సబ్ ఫీచర్

మనకోసమే మనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనందరిలోనూ అంతర్లీనమై వున్న ఓ పెద్ద నమ్మకం, మనం మాట్లాడే మాట, ఒకరికి చెప్పే మాట, మన ఆలోచనా విధానం ఎంతో సబబు అయింది. ఇతరులు మన మాట విని మనలాగా ఆలోచిస్తే బాగుంటుంది అని.
ఇది ఒక ఆలోచన, ఒక భావం వరకూ అయితే ఫర్వాలేదు కానీ, ఇంకొకరిమీద రుద్దటం, వారిని ఇలా చేయి అని నిర్దేశించటం, ఇంకా శ్రుతిమించితే కట్టడి చేసి, వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా, మన మాట వినేటట్లు, దాని ప్రకారం ప్రవర్తించేటట్లు చేయడం అన్నది, మన తప్పేమో అని ఆలోచించగలిగితే, మానవత్వంవైపు మనం అడుగులు వేస్తున్నట్లు కదూ!
ఆత్మావలోకనం చేసుకుంటే మనపైన ఇంకొకరు అథారిటీ చేస్తుంటే, మన మనస్సుకు నచ్చుతుందా, నచ్చదుగాక నచ్చదు, అది ఒప్పుమాట అయినా, తప్పుమాట అయినా.
ఒక వయసు వచ్చిన పిల్లలకే మనం మార్గం సూచించి, సాధక బాధకాలు వివరించి, వారి మార్గం వారు ఎంచుకునే స్వాతంత్రం వారికి ఇవ్వటం శ్రేయస్కరం కదా. పూర్తిగా స్వేచ్ఛనివ్వని పెంపుడు కుక్క అయినా క్రూరత్వం నేర్చుకుంటుంది, ఎదురుతిరుగుతుంది కదా! అదీకాకపోతే ఏడ్చి రాగాలు పెడుతుంది. జంతువులే స్వేచ్ఛ కోరుతున్నప్పుడు, మేధ మనసు వున్న మనుషులు ఎంత కకావికలం అవుతారో ఆలోచించండి.
చిన్నప్పుడు నిప్పు ముట్టుకోబోయిన పిల్లవాడిని ఒక దెబ్బ వేయవచ్చు, భయపెట్టడానికి, ఇంకోసారి ఆ పని చేయకుండా ఉండడానికి. అదేపని పదేళ్లు వచ్చిన పిల్లవాడితో చేస్తామా, చేస్తే మంచిదా, లేక ఇంకోరకంగా ప్రవర్తిస్తామా అన్నది మనకు తెలుసు.
మనం కన్న మన పిల్లలపట్లే, వారు వయసు పెరిగినకొద్దీ, వారిపట్ల మన ప్రవర్తన మారవలసిన అవసరం ఉన్నప్పుడు, మనను కని పెంచిన తల్లిదండ్రులపట్లగానీ, మన తోటివారిమీద గానీ మనం కొంచెం సంయమనంతో అర్థం చేసుకుంటూ ప్రవర్తించటం ఉచితం అయిన ప్రవర్తన కదా.
నా ఆలోచనలో అయితే, భర్తకే హక్కు ఉండదు భార్యను ఫలానా వారితో మాట్లాడవద్దు, ఫలానావారింటికి పోవద్దు అని నిర్దేశించటానికి. మనకు ఇష్టం ఉండదు అని చెప్పటం వేరు, చేయద్దు అనటం వేరు. ఆ భార్యకు, మనం వద్దన్నవారితో మాట్లాడటం అన్నది మనస్సుకు నచ్చిన మాట అయితే, మనసు కాదని, మన మాటను పక్కకుబెట్టి, మనం లేనప్పుడు మాట్లాడుతుంది. కొందరు, నా ఇష్టం, నేను మాట్లాడతాను అని కూడా మొరాయించవచ్చు. ఫలితం?
భార్యాభర్తల మధ్య జగడం, ద్వేషం, కొట్లాట, వాగ్యుద్ధం, చివరకు ఈ చిన్న విషయంమీద సంబంధ బాంధవ్యలు కూడా బెడిసిపోవచ్చు కదా. అటువంటప్పుడు, తల్లిదండ్రులతో పిల్లలు ఇటువంటి నిబంధనలు ఏర్పరిస్తే తప్పు కదా, ఇది.
చిన్నప్పుడు చీరకొంగు పట్టుకు తిరిగి, నేడు ఈ చీర కట్టు, ఆ చీర వద్దు అని చెప్పటం హాస్యాస్పదమే కాదు, సిగ్గులేని బుద్ధి వికసించనితనం. అట్లాగే ఆ ఒడిలో పరుండి, ఆడి, మలమూత్రాలు విసర్జించి, నేడు నీవు ఆ పని చెయ్యి, ఈ పని చేయవద్దు, ఇక్కడ ఉండు, అక్కడ ఉండవద్దు అనటం- మనం మన విజ్ఞతను పెంచుకుంటున్నా లేక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామా అన్నది మనం మనకై ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది రేపు మన పిల్లలే మనతో ఇలా ఉంటే?
బాగ్‌బన్ సినిమా చూసి ఎంతోమంది ఆ కొడుకులపట్ల ఏహ్యతాభావం కలిగించుకున్నాం. కానీ మన సంగతి వచ్చేటప్పటికి మన ప్రవర్తన, ఆలోచన సరిఅయినవే అనుకుంటాం.
నిజంగా మనస్సుమీద చేయి వేసుకొని ఆలోచించి నిజం ఒప్పుకోవాలి. ఇవాళ్టిరోజున, మనం ఎంతమందిని, మనను కన్నవారి పట్ల సానుభూతితో ఆలోచించి, ఉచితంగా ప్రవర్తిస్తున్నాం. వృద్ధుల అలవాట్లను, ఆలోచనలను భరించి అర్థం చేసుకోగలుగుతున్నాం. వారు గట్టిగా దగ్గుతే మనకి చికాకు. వారు కొన్ని విషయాలలో జోక్యం కలిగించుకోకూడదు. పెట్టింది తిని అలా వారికి కేటాయించిన జాగాలో ఉండాలి అంతే.. కట్టేసిన పెంపుడు కుక్కలాగే.
అదీనూ, మనం వారిని మనతో ఉంచుకుంటేనే సుమా. ఏదో అనాధ శరణాలయంలో ఉంచక, లేక నీ గతి నీది అంటూ వీధిలోకి గెంటివేయకపోతే. ఇటువంటి పిల్లల్ని మనం అసహ్యించుకుంటాము- ఎంత పనికిరానివారో వీరు అని. కానీ ఇక్కడ వీధి కుక్కలకు స్వేచ్ఛ అయినా ఉంటుంది. అదే ఇంట్లో ఉండి స్వేచ్ఛ లేకపోత ఇంకా కష్టం కదూ.
ఇక్కడో ఇంకో విషయం గమనించాలి. ఇవాళ్టి వృద్ధులు ఒకనాడు వయసులో వున్నవారే. కుటుంబ బాధ్యతలను పాటించినవారే. మరి వారికి స్వతహాగా కొన్ని అభిరుచులు, అలవాట్లు, ఆలోచనలు అబ్బి ఉంటాయి గదా, మనకు అబ్బినట్లుగానే.
మరి అలాంటప్పుడు, ఈ చివరి రోజులలో వారికి అవసరం అయితే ఆర్థికంగా సహాయపడి, మీకు ఎలా సుఖంగా ఉంటే అలా ఉండండి అనటం మానవత్వం వున్న మాట కదూ.
కానీ, వృద్ధ దంపతులను పంచుకుని మాత్రం విడదీయకండి. పశుత్వపు చర్య ఇది. వారిని మీరు చూసుకోలేకపోతే, ఇద్దరినీ కలిపి వెళ్లగొట్టండి. కలిసి ముష్టి ఎత్తుకుని బతుకుతారు. ఇంట్లో పనిమనిషి కావాలని తల్లిని ఉంచుకుని, తండ్రిని వీధిపాలు చెయ్యండి.
ఇంకా చాలా ఉంది, ఉంటూనే ఉంటుంది, మనకోసం మనం మాట్లాడుకోవడానికి, మనని మనం దిద్దుకోవటానికి.

- నండూరి రామచంద్రరావు 9949188444