సబ్ ఫీచర్

ఆధ్యాత్మిక సంగీతంలో దిట్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పువ్వు పుట్టగానే పరిమళించును’ అన్నట్లు వారిద్దరూ అన్నాచెల్లెళ్లు సంగీత సాధనలో గొప్ప ప్రావీణ్యత పొందారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం ప్రాంగణం పరిసరాలలో సంగీతంపై విద్యార్థినీ విద్యార్థులకు శిక్షణనిచ్చి చక్కటి అవగాహన కల్పిస్తున్నారు.
వీరిద్దరూ శ్రీ సత్యసాయి భక్తులైన సాయిచరణ్ రాజు, సాయి శృతి రాజులు. వీరి తల్లిదండ్రులు జగదీష్ చంద్రరాజు, పావని రాజుల ప్రోత్సాహంతోనే తాము సంగీత సాధన చేశామని అన్నాచెలెళ్లు తెలిపారు. సంగీత సాధన గానంలోగల మధురిమలు తమ ఆధ్యాత్మిక గీతాల ద్వారా అందరినీ ఆకర్షించిన ఈ సంగీత కలల పంట సాయిచరణ్ రాజు, సాయిశృతి రాజులు తమ విద్యాభ్యాసం సాగిస్తూనే శాస్ర్తియ సంగీతంపై పట్టు సాధించారు. వీరు 1999లో కరీంనగర్ నుంచి వచ్చి పుట్టపర్తిలో స్థిరపడ్డారు.
పలు ఆధ్యాత్మిక గీతాలు ప్రతినిత్యం భక్తాదులకు అందిస్తున్న ప్రశాంతి నిలయంలో వీరు ఇరువురూ సంగీతంలో డిప్లొమా సాధించారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తిచేశారు. సంగీత కళాభిమానులకు కనువిందు చేసే ఆధ్యాత్మిక గీతాలు గానామృతం చేయడంలో వీరు సిద్ధహస్తులు. మన దేశంతోపాటు మిగతా ప్రాంతాలలో 317 శాస్ర్తియ సంగీత కచేరీలు నిర్వహించి ఎన్నో పురస్కారాలు పొందారు. 2009 సిలికాన్ ఆంధ్ర లక్షగళార్చనలోనూ, కువైట్‌లోను, 2010లో మలేషియాలోనూ, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన మందిరంలో అప్పటి మహిళా మంత్రి డి.కె.అరుణ నుంచి పురస్కారం, హైదరాబాద్ శిల్పారామంలో సంగీత ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖ కవి డా. సి.నారాయణరెడ్డి, గానకోకిల పి.సుశీల, సంగీత విద్వాంసులు డా. మంగళంపల్లి బాలమురళికృష్ణ, గాయని చిత్ర, జానకి తదితరుల ప్రముఖుల ప్రశంసలు పొందారు. ‘స్వరఝరి’ సంగీత లహరి కార్యక్రమం ద్వారా వీరు మచిలీపట్నం డా. పట్ట్భా కళాపీఠం నుండి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంగీత విద్వాంసులుగా పురస్కారం, ప్రశంసలు పొందారు.
పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా వారి ప్రశంసలు, ఆశీస్సులు పొందిన ఈ అన్నాచెల్లెళ్లు సంగీత కళారంగంలో విశిష్ట సేవా పతకాలుపొందారు. ప్రస్తుతం తాము విద్యార్థులకు సంగీతంపై అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్ననాటినుంచీ వీరికి సంగీతమంటే ప్రాణం. సంగీత కచ్చేరీలు నిర్వహించడం అన్నా అభిరుచి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉచిత సంగీత శిక్షణ అందిస్తూ అభినందనలు అందుకుంటున్నారు. సంగీత కచ్చేరీలు చేస్తూ ఎన్నో పురస్కారాలు, గాత్రంపై పట్టు సాధించడం నిజంగా ప్రశంసనీయం.
వీరికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సాహం కల్పిస్తే మరింత ప్రయోజనం కాగలదని ఆశిద్దాం.. ఈ అన్నాచెలెళ్ళు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం..

- ఎల్. ప్రపుల్లచంద్ర