సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకట్లన్నీ ఒకటే!
ప్రాపంచిక గణిత శాస్త్రంలో 1+1+1+1+=4 అవుతుంది. కాని ఆధ్యాత్మిక గణిత శాస్త్రంలో 1 కోటి ‘1’లను కలిపినప్పటికీ అది 1 మాత్రమే అవుతుంది. ‘రామయ్య ఎవరు?’ అంటే ‘నేను’అంటూ ఒకడు లేస్తాడు. కృష్ణయ్య ఎవరు? అంటే‘నేను’ అంటూ మరొకడు లేస్తాడు. ఈ విధంగా ఎవరిని పిలిచినా ‘నేను’అంటారు. ‘నేనూ’ ఈ అందరియందూ ఉంటున్నది. కనుక ‘నేను’అనగా ఆత్మతత్త్వము. ఇది అనేకత్వంలో ఏకత్వంగా ఉంటున్నది.
దైవవిశ్వాసం, పవిత్రమైన భావాలు పిల్లలలో కలిగేటట్లుగా వారికి బోధించాలి. వారితో చక్కగా భజనలు చేయించాలి. ఉత్సాహమునిచ్చే పాటలు పాడితే ఎలాంటి నాస్తికుడైనా తనకు తెలియకుండానే తల ఊగుతుంది. గానంలో ఆనందం ఉన్నది. ‘ఓ! రామా! నన్ను కాపాడు!’ అంటూ మాటలతో చెబితే అది హృదయాన్ని అంతగా ఆకర్షించదు. ‘ఓ రామా! నన్ను కాపాడు!’అంటూ గానం చేస్తే అది హృదయాన్ని కరిగిస్తుంది. భగవదనుగ్రహం కూడా లభిస్తుంది. అందువలననే భగవంతుడు గానప్రియుడు. గానలోలుడు’అని చెప్పారు.
యువతలో అవిశ్వాసం
ఈరోజు యువత మన దేశంలోనూ యితర దేశాల్లోనూ కడుతీవ్రమైన అసంతృప్తితో వుంది. వ్యవస్థపై వారు తిరుగుబాటు చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? అనాదిగా తమదేశంలో వున్న సంస్కృతీ సంప్రదాయాలనూ, ఆశయాలనూ వారు నిర్లక్ష్యంచేయటమే దానికి కారణం. అంతేకాదు, అవాంఛనీయమైన, మొరటయిన అలవాట్లకు వారు దాసులవుతున్నారు. ఎందులోనూ విశ్వాసంలేని వారుగా తయారవుతున్నారు. అన్యాయం, అసమానత్వం, ఆతురత, భయం మొదలయిన అసుర శక్తులు విజృంభించి రేపే పెనుతుఫాను బారిన పడకుండా ఎవరికివారు ఆధ్యాత్మిక సాధనతో జాగ్రత్తపడాలి. ఇది అత్యవసరం. అతి ముఖ్యం. ఇందులో భారత మహిళలు ఎంతో సేవ చేయవలసి వుంది. ఎంతో ముఖ్యమైన పాత్ర వహించవలసి వుంది. బాలల హృదయాలలో వారు భగవంతుని ప్రతిష్ఠించాలి. శైశవం నుండే వారు బాలలకు భగవంతునిలో విశ్వాసాన్ని పాదుకొలపాలి. సమాజంలో ఆరోగ్యం, హాయి తిరిగి పొందాలంటే వాడవలసిన టానిక్ భగవంతునిలో విశ్వాసమే!
వేర్లులేని చెట్టు
మానవులంతా సోదరులన్న భావనను విద్యార్థులు గ్రహించాలి. అందరం దేవుని బిడ్డలమని వారు గుర్తించాలి. ఈ అంశాలు లేకుండా మనం బోధించే విద్య సమగ్రంకాదు. ఈ అంశాలు లేని విద్యపట్ల వారి అజ్ఞానం తొలగదు. మనిషి మనిషికీ పరస్పరం నమ్మకం కలగాలంటే దైవంపై విశ్వాసం పెరగటం అవసరం. విశ్వాసం లేని మనిషి వేర్లులేని చెట్టు లాంటివాడు. వాడి, వడలి, వత్తలై పోకమానడు.
తటపటాయించకు
ఉపాధ్యాయులూ, విద్యార్థులూ, దైవం పట్ల విశ్వాసం కలిగి వుండాలి. ఎందుకని? దైవం లేకపోతే దయ్యం తాండవిస్తుంది. అందుకే దైవాన్ని భజిస్తూ వుండాలి. ఎవరేమన్నా అనుకోని. నీవు నమ్మినది చేయటానికి నీకు భయమెందుకు? అలాచేస్తే దయ్యం వదులుతుంది. భజన చేసేందుకు వుండే తటపటాయింపు పైపైకే. పరీక్షలు దగ్గర పడితే, ప్రతి విద్యార్థికీ దైవభక్తి పెరిగిపోతుంది. ఇంట్లో ఎవరికైనా జబ్బుచేస్తే, ఇంకేమన్నా ఇబ్బందులు వస్తే దేవుడు గుర్తుకువస్తాడు. అయితే దేవుని నామాన్ని భజించటానికి ఎందుకీ తటపటాయింపు? ఎందుకీ భేషజం? ఇది కేవలం కపటమే.
దైవ పూజ
దైవపూజ మీరెలా చేస్తున్నారు? దేవుడిని స్నానం చేయిస్తున్నావు. నగలతో అలంకరిస్తున్నావు. నైవేద్యం పెడుతున్నావు. సువాసన వచ్చే ధూపం వేస్తున్నావు. అంటే, నీకేమేమి ఇష్టమో అవన్నీ దేవునికి జరుపుతున్నావు.
నీకిష్టమైనవి చేస్తే భగవంతునికి ప్రీతి కలుగుతుందా? తనకిష్టమైనవి చేస్తేనే దేవుడు సంతుష్టి చెందుతాడు. అలాచేయకపోతే ఆయన అనుగ్రహం నీకెలా లభిస్తుంది? ఆయనకిష్టం వచ్చినట్లు నడవటమంటే నగలూ, ధూపాలూ, నైవేద్యాలేనా? కాదు. ఆయనలో విశ్వాసం ఉంచటం, త్రికరణ శుద్ధితో మెలగటం, ఋజువర్తనం, ప్రేమ, సేవ!
అవతారమూర్తి
సూర్యుడు నడినెత్తిన వుంటే, నీడ పడదు. అలాగే విశ్వాసం దృఢంగా వుంటే సంశయాలు తలెత్తవు. మనిషి దారితప్పి ఎడారిలో తిరుగాడుతుంటే, ఈ దేహం తానేనని భ్రాంతిపడుతుంటే, అతడిని అది తప్పని హెచ్చరించటానికీ, సరయిన దారిచూపటానికీ అవతారం వస్తుంది. భగవంతుని పట్ల పరిపూర్ణ విశ్వాసం వుంచి ప్రాపంచిక రంగంలో మెలగు. నీకేకీడూ జరగదు.
సేవకు పునాది
నీవేమి ఆలోచిస్తున్నా, ఏమిచేస్తున్నా దానికి దేవునియందు నీకుండే నమ్మకమే ఆలంబన కావాలి. నీ నమ్మకం దృఢంగా వుండాలి. భగవంతుడు నీ రక్షణకు వస్తాడన్న విశ్వాసం అచంచలంగా వుండాలి. అటువంటి విశ్వాసం అనే పునాదులపై ఆశాసౌధాన్ని నిర్మించుకో.
ఈ విధంగా ఆలోచిస్తే, నీవు చేసే సేవ నీకూ, నీ సేవలందుకొనే వారిక్కూడా ఆనందం కల్గిస్తుంది.

ఇంకా ఉంది