సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటిలోని వైరి
తన లోపలి శత్రువులను ముందు జయించాలి. ఇంట గెలవకుండా రచ్చ గెలువగలమా? జాడ్యంతో కుములుతూ, జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తావు? కోరికలే గుర్రాలయితే భక్తినెలా సాధిస్తావు? (ద్వంద్వాల పట్ల) సమ దృష్టి ఒక్కటే శాంతి సామరస్యాలను ప్రసాదిస్తుంది.
పండితః సమదర్శినః
మనం ‘రామరాజ్యం’అంటూ ఏదో మాట్లాడేస్తుంటాం. రాముని అనుసరించకుండా రామరాజ్యం ఎలా వస్తుంది?
హనుమంతుడు త్రికరణ శుద్ధికలవాడు. అందుకే ఆయనకు గొప్ప దేహబలం. బుద్ధిబలం, సచ్ఛీలం వున్నాయి. రామాయణ పాత్రలలో ఆయన అమూల్య వజ్రంలా ప్రకాశిస్తుంటాడు.
ఆయన గొప్ప పండితుడు. ఆరురకాల వ్యాకరణాలనూ ఆయన అభ్యసించాడు. నాలుగు వేదాలనూ, ఆరు వేదాంగాలనూ ఔపోసన పట్టాడు. గీత ‘పండితః సమదర్శినః’అంటోంది. అన్నిటినీ సమంగా చూసేవాడే పండితుడు. హనుమంతుడు పండిత శబ్దానికి చక్కని ఉదాహరణ.
సమతాభావం సనాతనం
ఉన్నట్లుండి కొందరు ఏదోవొక ‘ఇజం’అంటూ బయలుదేరతారు. ఉదాహరణకు నూతన విప్లవాత్మక సోషలిజం సంగతే తీసికొందాం. ‘అంతా సమానమే’అన్న రుూ భావన మనకుమాత్రం కొత్తదికాదు. సనాతనమే.
విశాల సామ్రాజ్యానికి చక్రవర్తి శ్రీరాముడు తన పెళ్ళాంతో వచ్చిన గొడవలో ఒక రజకుడు తొందరపాటున జారిన పొల్లుమాటను కూడా ఆయన తోసిపారేయలేదు. మళ్లీ యింకొకరలా వేలెత్తిచూపే వీలులేకుండా తన భార్యను అడవులలో వదిలివేశాడు. రామరాజ్యంలో ప్రతి వ్యక్తి మాటకూ ప్రభువు అంతటి విలువనిచ్చేవాడు.
పక్క పక్కనే...
ఆస్తికులను నాస్తికులు పలురీతులుగా దూషించేది సహజం. ఆస్తికుల స్తోత్రం, నాస్తికుల దూషణం రెండూ దేహరచనలో ప్రకృతిసిద్ధంగా కనబడే మంచి, చెడు రక్తనాళములవలె సమాజంలో ఉండవలసిందే. దానికై అశాంతికి గురికావడం మీ తప్పు. టౌన్‌లలో త్రాగే నీళ్లపైపులు, మురికి నీళ్ళ పైపులు సహజంగా పక్కపక్కనే ఉండవలసినదే కదా! ఆహారము, అమేధ్యము రెండూ దేహానికి సహజం. అట్లానే నిందాస్తుతులలో ఒకటి పవిత్రము, రెండవది అపవిత్రము. అయినా, సరే. ఒక దానిని స్వాగతించి మరొక దానిని తిరస్కరిచరాదు. రెంటిని అలక్ష్యదృష్టితో చూడాలి.
తర్కం-జ్ఞానం
జనకుడు జ్ఞాని నిత్యమూ అద్వైతానుభూతిలో ఉండేవాడు. సులభ అనే ప్రఖ్యాత తార్కికురాలు ఒకనాడు జనకుని దగ్గరకువెళ్ళి వాదించింది. ‘నీ జ్ఞానదృష్టికి మానవులందరూ ఒకటే. కాబట్టి నన్ను నీ రాణిగా స్వీకరించి పండితులు సమదర్శనులని నిరూపించు’అంటుంది. అప్పుడు జనకుడు, ‘జ్ఞానదృష్టికి అందరూ ఒకటే కనుక, స్ర్తిపురుష విభేదం ఉండదు’అని చక్కగా సమాధానంచెప్పి సులభకు జ్ఞానోదయం కలిగించాడు.
గృహమా? కారాగృహమా?
దొంగతనం చేసి పట్టుబడి ఒక వ్యక్తికి పదేళ్ళు కారాగార శిక్షపడింది. శిక్ష పూర్తికాగానే జైలు అధికారి, ‘నిన్ను వదిలివేస్తున్నాం. నీ తట్టాబుట్టా మూట కట్టుకొని ఇంటికి వెళ్ళు’అన్నాడట. ఆ దొంగ, ఎందుకుసార్! అవన్నీ ఇక్కడే ఉండనీయండి. రేపే మళ్ళీ వస్తాను. అన్నాడట. పదేళ్ళు శిక్షననుభవించినా మళ్ళీ జైలుకురావాలనే ఉందతనికి. మీరీ దొంగవంటి వారు కారాదు. ప్రపంచమనే జైలుకు మళ్ళీ రాకూడదు. అజ్ఞానమే దొంగతనం. అది నాశనమైతే మళ్ళీ జన్మ ఉండదు.
దుఃఖమే గురువు
సంసారంలో సుఖం, దుఃఖం రెండూ ఉంటాయి. ఈ రెండూ కావడి కుండలు. రెంటినీ సమానంగా, కావడి బద్దతో, మోయాల్సి వుంటుంది. దుఃఖం సుఖంకన్నా కూడ మనకు మంచి గురువు. అది మనకు భగవంతుని గుర్తుకుతెస్తుంది.
న సుఖాల్లభ్యతే సుఖమ్
శాస్త్రం ఏం చెబుతున్నది? ‘నా స్సుఖల్లభ్యతే సుఖం’- సుఖంవల్ల సుఖం రాదు’అంటున్నది. సుఖాన్ని దుఃఖం ద్వారానే పొందవచ్చు. రెండు బాధల మధ్య విరామానే్న మనం సుఖం అంటున్నాం.
జీవితంలో వచ్చే వొడుదుడుకులనూ కష్టాలనూ సమదృష్టితో సాత్విక బుద్ధితో తీసుకొనగలిగితే శాశ్వతానందాన్ని పొందగలవు.
సౌమ్యస్థితి
ఆరోగ్యంగా ఉండాలి అంటే త్రిధాతువులు- వాతం, పిత్తం, శే్లష్మం- సమస్థితిలో వుండాలి. అప్పుడు దేహం స్వస్థవృత్తిలో వుంటుంది. ఆయా ధాతువులు చయంగానీ, ప్రకోపంగానీ, క్షయం గానీ చెందితే వాటి సమస్థితి చెడుతుంది. ధాతువులే దోషాలవుతాయి. అస్వస్థత కలుగుతుంది.
ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఈ మూడు గుణాలూ మనిషి మానసిక స్థితిని సూచిస్తుంటాయి.
ఆధ్యాత్మిక సాధనలో త్రిధాతువులను సమస్థితిలో వుంచుకోటం, త్రిగుణాలనూ సౌమ్యస్థితిలో ఉంచుకోవటం కనీసం ఒక దశ దాకా అవసరం.
అనుగ్రహ సాగరం
జ్ఞానం లభిస్తే ఏంజరుగుతుంది? అదృష్టం కలిసి వస్తే పొంగిపోవటం వుండదు. కలసి రాకపోయినా క్రుంగిపోవటం జరగదు. రెంటినీ జ్ఞాని సమదృష్టితోనే చూస్తాడు. మనిషి హృదయంలో నిండివున్న అనుగ్రహ సాగరాన్ని మలయమారుతంగాని, ప్రచండ మారుతంగాని కలచలేవు.
ఇంకా ఉంది