సబ్ ఫీచర్

ఎగువ సభ ఎవరి కోసం? ఎందుకోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాసన మండలి నిర్మాణాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని ఆశయాలను మరియు అధికారాలను పరిశీలిస్తే, అది అసలు అవసరమా అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు. రాజ్యాంగం శాసన మండళ్ల భవిష్యత్తును రాష్ట్రాల శాసనసభల ఇష్టారాజ్యాలకు వదిలి వేసింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసన మండలి ఉంటే రద్దుచేయాలనో లేదా శాసన మండలి లేకుంటే ఏర్పాటుచేయాలనో కోరుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇవ్వబడింది. రాష్ట్ర శాసనసభలోని మూడింట రెండువంతుల మంది సభ్యులు మండలి ఏర్పాటు గురించి కానీ లేదా రద్దుగురించి కానీ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రం వాటిని ఆమోదిస్తుంది. రాజ్యాంగం ప్రకారం శాసన మండలి సభ్యుల సంఖ్య కనిష్టంగా 40 ఉండాలి, గరిష్టంగా శాసనసభలోని మొత్తం సభ్యులలో మూడవ వంతు ఉండాలి. అట్టి మండలిలో 1/3వ వంతు సభ్యులను స్థానిక సంస్థల నుండి మరో 1/3వ వంతు సభ్యులను శాసనసభ సభ్యుల ద్వారా 1/12వ వంతు సభ్యులను పట్ట్భద్రులనుండి మరో 1/12వ వంతు సభ్యులను ఉపాధ్యాయులనుండి ఎన్నుకుంటారు. ఇవిపోగా మిగతా 1/6వ వంతు సభ్యులను గవర్నరు సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, సాంఘిక సేవ మొదలైన రాజకీయేతర రంగాలలో నిష్ణాతులైన వారితో నామ నిర్దేశ పద్ధతిలో భర్తీచేస్తారు.
చాలావరకు ప్రపంచ రాజ్యాలు కాలమాన పరిస్థితులనుబట్టి చిన్న రాజ్యాలు ఏకసభా పద్ధతిని రూపొందించుకోగా పెద్దరాజ్యాలు సమాఖ్యలుగా ఏర్పడి వాటి అవసరాలను తీర్చుకునే నిమిత్తం ద్విసభా విధానాన్ని ఏర్పాటుచేసుకున్నాయి. ఏకసభా పద్ధతిలోకంటే ద్విసభా పద్ధతిలో ప్రజాస్వామ్య ఆవిర్భావంలో అంతర్భాగంగా వచ్చిన వ్యవస్థ. ఎగువసభ సమాజంలోని వైవిధ్యతకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించింది. గత ముప్పది సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అనేక ఉద్యమాలు కొత్త సామాజిక శక్తులను తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యమంత్రిగా దళిత ఉద్యమాలు స్ర్తివాద, రైతుకూలీ, వెనుకబడిన కులాల పోరాటాలు రాజకీయ ప్రాతినిధ్యం కోరుతున్నాయి. నిర్మాణపరంగా ప్రస్తుతమున్న శాసన మండలి వీరికి ప్రాతినిధ్యం కల్పించలేదు. ప్రస్తుతమున్న కౌన్సిల్ ఉపాధ్యాయులకు, పట్ట్భద్రులకు, స్థానిక సంస్థలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది. మారుతున్న సామాజిక వైవిధ్యతకు అది ఏమేరకు స్థానం కల్పిస్తుంది అన్నది ప్రశ్న. షెడ్యూల్డుకులాలు, తెగలవారికి శాసనసభ మరియు లోక్‌సభలలో సముచిత ప్రాతినిధ్యం కల్పించే నిమిత్తం వారికి రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. శాసనమండలి విషయంలో అలాంటి రిజర్వేషన్లు ఏవీలేకపోవడంతో వారికి ఎగువసభలో సముచిత ప్రాతినిధ్యం లభించుటలేదు. మొదటినుండి ఎగువసభ ఉన్నతవర్గాల వారికి మాత్రమే అందుబాటలో ఉంది తప్ప దళితులకు, బలహీనవర్గాలకు, మహిళలకు కాదన్నది చారిత్రక సత్యం. రాజ్యాంగం ప్రకారం ఎగువసభ సమాజంలోని వైవిధ్యతకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించింది. మరి ఈ అంశం ఏమేరకు నెరవేరుతున్నట్లు అన్నది ప్రశ్న. ఈ ఆశయం నెరవేరాలంటే చరిత్రలో సుదీర్ఘకాలంపాటు అణచివేతకు, దోపిడీకి గురైన ఎస్.సి., ఎస్.టి., వెనుకబడిన కులాలు మరియు మహిళలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించి, వారికి మండలిలో స్థానం కల్పించాల్సి వుంది. గత 70 సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆ దిశలో ఎప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టిన ఉదంతాలు లేవు. అలాంటప్పుడు దాని కొనసాగింపు ఎవరికోసం ఎందుకోసం? అన్నది ప్రశ్న.
ఎగువసభల ఏర్పాటు విషయంలో ఉన్న చారిత్రక నేపథ్యాలలో ఒకటి అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఈ సభలను ఏర్పాటుచేసి అందులో సమాజంలో మేధావులుగా గుర్తింపబడ్డ పట్ట్భద్రులు, ఉపాధ్యాయులతోపాటు సాహిత్యం, కళలు, శాస్తస్రాంకేతిక రంగాలు, సాంఘిక సేవ మొదలైన రాజకీయేతర రంగాలలో నిష్ణాతులైన వారికి ఇందులో ప్రాతినిధ్యం కల్పిస్తే జాతికి వారి సేవలు ఉపయోగపడ్డాయని, రాష్ట్ర గవర్నర్ ద్వారా నామనిర్ధేశ పద్ధతిలో భర్తీఅయ్యే వారిలో నిష్ణాతులైన అర్హులకు ఏనాడుకూడా అవకాశం లభించలేదు. అసలు నిఖార్సైన నిష్ణాతులకు ఆ రాజ్యాంగ గౌరవం ఏనాడైన లభించిందా? విజ్ఞానవేత్తలు, మేధావులు ప్రత్యేక రంగాలలో నిపుణులకు ఎన్నికల ద్వారాగాక నామనిర్దేశ పద్ధతిలో ప్రాతినిధ్యం కల్పిస్తే జాతికి వారి సేవలు లభించే అవకాశముందనే ఆశయం ఏమేరకు సాకారం అయిందన్న విషయం గత 70 సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఉద్యోగాలలోఉన్న పట్ట్భద్రులకు, ఉపాధ్యాయులకు వ్యవస్థీకృత ఉద్యోగ సంఘాలుండగా వారికే అందులో ప్రాతినిధ్యం కల్పించి సమాజంలో అసంఖ్యాకంగా, అసంఘటితంగా వున్న మిగతా సామాజిక వర్గాలకు అందులో ప్రాతినిధ్యం కల్పించలేదంటే అది ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా సృష్టించబడ్డదో అర్థం చేసుకోవచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పట్ట్భద్రుల నియోజకవర్గంలో పోటీచేయాలనే అభ్యర్థి పట్ట్భద్రుడే కానవసరం లేదు. అదేవిధంగా ఉపాధ్యాయుల నియోజకవర్గంలో పోటీచేయాలనుకునే అభ్యర్థి ఉపాధ్యాయుడే కానవసరం లేదు. పోటీకి అందరూ అర్హులే. పోటీకి అర్హులే కానీ వారికి ఓటుహక్కు మాత్రం ఉండదు. ఒక వ్యక్తికి ఓటుహక్కు లేకుండా పోటీచేసే హక్కు ఎలా లభిస్తుందో అర్థంకాదు.
శాసన మండలి అధికారులను పరిశీలిస్తే అసలు ఎగువ సభ అవసరమా? అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు. శాసన నిర్మాణంలో మండలి పాత్ర కేవలం సలహాలివ్వడానికే పరిమితం. ఆ సలహాలను శాసనసభ గౌరవించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. శాసన మండలి తాను ఆమోదించని బిల్లులను చట్టంకాకుండా కేవలం నాలుగునెలలపాటు మాత్రమే జాప్యంచేయగలదు. ఏ బిల్లుకైనా శాసన మండలి ప్రతిపాదించే సవరణలకు సలహాపూర్వకమైన విలువ మాత్రమే ఉంటుంది. ఆర్థిక బిల్లుల విషయంలో ఈ మాత్రం స్వేచ్ఛ, అధికారం కూడా శాసన మండలికి లేదు. ఈ బిల్లుల విషయంలో అవి చట్టం కాకుండా కేవలం 14 రోజులు మాత్రమే ఎగువసభ జాప్యం చేయగలదు. శాసనసభ ఆమోదించిన బిల్లు చట్టంకాకుండా ఎగువ సభ జాప్యం చేయడానికి అవసరమా అన్నది ప్రశ్న. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికి సదరు ప్రభుత్వ మనుగడకు ఎటువంటి విఘాతం కలుగదు. అంతేగాక రాష్టప్రతి ఎన్నికల్లో పాల్గొనేందుకు కౌన్సిల్ సభ్యులకు కనీసం ఓటుహక్కు కూడా ఉండదు. అలాంటప్పుడు ఎగువసభ కొనసాగింపు అవసరమా? అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు.
గత 70 సంవత్సరాలలో వివిధ రాష్ట్రాలలో ఉనికిలోవున్న ఎగువ సభల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అవి క్రమంగా ఏవిధంగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా పరిణామం చెందినవో మనకు అర్థం అవుతుంది. చట్టసభలు నిర్మాణపరంగా సమాజంలోని అన్నివర్గాలవారికి ముఖ్యంగా తరతరాలుగా అణచివేతకు దోపిడీకి గురైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఉండాలి. కానీ దీనికి భిన్నంగా ప్రస్తుతం కొనసాగుతున్న ఎగువసభలు కొన్నివర్గాలకే ప్రాతినిధ్యం కల్పిస్తున్నాయి. దాంతో అవి సమాజంలోని వైవిధ్యతకు ప్రాతినిధ్యం కల్పించలేకపోతున్నాయి. ఏ అధికారాలు లేని ఈ ఎగువసభల నిర్వహణకు ప్రజాధనం పెద్దమొత్తంలో దుర్వినియోగం అవుతుంది. క్రమంగా దిగజారుతున్న కౌన్సిల్ ప్రమాణాలను మరియు అది పనిచేస్తున్న తీరుతెన్నులను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఆ రాష్ట్రంలోని ఎగువ సభ రద్దువిషయంలో తీసుకున్న నిర్ణయం సహేతుకమే కాదు. ముమ్మాటికి హర్షణీయం.

- ప్రొ. జి. లక్ష్మణ్, 9849136104