సబ్ ఫీచర్

వ్యతిరేకులకు సింహస్వప్నం తారేఖ్ పతాహ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారేఖ్ పతాహ్ సింథ్‌లో పుట్టారు, పాకిస్తాన్‌లో చదువుకున్నారు, కెనడా పౌరసత్వం స్వీకరించి అక్కడే వుంటున్నారు. తరచూ దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి వివిధ టి.వి. కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు అద్భుతంగా ఉంటాయి. ఎంతో తార్కికంగా, హేతుబద్ధంగా, విజ్ఞానదాయకంగా ప్రసంగాలు చేస్తారు. గొప్ప రచయిత, టెలివిజన్ వ్యాఖ్యతగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. తాను సింథ్‌లో పుట్టాను కాబట్టి తననుతాను హిందువుగా, భారతీయ పౌరుడిగా భావిస్తారు. సాంకేతికంగా ఆయన భారత పౌరుడు కాదు. కానీ భారతదేశాన్ని భారతీయులకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు.. ప్రశంసిస్తాడు.. గౌరవిస్తాడు.
హిమాలయాలు- హిందు మహాసముద్రం మధ్యగల భూభాగంలో వేల ఏళ్ళ క్రితమే ‘సింధూ’ నాగరికత పరిఢవిల్లిందని, ఇక్కడి ప్రజలందరూ భారతీయులని (హిందువులని) ఆయన బలంగా నమ్ముతారు. ఎవరైనా కాదంటే చరిత్రను తవ్వితీసి కళ్ళముందు పరుస్తాడు. విభేదించడానికి వీసమంత సందు ఇవ్వడు.
గత పదిహేను-పదహారు వందల సంవత్సరాల భారత ఉపఖండం చరిత్ర ఆయన నాలిక చివరన.. వేలి కొసలపై తాండవమాడుతుంది. అద్భుతమైన వాదనా పటిమతో పదిమందిని ఆకట్టుకుంటారు. గత పదహారువందల ఏళ్లుగా భారతదేశంపై ‘‘ఇస్లాం దాడి’’ని, ఖలీఫా ఉద్యమాన్ని, నరహంతకుల దుర్నీతిని ఆయన ఎండగట్టినట్టుగా మరొకరు విమర్శంచలేరనిపిస్తుంది. జంకుగొంకులేకుండా తన వాదనను బలంగా ప్రజలముందుకు పెడతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఔరంగజేబ్ మార్గ్ పేరును మార్చేందుకు ఆయన అహరహం శ్రమించారు. ఓ రకంగా ఇందుకోసం ఉద్యమమే చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆ పేరు తొలగించి డాక్టర్ అబ్దుల్ కలామ్ మార్గ్‌గా మార్చింది. ఇది ఆయన సాధించిన విజయమే.
ఔరంగజేబు నరరూప రాక్షసుడని, సోదరుడిని, కొడుకుని, తండ్రిని చంపి అధికార మదంతో తైతక్కలాడాడని, భారతీయులను ఊచకోత కోశాడని, అనేక దేవాలయాలను ధ్వంసంచేశాడని, అతని సైన్యం హిందూ మహిళలను చెరబట్టారని ఘాటుగా విమర్శిస్తారాయన. ఆ వివరాలు, గణాంకాలు, తారీఖులు గుర్తుచేస్తూ అలాంటి దుర్మార్గుడి పేరున దశాబ్దాలపాటు భారత రాజధానిలో ఓ మార్గానికి పేరు కొనసాగించడం దారుణాతి దారుణమని, అలా కొనసాగించడం బానిసభావానికి నిదర్శనమని ఆయన అంటారు. రాజధానిలో ఇంకా చాలా పేర్లు మార్చాల్సి ఉందని, అందులో ‘లోడీ గార్డెన్స్’ ఒకటని ఆయన తరచూ అంటుంటారు.
ఇలా నిష్కర్షగా మాట్లాడే తారేఖ్‌పతాహ్ ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని వివిధ టి.వి. ఛానళ్ళతో, యూ-ట్యూబ్ ఛానళ్ళతో ముచ్చటించారు. తన మనసులోని భావాలు పంచుకున్నారు. భారతదేశంలోని వివిధ పరిణామాలపై వేసిన అనేక ప్రశ్నలకు ఆయన తనదైన రీతిలో నిర్మొహమాటంగా, పదునైన పదజాలంతో సమాధానాలిచ్చారు. ఎంతటి వివాదాస్పద అంశమైనా నీళ్లు నమలకుండా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. తన సహజసిద్ధ నైజాన్ని మరోసారి చాటుకున్నారు.
పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ)పై రాజధానిలో జరుగుతున్న ప్రదర్శనలు, ఆందోళనలు, విష పూరిత ప్రకటనలపై సైతం ఆయన తన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రకటించారు. అవి వివాదాస్పదమవుతాయన్న వెరపు ఏ కోశాన కనిపించకుండా నిర్భయంగా చెప్పారు.
1947లో దేశ విభజన సమయం నాటి పరిస్థితుల్ని పాకిస్తాన్ అనుకూలురు, ముల్లాలు భారతదేశంలో పునరావృత్తం చేస్తున్నారని, అందుకే ఢిల్లీలోని షాహిన్‌బాగ్ ఆందోళనలో ‘‘లా హిల్లల్లా... తేరా మేరా రిస్తాక్యా... లాహిల్లల్లా’’అన్న నినాదాలు వినిపిస్తున్నాయని, ఇవి జిన్నా కాలంనాటి నినాదాలని, వాటిని సజీవంగా నిలిపి ఉంచేందుకు, దేశాన్ని మరోసారి విడగొట్టేందుకు షార్జిల్ ఇమామ్ లాంటివాళ్ళు రెచ్చగొట్టే, ఈశాన్య రాష్ట్రాలను భారత్‌నుంచి విడగొట్టే నినాదాలు ఇస్తున్నారని గుర్తుచేశారు.
మహిళలను, పసివాళ్ళను అడ్డుపెట్టుకుని సీఏఏ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారని, ఆ శిబిరంలోకి వేరే వారెవరెళ్లినా దాడిచేస్తూ తమ వికృత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఏ ఉద్యమంలోనైనా పిల్లల్ని ఉపయోగించుకోవడం నేరం.. బాలల హక్కులకు విరుద్ధం, అంతర్జాతీయ చట్టాలు ఈ విషయం చెబుతున్నా లెక్కచేయకుండా షాహీన్‌బాగ్ తదితరచోట్ల పిల్లలచేత జాతి వ్యతిరేక, మోదీ వ్యతిరేక నినాదాలు ఇప్పిస్తూ తమాషా చేస్తున్నారని, ఇది పూర్తిగా అనాగరికమని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
సీఏఏలో ఏమున్నదో చదవకుండా, తెలుసుకోకుండా విశ్వవిద్యాలయ విద్యార్థులు సైతం అజ్ఞానంతో, మూర్ఖంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారని, తొలిరోజుల్లో హింసకు తెగబడి అనేక బస్సులను- వాహనాలను ఇళ్ళను, దుకాణాలను ధ్వంసం చేశారని దుయ్యబట్టారు.
భారతదేశంలో ముస్లింలకే ఎక్కువ హక్కులు లభిస్తున్నాయంటున్నారాయన. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి ప్రభుత్వ నిధులు భారీగా అందుతున్నాయి. అందులో ‘‘జిన్నా’’ ఫొటో ప్రముఖంగా దర్శనమివ్వడమేగాక ఆ విశ్వవిద్యాలయం ‘లోగో’లో ‘‘అల్లాహో అక్బర్’’ అన్న ఇస్లాం నినాదం ఉర్దూలో కనిపిస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉదారంగా వ్యవహరిస్తోంది. ‘‘షరియత్’’ బూచి చూపి అనేక పద్ధతుల్లో ముస్లింలు లబ్ధిపొందుతున్నారని, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లో ఇలాంటి చేష్టలు ఏమాత్రం సహించరని, భారతదేశంలో ఈ రకమైన ‘సంతుష్టీకరణ’ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఒక్క భారతదేశంలోనే ముస్లిం మహిళలు ఓటువేయగలుగుతున్నారని గుర్తుచేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో హింస చెలరేగడాన్ని పరిశీలిస్తే దీనివెనక వౌల్వీల ప్రోత్సాహం, ముస్లిం మత పెద్దల మద్దతు దండిగా కనిపిస్తున్నదని ఆయన విశే్లషించారు.
సీఏఏలో భారత ముస్లిం-హిందూ పౌరుల గూర్చిన ప్రస్తావన లేదు... అయినా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ఆందోళనలు నగరాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో కనిపించవని, అక్కడా ముస్లింలు ఉన్నప్పటికీ వారు దీనిపై ఆసక్తి చూపడంలేదని, ఈ వ్యత్యాసాన్ని గమనిస్తే ఆ ఉద్యమ స్వరూపం తెలుస్తుందని ఆయన అన్నారు.
గజ్‌వాహింద్ (హిందూస్తాన్‌ను ఇస్లాం దేశంగా మార్చడం), జిహాద్ ఉద్యమంలో భాగంగా వ్యూహంమార్చి ఈ రకమైన ఆందోళనలను కరడుగట్టిన మతతత్వవాదులు ముందుకెళుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఇప్పటికే కశ్మీర్, కేరళ, కొంతమేర పశ్చిమ బంగ్లాలో ముస్లిం మతతత్వ శక్తులు బలపడి భారతదేశాన్ని బలహీనపరిచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయని ఆయన అనేక ఉదాహరణలిచ్చారు.
1947లో భారతదేశ ‘‘రెండు భుజాలను నరికేసిన’’వారు, వారి వారసులు ఇప్పుడు పాక్, బంగ్లాలో ఉన్నారు, సిఏఏను వ్యతిరేకిస్తువారు వారినీ ఆహ్వానించాలని కోరుకోవడం దుర్మార్గమని, ఇది మరో దేశవిభజన కుట్ర అని ఆయన మండిపడ్డారు.
శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన మాదిరి ఫలితం ఆశించకుండా ‘‘కర్మ’’ (పని)చేయడం ముఖ్యమని, విజ్ఞతతో విషప్రచారాన్ని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఓ ముస్లిం మేధావి నోట ఇంత అద్భుత విశే్లషణ, వింగడింపు, దేశభక్తి, పురోగమన శక్తిని ఊహించగలమా?

- వుప్పల నరసింహం, 9985781799