సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత్రోచిత నటనం
అన్నగత ప్రాణం ఎన్నాళ్లు?
ఆత్మ అలా కాదు. నాశనం లేనిది, ఈ భూమిపై యింకా యింకా
బతకాలని కాదు కోరుకోవలసింది. బతికినంతకాలం దివ్యంగా బతకాలని. ఏళ్లు గడిస్తే ఏంలాభం? ఎరుకను సంపాదించాలి.
బుద్ధుడు సత్యాన్ని దర్శించాడు. బోధించాడు. అంతా దుఃఖమే. అంతా శూన్యమే. అంతా క్షణితమే. అంతా కలుషితమే. విజ్ఞులు (తెలిసినవారు) తమ విధులను సక్రమంగా వివేచనతో, నేర్పుతో నిర్వర్తిస్తారు. ఈ జగన్నాటకంలో మన పాత్రను మనం పోషించాలి. అదీ పేరుకోసం కాదు.
అజ్ఞానం
ఇతర జంతువులవలె గాక మానవునకు పరమాత్ముడు సదసద్వివేకాన్ని సాధించుకోగల బుద్ధిని ప్రసాదించినాడు. దానిని వృద్ధిచేసుకొని పరమేశ్వరుని కనుగొనవలసి వుంది. అలాచేయకుండా భగవంతుడెక్కడున్నాడు? ఉండిన కనపడడెందుకు? అని వాదించే వాళ్లను చూస్తే చాలా విచారం కలుగుతుంది. అంతియేగాక ‘వారి అజ్ఞానమును వారే వెల్లడి చేసుకొనుచున్నారే’!అనిపిస్తుంది. ఎ,బి.సి,డిలు నేర్చుకోకుండా ఎమ్.ఏలు, బి.ఏలు ప్యాస్ కావలెను అను వారి అజ్ఞానం ఎట్టిదో, ఏ సాధనా చేయక భగవంతుడు కనిపించుట లేదే అని వాదన చేయువారి అజ్ఞానమూ అట్టిదే!
ఎక్కడికి పయనం?
ఒక మనిషి రైల్వేస్టేషన్‌కు వెళ్ళి బుకింగ్ ఆఫీసు కిటికీ దగ్గర నిలబడి తనకొక టికెట్ ఇమ్మని గోలపెడుతున్నాడు. లోపలున్న గుమాస్తా తికమక పడుతున్నాడు. ఎందుకంటే, టిక్కెట్ అడుగుతున్న మనిషికి తాను వెళ్లవలసిన స్టేషన్ పేరు తెలియదు! ఉన్న వూరిమీద విసుగుపుట్టి అక్కడ నుండి ఎటన్నా వెళ్ళిపోవాలని అతని ఆరాటం. కాని, వెళ్ళవలసినచోటు ఏదో అతనికే తెలియదు.
అతని సంగతి వింటే మీకు నవ్వు రావచ్చు. అతని వలెనే మీరుకూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. తెలుసా? నూరేళ్ళు బ్రతికినా ప్రతి వ్యక్తీ ఎప్పుడో ఒకప్పుడు వెళ్లక తప్పదు కాని ఆ వెళ్ళవలసిన చోటేదో ఏ వొక్కరూ తెలుసుకోవడం లేదు. తన సన్నిహిత బంధుమిత్రులు ఒకరివెంట ఒకరు కూలిపోగా ఇంకా ఇక్కడ ఉండాలనే కోరికాపోతుంది. ఇక్కడినుంచి ఎక్కడకు పోవాల్సిందీ, ఎక్కడకు పోతున్నదీ తెలియదు.
ప్రతి రూపాలు
ఒక కుక్క ఒక అద్దాల గదిలో చిక్కుపడ్డది. చుట్టూవున్న అద్దాలలో దానికి తన రూపమే కనిపిస్తూవున్నది. అవన్నీ తన ప్రతిబింబాలే అన్న జ్ఞానం ఆ కుక్కకు లేకపోయింది. అందువల్ల అవన్నీ కుక్కలనీ, తనను కరుచుటకు వస్తున్నాయని అది భ్రమపడింది. దానితో అది అదేపనిగా మొరుగుచు ఒక్కొక్క ప్రతిబింబం మీదికి దుముకసాగింది. ప్రతిబింబాలు కూడా అట్లే దానిపైకి దుముకుతూ వున్నాయి. అందువలన దీనికి కోపము అంతకంతకు పెచ్చుపెరిగి అరచి అరచి ఎగిరి ఎగిరి అలసి తుదకు పిచ్చిపట్టి పోయింది. ఆత్మజ్ఞానం లేనివారి స్థితి ఇంతే! జ్ఞానియైనవాడు సర్వత్ర తననే చూసుకొనుచు, ఎల్లప్రాణులను తన ఆత్మప్రతిబింబములే అనుకొని సంతోషిస్తాడు.
అజ్ఞాన మూలం
ఒకడు తన కుమారునికి తేలుకుట్టినదని రాగా, డాక్టరొక తైలమిచ్చి, తేలుకుట్టినచోట పూయమన్నాడు. అతడిండికి వెళ్ళి, ‘తేలెక్కడ కుట్టినది?’ అని కొడుకు నడుగగా వాడు, ‘అదిగో! ఆ మూల కుట్టిన’దని గది మూలను చూపించాడు. వెంటనే తండ్రి ఆ తైలమును గది మూలకు పూసాడు. కాని, కొడుకు నొప్పిపోతుందా? నొప్పి ఉన్నదొకచోట, మందు వేసింది మరొకచోట, అజ్ఞానమునకు మూలమేదో కనిపెట్టి దానిని నిర్మూలించాలి.
పునరపి జననం
తల్లి పిల్లి తన బిడ్డలను ఏడుచోట్లకు మారుస్తుంది. అట్లా మార్చకపోతే ఆ బిడ్డ కన్ను తెరువదట! అంతలోపలైనా అది కన్నుతెరుస్తుంది. కాని మనిషి మాత్రం అట్లాకాదు. లక్ష ‘ఇళ్లు’మార్చినా, ‘పునరపి జననీ జఠరే శయనం’అని ఎన్ని గర్భవాసములు చేసినా మనిషి కన్ను తెరవడు. చీకటిలోనే యిడుమలు పడుతుంటాడు. కాని కన్నుతెరచి తెలివి తెచ్చుకొని ‘తమసోమా జ్యోతిర్గమయ’ అని ప్రార్థించడు.
అద్దెకొంప
‘దహ్యతేతి దేహః’ దహింపబడునదే ‘దేహం’ అన్నారు. ఈ శరీరానే్న అద్దెకొంప అనవచ్చు. ఆత్మ కొంతకాలంపాటు వచ్చి అద్దెకొంపలో వుంటున్నది. ప్రారబ్ధమనే రెంటు చెల్లించి చావురాగానే ఖాళీచేసి పోతున్నది. అద్దెకున్నవారిని ఖాళీచేయించేందుకు ఎప్పటికప్పుడు చూస్తూనే వుంటాడు యజమాని. ఖాళీచేయమని యజమాని ఇచ్చే తాఖీదే మరణం.
ఇకపై నాగతేమి?
జ్ఞానికాని వాడు తానూ సుఖపడడు. తనవారినీ సుఖపెట్టడు. ఒకనికి అంత్యకాలం సమీపించినది. అప్పుడతని భార్య ‘ఇక నాగతి ఏమి?’అని అడిగింది. అట్లే తల్లిదండ్రులు, పిల్లలందరును. ఇక మా గతిఏమి? మా గతి ఏమి? అని అడగటం సాగించారు.
అప్పుడు ప్రాణములు విడువబోతున్న ఆ వ్యక్తి నిస్సహాయస్థితిలో తన చుట్టూఉన్న వారి వంకచూసి, ‘ఇప్పుడు నాగతి ఏమన్న చింతతో నేనున్నాను. అలాటిది మీకేం చెప్పగలను?’ అన్నాడు.
అతడు జ్ఞానియైయున్నచో వారి ప్రశ్నకు సమాధానం చెప్పేవాడు. తాను నిశ్చింతగాపోయి యుండెడివాడు. అతడు ప్రశాంతంగా పోవడంచూస్తే అతనివారు కూడా కొంత దుఃఖశాంతి పొంది యుండేవారు.
ఇంకా ఉంది