ సృష్టికి ఆలంబన అన్న సంగతి అర్థమైతే, మన విశ్వాసం మరింత బలపడుతుంది.
ఆయనకంతా తెలుసు
హృదయం పవిత్రంగా వుంటేనే దైవం సాక్షాత్కరిస్తాడు. ఆయనే న్యాయ నిర్ణేత. ఆయనను హడావుడి పెట్టటం అయ్యే పనికాదు.
డాక్టరు నీకు జ్వరం లేదంటాడు. నీవు కంగారుపడకుండా ఉండటంకోసం ఆయన వాస్తవాన్ని దాచిపెట్టవచ్చు. కాని థర్మామీటర్ అబద్ధం చెప్పదు.
భగవంతునికి అంతా తెలుసు. ఆయనకు నీకేం కావాలో, ఏమేమి పొందే అర్హత వుందో తెలుసు. నీకేమి యివ్వాలో ఆయన ఎరుగును. ఆయన పట్ల నమ్మకం వుంచు, చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందు. మళ్లీ ఆ పొరపాట్లు చేయకు. అప్పుడే ఆయన అనుగ్రహం నీకు లభిస్తుంది.
అన్నీ మన మంచికే
ఈ ప్రపంచం సత్యాసత్యాల మిశ్రమంగా కనిపిస్తుంది. నిజానికి ఇది మిధ్యే. ఆ సంగతిని దృఢంగా విశ్వసించే విధంగా నీ ఆలోచనలను, ఆచరణలను మలచుకోవాలి.
ఆధ్యాత్మిక జీవితంలో నడతలో ఏమాత్రం పొరపాటు కన్పించకూడదు. ఆలోచనలను మాయ ఆవరించరాదు. ఆ మార్గంలో పయనించే ముముక్షువులు తమ ఆలోచనలోనూ, ఆచరణలోనూ రుూ సంగతి ద్యోతకమయేలా చూచుకోవాలి.
ఆదుర్దాను కలిగించే కారణాలను తొలగించుకో. భయాన్ని వర్ణించు. అజ్ఞానాన్ని జయించు. అప్పుడే నీ అసలయిన వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. భగవంతుని యందు విశ్వాసముంచితే నీ మనసులోని ఆతురతలన్నీ నశిస్తాయి. ‘్భగవంతుడేది చేసినా నీ మంచికే’ అన్న విశ్వాసం వుంటే, ఏది జరిగినా సంతోషంతో స్వీకరించగలుగుతావు.
భ్రమర కీటక న్యాయం
ప్రతి మానవుని స్వరూపము కూడానూ భగవంతుని వేషమే. భగవంతుడు ధరించిన వేషముతో మానవుడని నీవనుకుంటున్నావు. మానవునిగా భ్రమిస్తున్నావు. ఈ లోక నాటక రంగమందు ఈ మానవుడు తనకు పెట్టిన పేరు, ఇచ్చిన రూపాన్ని ప్రకటస్తూ ఉన్నాడే కాని అసలు రూపమేమిటో, నామమేమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించటం లేదు.
మానవుని రూపమును ధరించి ఈ విశ్వనాటక రంగములోపల ఆ మానవాకారముచేత తన నాట్యము తాను జరుపుకుంటూపోతున్నాడు భగవంతుడు. కాని అతని యందున్నటువంటిదికూడనూ దైవమే, దైవమే ఆ రూపాన్ని ధరించాడు అనే ఈ విశ్వాసముతో మనంపోవాలి. నేను మానవుడు! అనుకుంటుంటే నీవు మానవునిగానే వుంటావు. కాదు! కాదు! నేను దైవము, నేను దైవమనే విశ్వాసముతో, గాఢ విశ్వాసముతో నీవు స్మరిస్తే నీవు నిజంగా దైవమైపోతావు.
ఇంకా ఉంది