సబ్ ఫీచర్

నేనేం తప్పు చేశాను?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా చంద్రబాబునాయుడుగారి రాజకీయ అరంగేట్రం కాంగ్రెసు పార్టీతో ప్రారంభమైంది. ఆ తర్వాతి కాలంలో వారు తమ మామగారు పెట్టిన తెలుగుదేశం అనే పార్టీకి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి పునాది వేశారు. సందర్భోచితంగా కమ్యూనిస్టులతో జతకట్టారు. జనతాదళ్(యునైటెడ్ ఫ్రంట్) పేరుతో హరికిషన్‌సింగ్ సుర్జిత్, ప్రకాశ్‌కారత్ (సీపీయం)లతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు. లక్ష్మీపార్వతిని బూచిగా చూపి ఎన్‌టీఆర్‌ను గద్దెదించటమే కాదు హైదరాబాదులో కాంపు రాజకీయాలు నిర్వహించి ఎంఎల్‌ఏలను వైశ్రాయ్ హోటల్‌లో బంధించారు. ఎన్‌టీఆర్‌పై చెప్పులు వేయించారు.
బీజేపీతో నాలుగు సంవత్సరాలు (2014-2018) ఆంధ్రప్రదేశ్ అధికారం పంచుకొని తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే నినాదంతో బీజేపీని ఛీకొట్టారు. ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ అమరావతికి వస్తే ఆయనకు నల్లజండాలు చూపించారు. బిజెపిని ఓడించటమే ప్రధాన లక్ష్యంగా కర్నాటకకు వెళ్లి అక్కడి జనతాదళ్ నాయకుడు కుమారస్వామికి మద్దతు ప్రకటించి వచ్చారు. ఇవన్నీ ఇటీవలి సంఘటనలే. హైదరాబాదు సమీపంలోని మేడ్చల్‌లో ఒక ఎన్నికల సభ జరిగింది. దానిలో పాల్గొనే నిమిత్తం రాహుల్‌గాంధీ, సోనియాగాంధీలు వచ్చారు. చంద్రబాబునాయుడు వారికి మద్దతు ప్రకటించటమే కాకుండా అక్కడి ఫ్లెక్సీలల్లో మానధనుడైన ఎన్‌టీఆర్ చిత్రాన్ని సోనియాగాంధీ పాదాల దగ్గర చిత్రించటం నేను స్వయంగా చూచాను. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పెట్టాలని నిర్ణయించారు. అంతకుముందు రాష్ట్ర విభజనకోసం తెలంగాణాలో కేసీఆర్ ఉద్యమం నడుపుతున్నప్పుడు సోనియాగాంధీకి రాష్ట్ర విభజనకోసం ముందుగా లెటర్ ఇచ్చింది చంద్రబాబుగారే. అంతేకాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ నిధులు హైదరాబాదులో కుమ్మరించి ‘ఏకీకృత అభివృద్ధి’ని చేయటం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలల్లో ఆర్థిక అసమానతలను పెంపొందించింది కూడా ఆయనే. మరో ముఖ్య విషయం 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి రాజధానిగా 2024 వరకు హైదరాబాదు ఉంటుందని విభజన చట్టంలో ఉండగా రాత్రికి రాత్రి రాజధానిని అమరావతికి కూడా తరలించింది చంద్రబాబుగారే.
ఓటుకు నోటు కేసులో ముద్దాయి బాబుగారే. ఏ.పి.లో చాపకింద నీళ్లలాగా క్రైస్తవీకరణం జరుగుతుంటే దానిని నిరోధించకపోగా టిటిడిలోని అర్చకులను ప్రధాన కార్యదర్శులను మార్చింది వీరే. ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది? విజయవాడ తూర్పులో ఒకాయన ఎన్నికల బరిలో ఉంటే తద్దినం మంత్రాలు చదువుకోవలసిన మీకు రాజకీయాలలో ఏం పని? అని నిందించింది ఎవరు? జగన్ మీద విశాఖ విమానాశ్రయంలో ఎవరో దాడి చేస్తే ‘కోడికత్తి ప్రహసనం’ అని ప్రచారం చేసిందెవరు? అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిన మాట నిజమా? అబద్ధమా? ఇలా చెప్పుకుంటూపోతే తెలిసినవి- ఇంకా తెలియనివి తెరమరుగైనవీ ఎన్నో ఎనె్నన్నో ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దైవాంశ సంభూతుడు కాదు. అతడు మనలాంటి మనిషే. ప్రజలు భారీ మెజారిటీతో ఆయనకు ఏపీలో పట్టం కట్టారు. అలాంటప్పుడు ఏడాది తిరగకముందే ఆయనను గద్దె దింపాలి అనుకోవటం అప్రజాస్వామికం. చంద్రబాబునాయుడు గొప్ప వక్త. ప్రవక్త కాకపోవచ్చు కానీ పొలిటికల్ మేనేజ్‌మెంట్‌లో అనుభవజ్ఞుడు. ఇప్పటివరకు ఎలాగో ఈదుకొని వచ్చాడు. ఇకమీద ఎత్తులుపొత్తులు జిత్తులు ఎలా ఉండబోతున్నాయి? రెడ్డి-కమ్మ-కాపు కులాలమధ్య ఏపీలో చిచ్చు రగిలింది. ఇది తెలుగు జాతికి శ్రేయస్కరం కాదు.
‘‘అందరినీ కలుపుకొనిపోదాం’’ (సంగచ్ఛ్ధ్వం) అనే ఏకతామంత్రాన్ని పఠించే నరేంద్ర మోడీ ఇప్పుడు ఏపీ సంక్షోభ సమయంలో ఏం చేయబోతున్నారు?
2014 శాసనసభ ఎన్నికలలో చంద్రబాబునాయుడు బీజేపీ జనసేన పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీచేశాయి. ఇవ్వాళ 2020లో ఈ పార్టీలు బాబుగారితో విడిపోయాయి. ‘చంద్రబాబు చేసిన తప్పులకు విసిగిపోయి ప్రజలు జగన్‌రెడ్డికి ఓటువేశారు. అలాంటిది మూడు రాజధానులు అంటూ జగన్‌రెడ్డి కొత్త నాటకం మొదలుపెట్టారు. రాజధాని అమరావతిలోనే ఉంటుంది- అంటూ ఒకవైపు కన్నాలక్ష్మీనారాయణ (బీజేపీ), మరొకవైపు జనసేనాని పవన్‌కల్యాణ్ (22-1-2020) ప్రకటించారు. ఇక్కడ మరొక వౌలిక ప్రశ్న ఉదయిస్తున్నది. ఆనాటి శివరామకృష్ణ కమిటీ అమరావతిలో భవన నిర్మాణాలు(రాజధానికి) తగవు అని నివేదిక సమర్పించినా బాబు ఎందుకు అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు? మరి ఆనాడు జగన్ కూడా ఎందుకు ఆమోదం తెలిపారు?
***
‘‘కాఫిర్ల నుండి ఆజాదీ’’ కాశ్మీర్‌లో నినాదాలు ‘‘పరీక్షల నుండి ఆజాదీ’’ జెఎన్‌యులో నినాదం మోడీ నుండి ఆజాదీ జామియా యూనివర్సిటీలో నినాదం.
వీటి అర్థాలు ఏమిటి?
విగ్రహారాధకులైన హిందువులను కాఫిర్లు అంటారు. అంటే హిందువులు లేని కాశ్మీరు నిర్మించాలని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు బహిరంగంగా చెపుతున్నారు. దీనికి అరవింద కేజ్రీవాలా, రాహుల్‌గాంధీ, ఏచూరి సీతారాం, మమతాబెనర్జీ, బాలీవుడ్ నటీనటులు మద్దతు ప్రకటిస్తున్నారు.
ఆరు లక్షల మంది కాశ్మీరీ పండిట్లను కాశ్మీరు నుండి తరిమివేస్తే వారు జమ్మూలో ఢిల్లీలో శరణార్థి శిబిరాలల్లో నేటికీ జీవిస్తున్నారు. అప్పుడీ మానవ హక్కుల సంఘాలు ఎక్కడ ఉన్నాయి??

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్