సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘరానా విమర్శకులు
ఫలానా సంఘటన ఫలానా సమయంలో ఫలానావిధంగా ఎందుకు జరిగింది? ఎవరు చెప్పగలరు? దైవం చేసే లీలలను ఎవరు అర్ధం చేసికోగలరు? అన్నీ ఆయనే ఎరుగును. అయితే కొందరు తీరిగ్గా కూర్చొని అన్నీ తెలిసిన వారిలా విమర్శించారు. ఉదాహరణకు, యిక్కడ ఎవరయినా మరణించారనుకోండి! వారు దానిపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. ఎవరయినా మృత్యువును ఎలా తప్పించుకోగలరు? అవతారమూర్తులు కూడా తాము వచ్చిన పని కాగానే తమ భౌతికకాయాలను వదిలిపెట్టి వెళ్లక తప్పలేదుగదా! నీవు ప్రేమించిన వారెవరైనా మరణిస్తే దేవునిపై విశ్వాసాన్ని కోల్పోవటం ఎంత తెలివి తక్కువ? అతని శిక్షాకాలం పూర్తయింది. అతడు విడుదలయ్యాడు. అంతే! ఎవరూ యింకొకరికోసం పుట్టరు. ఒకరు మరొకరికోసం బతకరు.
నన్ననుసరించు
నీ అనుభవాన్నీ, వివేకాన్నీ, నిరాకరించకు. నీ సొంతబలంపై ఆధారపడు. దూషణ భూషణ తిరస్కారాలకు చలించకు. ననే్న అనుసరించు.
నన్ను చూడు. పొగడినా తెగడినా నేను పట్టించుకుంటున్నానా? ఒకళ్లేమనుకునేదీ నాకు పట్టదు. నా యిచ్ఛప్రకారం నేను నడచుకుంటున్నాను. నాదారి నేనే చూసుకుంటున్నాను. నాకునేనే సాక్షిని. నాలో పూర్తిగా విశ్వాసం ఉంచు, తరించు.
నేనుండే చోటు
భగవత్సేవకోసం ఏర్పడే సమాజాలలో పదవులకోసం తగాదాలు రాకూడదు. అవి అసూయాద్వేషాలను పెంచుతాయి. గర్వాన్ని, దురాశనూ రేపుతాయి. నిజమైన భక్తులు పదవులకు ఆశపడరు. సేవచేసే అవకాశాలకై ఎదురుచూస్తుంటారు. పదవుల వలలో చిక్కితే పతనం తథ్యం.
విశ్వాసం, శరణాగతి-వీటికి నేను అత్యంత ప్రాముఖ్యంయిస్తాను. అవి వున్నచోటునే నేనుంటాను.
చావుకు కారణం
అవిశ్వాసం మనోదౌర్బల్యానికి హేతువు. ఒక ఉదాహరణ: ఒక గ్రామంలో కలరా పడి చాలామంది చనిపోయినారు. ఒక సన్యాసి ఆ గ్రామానికివచ్చి చూసిపోతూ, దారిలో కనబడిన కలరా దేవతను, ‘ఎందరిని భోంచేసితి’వని అడిగాడు. ‘పదిమందిని మాత్రమే’అని ఆమె బదులు చెప్పింది. ‘వందకుపైగా చనిపోయినట్లు విన్నానే!’అన్నాడు సన్యాసి. అప్పుడా దేవత, ‘నిజంగా నేను చంపింది పది మందినే. తక్కినవారు కలరా అంటే భయపడి చచ్చారు’అని బదులిచ్చింది. కాబట్టి, మనోదౌర్బల్యమే మానవునికి మహాపకారి.
కట్టు ఎప్పటివరకు?
గాయం ఏర్పడితే పైన కట్టుకడతారు. లోపల గాయం నయమై కొత్త చర్మం వచ్చిందాకా కట్టుండాలి.
అహంభావమనే పుండు పుట్టినబుద్ధికి, విశ్వాసం అనే కట్టు సత్య సాక్షాత్కారం కలిగేదాకా వుండాలి.
ధ్యానిస్తే దర్శనం
భక్తునికి విశ్వాసం తగినంత గాఢంగావుండాలే కాని దేవుడు కన్పించకుండా వుండడు. రాయి కాని, చెక్క కాని, కాగితం కాని- దేనిపై భక్తుడు భగవత్స్వరూపంగా దృష్టి నిలిపి ధ్యానిస్తాడో దానిలోనే అతనికి దైవ సాక్షాత్కారం కలుగుతుంది. ప్రహ్లాదునికి దర్శనమివ్వటానికి స్తంభం చీల్చుకొని వచ్చాడు. మార్కండేయుని రక్షించటానికి లింగంనుండి బయటకు రాలేదా? కావాల్సింది దృఢ విశ్వసం, భక్తి.
దేహము బల్బు- కృప కరెంట్
దేహము బల్బు వంటిది. విశ్వాసము వాటేజి. ఎక్కువ వాట్స్ శక్తిగల బల్బు ఎక్కువ కాంతిగా వెలుగుతుంది. విశ్వాసం ఎంత ఎక్కువగా వుంటే నీలోనికి భగవత్కృప అనే కరెంటు అంత ఎక్కువగా ప్రవహించి, జీవితాన్ని అంత త్వరగా కాంతివంతం చేస్తుంది.
చిన్న పని
ప్రసాదం అంటే ఏమిటి? స్వామి అనుగ్రహం. భగవంతుని చిత్తశుద్ధిగా ప్రార్ధిస్తేనే అది లభిస్తుంది. నా అనుగ్రహం ఎప్పుడూ నీ పట్ల వుంటుంది. అది అప్పుడప్పుడు యిచ్చేదీ, తీసుకొనేదీ కాదు. అది ఎప్పుడూ లభిస్తూనే వుంది. దాని విశిష్టతను గ్రహించి, అందుకొనే చైతన్యబుద్ధికి అది సదా అందుతూనే వుంది. ఆ చైతన్యాన్ని నీ అంతఃకరణలో పాదుకొలుపు. అనుగ్రహ ప్రసాదాన్ని అందుకో.
బహుమతి లభించినప్పుడు నీవు చేయాల్సిన చిన్న పని ఒకటే, చేయిచాచి అందుకోడం!
అమూల్య అవకాశం
నేను యింతకాలంగా మీకు బోధ చేస్తున్నాను. కాని నా బోధలు మీ తలకెక్కినట్లుగానీ, వాటిని మీరు ఆచరిస్తున్నట్లుగానీ కనిపిస్తున్నదా? లేనప్పుడు ఏంప్రయోజనం? ఇనే్నళ్లుగా మిమ్మల్ని మేల్కొల్పటానికి, మీ విధిని మీరు నిర్వర్తించేలా చేయటానికి నేనుచేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలం కానట్టే అనుకోవాలా? సముద్రపు ఒడ్డున పెద్దపెద్ద గండశిలలు ఉంటాయి. సముద్రపు అలలువచ్చి వాటిని కొట్టుకుంటూ వుంటాయి. కాని అవేమాత్రం చలించవు. అలలు వూరుకోవు. రాళ్లు కదలవు. ఇది అలాగే జరుగుతూ వుంటుంది. మీరా గండశిలల్లా వుంటే లాభం లేదు. మేల్కొనండి! ఈ అమూల్య అవకాశాన్ని జారవిడుచుకోకండి!
ఇంకా ఉంది