సబ్ ఫీచర్

అమ్మాయంటే.. అమ్మే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాయి పుడితే.. అక్షరాలా మహాలక్ష్మీ పుట్టింది అంటారు.. అదే నిత్యసత్యం. ఏ ముచ్చటైనా.. ఏ ఆనందమైనా అమ్మాయితోనే ముడిపడి వుంటుంది. పుట్టింది మొదలు అమ్మాయి అత్తారింటికి వెళ్ళేవరకు. అమ్మా నాన్నలకదో పెద్ద బాధ్యత. బుడిబుడి నడకలతో నడయాడేవేళ.. మువ్వల పట్టీలతో.. మహదానందం చెందుతారు అమ్మా నాన్నలు.. ఆ తర్వాత అమ్మాయికి అన్నీ వేడుకలే.. వేడుకలు. నిజం చెప్పాలంటే అమ్మాయి నట్టింట నడయాడితే.. ఆ దృశ్యం అనుభవించినవారికే తప్ప మరెవ్వరికీ అర్థంకాదు. అమ్మాయంటే ఓనాడు గుండెలమీద కుంపటిలా భావించేవారు. కాని మారిన కాలానికి అమ్మాయి అంటే.. అమ్మే అనిపిస్తుంది. నాన్న చేయి పట్టుకొని నడిచిన అమ్మాయి.. వృద్ధాప్యంలో అదే చేయి పట్టుకొని నాన్నను నడిపిస్తుంది. అలాంటి దృశ్యాలు ఈ జగాన కోకొల్లలు. అమ్మను వృద్ధాప్యంలో పసిపాపలా చూసుకొంటుంది. కాని కొంతమంది అమ్మాయిలు అలా లేరు! మేమెవరికీ తక్కువ కాము.. అమ్మా నాన్నలను అలా గాలికొదిలేస్తున్నారు.. ప్రేమా దోమా అంటూ జీవితాలను పాడుచేసుకొంటున్నారు. పాతికేళ్ళు పెంచి పెద్దచేసినవారిని పూచిక పుల్లలా తీసివేస్తున్నారు. అలా చేయడం ఎంతవరకు భావ్యం. పాతికేళ్ళు పెంచిన ప్రేమను.. అలా తుంచేసి పాతిక నెలలు కూడా సాగని ప్రేమ వెంటపడి.. దీపం చుట్టూ చేరిన శలభాల్లా మాడిపోతున్నారు. దిక్కులేని పిచ్చివాళ్ళలా పిచ్చిచూపులు చూస్తున్నారు. ఈ కాలం యువతను పట్టిపీడిస్తున్న మహమ్మారి పిచ్చిప్రేమ. ఆ ప్రేమలో పడి జీవితాలను బుగ్గిపాలు చేసుకొంటున్నారు. ఆ ప్రేమలో దొరకని మకరందం.. అమ్మా నాన్నలు చేసే పెళ్లిలో ఖచ్చితంగా దొరుకుతుందన్నది అక్షరసత్యం.
ఈ ప్రేమలు.. పెళ్లిళ్ళు మూన్నాళ్ళ ముచ్చటే. ఈ ప్రేమ సినిమాల్లో.. సీరియల్స్‌లో చూసినంత అందంగా ఉండదు. నిజ జీవితానికి.. ఊహాలోక జీవితానికి.. నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం వుంటుంది. యుక్తవయసులో పుట్టే ప్రేమలు నీటిమీద బుడగలాల్లాంటివి. వాటందం క్షణమే. వాస్తవ లోకంలోకి వస్తే.. అసలు జీవితం అవగతమవుతుంది. అందుకే అమ్మాయిలు జీవితాలను పాడుచేసుకోకండి ఈ ప్రేమలకై.. అమ్మా నాన్నలదే అసలైనప్రేమ. అసలు నిజాలను గ్రహించి అందమైన జీవితానికి పూలదారులు వేసుకోండి. క్షణికమైన ప్రేమల వెంటపడి ముళ్ళబాటల్లోకి వెళ్లకండి. అది కేవలం ఆకర్షణ. మన సనాతన సాంప్రదాయాలు అమూల్యమైనవి. పాశ్చాత్య దేశాలు సైతం మన సాంప్రదాయాలను పాటిస్తున్నాయి. కాని మనం విదేశీ సంస్కృతి పడగనీడలో సేదతీరుతున్నాం. అది ఏ క్షణమైనా కాటువేయక తప్పదు. మన మమతలు.. అభిమానాలు.. అనురాగాలు వెలలేనివి.. ఎనలేనివి. బంధాలు అనుబంధాలు ఏనాటికీ విడదీయలేనివి. చక్కగా మన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ.. జీవితాలను ఆనందమయం చేసుకొందాం. కల్మషం లేని మనసులతో.. అందరికీ ఆనందాలను పంచుకొందాము. కనిపించే.. కని పెంచే అమ్మా నాన్నలే మనకు దైవాలు.. అలాంటివారిని మనసు నొప్పించకుండా.. విలువైన జీవితాన్ని నందనవనం చేసుకొందాము. అమ్మాయంటే అమ్మే అని నిరూపించుకొందాము.

-కురువ శ్రీనివాసులు