సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ తత్ న
ఈ దేహంలో నీవున్నావు కాబట్టి ఈ దేహమే ‘నేను’అనుకోరాదు. ఇప్పుడు ఈ హాలులో నీవున్నావు కాబట్టి ఈ హాలే నేను అని నీవు అనుకుంటున్నావా? ఇక్కడ కూచునే్నది కాసేపే. ఈ హాలు వేరు. నీవు వేరు.
తరువాత ఇక్కడినుంచి వెళ్లి టాంగాలో కూర్చుంటున్నావు. ‘టాంగాయే నేను’ అని అనుకుంటున్నావా? ఇంటివద్ద టాంగా దిగుతావే కాని టాంగాను నీతోపాటు యింట్లోకి తీసుకొని వెళ్లవు గదా! బయటనే వదిలివేస్తావు. అలాగే నీవు కూడా ‘ఇంటికి’ చేరగానే నీ దేహాన్ని ఇక్కడే వదిలి వెళతావు. నీతో తీసుకొని వెళ్ళవు. ‘అహం ఏతత్ న’ ఇదియే మానవునకు ప్రధానమైన జ్ఞానం. దీనికి మించిన జ్ఞానం లేదు. కానరాదు. ‘అహం’ అనగా వేదము ‘ఆత్మ’ అని చెబుతూ వచ్చింది. ‘ఏత్’ అనగా దృశ్య కల్పితమైన, తన దేహముతో సహా స్థూల, సూక్ష్మ వస్తుకోటి, ప్రాణి కోటి, చంద్ర, సూర్య, నక్షత్ర, గ్రహ మండలాలన్నీను. ‘ఏతత్ న’- ‘ఇది నేను కాదు. నేను ఇది కాదు’, అని అర్ధము. అనగా నశ్వరమైన ఈ ప్రకృతి, ఈ సృష్టి, ఈ దేహం నేను కాదు అని గ్రహించు.
వేదపురుష యజ్ఞం
తంత్రం, యంత్రం, మంత్రం ఎక్కడో లేవు. నీ శరీరమే యంత్రం. నీ వూపిరే మంత్రం, నీ హృదయమే తంత్రం. నీవు పలికే మాటలన్నీ మధురంగా వుంటే నీ ఉచ్ఛాస నిశ్వాసాలే ఋగ్వేదం అవుతాయి. మధురమైన మాటలనే తప్ప యింకేం వినను అని పెట్టుకుంటే నీవు వినేదంతా సామగానమవుతుంది. నీవు చేసే పనులన్నీ మధురమైనవే అయితే నీ చేతలన్నీ యజుర్వేదమవుతాయి. అప్పుడు నిత్యం నీవు వేదపురుష యజ్ఞాన్ని సలిపిన వాడివౌతావు.
పరిపక్వత
వేదాలలో ముఖ్యమైన భాగం కర్మకాండే. ఎందుకంటే, కర్మ వలననే బీజం నాటబడుతుంది. మొక్క పెరుగుతుంది. పూవు పూస్తుంది. కాయ కాస్తుంది.
ఉపాసన కాండ ఉపాసన విధానాలను గురించి తెలుపుతుంది. కాయ ఎలా పక్వానికి వచ్చి ఫలంగా మారేదీ తెలియజేస్తుంది.
జ్ఞానకాండ ఆ ఫలం మాధుర్యాన్ని ఎలా సంతరించుకొని పరిపక్వమయేదీ చెబుతుంది.
మొదటి దశ నిదానంగా జరిగేది. అదెక్కువ సమయాన్ని తీసికొంటుంది. కనుక కర్మకాండ విస్తారంగా వుంటుంది. ఉపాసన, జ్ఞానకాండలు కొంత తక్కువగా వుంటాయి. పక్వదశకు రావటానికి పండు చెట్టుకే వుండక్కరలేదు. గడ్డిలో మాగేసినా చాలు కదా!
సాయి ప్రేమ
మనిషి మనిషిగా పుట్టగానే సరిపోతుందా? మనిషి సంపూర్ణ మానవత్వాన్ని పొందాలి. అందుకు గల మూడు సాధనాలలో మొదటిది జ్ఞానం (తల); రెండవది భక్తి (హృదయం); మూడవది కర్మ (చేతులు).
తల వంటి విచారణా శక్తి, హృదయము నంటి కారుణ్యశక్తి, చేతుల వంటి క్రియాశక్తి ఉండాలి. ఈ మూడింటి సాయంతో మానవుడు మానవుడిగా మారి, దైవత్వం దిశగా సాగ గలుగుతాడు. దైవత్వమే సాయి ప్రేమ.
ఓంకారం అంటే...
ఓం కారంలో ఆ ఉ మ అని మూక్షక్షరాలున్నాయి. ‘అ’ అంటే విశ్వం. ‘ఉ’ అంటే తేజం. ‘మ’ అంటే ప్రజ్ఞ.
ఓంకారానికి శాస్త్రాలు మరో వివరణను కూడా ఇచ్చాయి. ‘అ’ అంటే విశ్వం; సంచారానికీ, కదలికకూ ప్రతీక. ‘ఉ’ అంటే తేజం; స్వప్నమునకు ప్రతీక. ‘మ’ అంటే ప్రజ్ఞ; సుషుప్తికి ప్రతీక, ముముక్షువులకు ప్రణవసాధన అవసరం. వేదాలు ప్రణవ నాదాన్ని పదే పదే ఉచ్చరించమంటున్నాయి. శాస్త్ధ్య్రాయనం చేటప్పుడూ, దైవనామాన్ని ఉచ్చరించేటప్పుడూ, నిత్య నైవేద్యాదులు చేసేటప్పుడూ ఓంకారంతోనే ప్రారంభించటం మన సంప్రదాయం.
జన్మ పరంపర
శాస్త్రాలూ, పురాణాలూ, హరికథలూ- యివన్నీ ఎందుకు? మనిషిని గురించిన యథార్థాన్ని అతనికి చెప్పేందుకే గదా! ఈ గ్రంథాలలో నిన్ను తప్పు దారిపట్టించే కథలుండవు. ఈ గ్రంథాలను రచించిన మహర్షుల అభిప్రాయం అది కాదు. నీ కళ్లముందేం జరుగుతున్నదో అదొక్కటే నీకు ఎరుక. వర్తమానానికీ, భూతకాలానికీ వున్న లింకు నీకు తెలియదు. భవిష్యత్తు ఎలా వుంటుందో నీవెరగవు. సినిమా టైటిల్సు లాగా అవి ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. ఒక పంక్తి నీవు చదవగానే అది పోయి మరోటి వస్తూనే వుంటుంది. అలాగే మనిషి జన్మించగానే అంతకుముందు జన్మ జ్ఞాపకాలు అంతరిస్తాయి.
కృషి ఉంటేనే ఋషి
కృష్ణుడు అవతార మూర్తి. తలుచుకుంటే క్షణంలో ఏ పనైనా చేయకలడు. అర్జునుడు విషాదయోగంలో పడ్డప్పుడు తన మహిమతో అతని వ్యామోహాన్ని నశింపచేయగలిగి వుండేవాడు. కాని ఆయన తన శక్తినీ, మహిమనూ ఉపయోగించలేదు. ఏం చేయాలో, ఆ వ్యామోహం నుంచి ఎలా బయటపడాలో అర్జునుడికి బోధించాడు. అర్జునుడు ఆయన చెప్పిన ఔషధాన్ని సేవించే రక్షింపబడ్డాడు.
నీవు నాకు సఖుడవు. చుట్టానివి. నాకు చాలా దగ్గర వాడివి. కనుకనే నేను నీకు సారథినయినాను. నీవిప్పుడు చాలా బాధలో వున్నావు. నీకు కలిగిన ఈ విషాదాన్ని తొందరగా తొలగించాల్సి వుందని నేనొప్పుకుంటాను. కానీ నీ అజ్ఞానం నీ ప్రయత్నంవల్లనే తొలగిపోవాలి. అంతేకాని నేనేదో అద్భుతం చేసి తీసివేసేది కాదు- అని చెప్పాడు కృష్ణుడు.
ఇంకా ఉంది