సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనన్య భక్తి
అనన్యభక్తి శరణాగతి వల్ల వస్తుంది. అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణం మమ నాకు వేరే ఎవ్వరూ దిక్కు లేరు. నీవే నాకు శఱణు అని అనటం అనన్య భక్తి అనుకుంటాము.
నీవే తల్లివి తండ్రివి
నీవే నాతో నీడ నీవే సఖుడౌ..
అనీ ఓ దేవదేవా! నీవేనా రక్షకుడవు. అనగానే మనం శరణాగతులమైనట్లే నా? మన అనన్య భక్తి పాటిస్తున్నట్లేనా? మనం ఎపుడు అంతర్ముఖులం అయి చిత్త శుద్ధితో సత్యానే్వషణ సాగిస్తుంటామో అపుడే మనకు నిజమైన అనన్య భక్తి కలిగినట్లు.
తప్పు దారి వద్దు
మీరు మీ మీ వ్యాపకాలలో వుండండి. మీ ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దు. మీరేం చెబుతున్నారో దానికి విరుద్ధంగా నడవటం తప్పు. అంతకన్నా పిరికితనం లేదు. అది నైతికంగా ఆత్మహత్యా సదృశం.
బాబాగారికి అంతా తెలుసు అంటూనే వుంటావు. కాని బాబా యిక్కడ లేడు కదా అని తప్పులుచేస్తూ వుంటావు. కాళీమాత అని విశ్వసించి, విగ్రహాన్ని ఆరాధిస్తున్నావు. ఆ విగ్రహం చాటునే ఏదోవొకటి దాచి పెడతావు. ఎవరికీ తెలియదని అనుకుంటుంటావు.
తుల
నన్నడిగితే గీత త్రాసు వంటింది.
అది ఎలానో చూడండి. రెండవ అధ్యాయం సాంఖ్య యోగం
అందులో ఏడవ శ్లోకం...
కార్పణ్యదోషాపహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
యుచ్ఛ్రేయస్వ్యాని శ్చితం బ్రూహి తనే్మ
శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రసన్నం.
కృపణత్వం (ఆత్మ జ్ఞానమందు దారిద్య్రం) అనే దోషంచే దెబ్బతిన్న నేను ధర్మ విషయమై సందేహం కలిగి నిన్నడుగుతున్నాను. నిన్ను శరణంబొందిన నాకు ఏరి మంచిదో దానిని చెప్పు శాసించు. ఈ శ్లోకం ఎడమ వైపు ఉండే సిబ్బె వంటిది.
తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగం అందులో 22 వ శ్లోకం
అనన్యా శ్చింతయంతో మాం
యే జనాః పర్యుపాసతే
తేః నిత్యాభియుక్తానాం
యోగ క్షేమం వసామ్యహం
‘ఇతర చింతలను వదిలి ననే్న ఎడతెగక ధ్యానం చేసేవారి యోగ క్షేమాలను నేను చూసుకొంటాను.ఈ శ్లోకం త్రాసు దండానికి పైన ఉండే కొక్కెం వంటిది.
ఈశ్లోకం గీతకు మధ్య బిందువు వంటిది. ఇక మోక్షసన్యాస యోగం గీతలో చివరి అధ్యాయం. పద్దెనిమిదవది. అందులో అరవై ఆరవ శ్లోకం.
సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ
అహంత్వా సర్వపాపేభ్యో
మోక్ష యిష్యామి మాశుచః
సర్వ ధర్మాలను విడిచిపెట్టు. ననే్న శరణం బొందు. నిన్ను సమస్త పాపాల నుండి విముక్తి చేస్తాను. మోక్షం అనుగ్రహిస్తాను. విచారించకు. ఈశ్లోకాన్ని చరమ శ్లోకం అంటారు. శరణాగతిని ఇది సూచిస్తుంది.
ఈ విధంగా కార్పణ్య దోషంతో బాధపడే సంశయాత్మునికి శరణాగతియే శరణ్యం అన్న సమాధానం లభించింది. ఇతర చింతలు లేని స్థిర చిత్తం. త్రాసును మధ్యన ఎత్తి పట్టి సమంగా నిలుపుతోంది. ఇంకొక విధంగా చూస్తే అధర్మం ఎడమ సిబ్బె అయితే ధర్మం కుడి సిబ్బె.మధ్యలో కృష్ణ్భగవానుడు.
మనసు మకిల
నారదుడు తలచుకొన్నప్పుడల్లా నారాయణుని సాన్నిధ్యంలోకి పోగలిగే వాడే, అయినా భగవంతుణ్ణి అర్థం చేసికోడం అతని తరం కాలేదు.
బలరాముడు కృష్ణునికి స్వయంగా అనే్న. అయినా తమ్ముని గుట్టు అన్నకు అంతుబట్టలేదు. అలాటిది నీబోటి వాడికి స్వామితత్వం ఏం తెలుస్తుంది? నీటుగా యిస్ర్తిచేసిన బుష్‌కోట్లు వేసికొని తిరగటం వేరు. సత్యాన్ని దర్శించటం వేరు.
చిల్లర మనుషులను నమ్ముకొన్న వాళ్లెవరో నాకు తెలుసు! నా జుట్టు గురించీ, నా డ్రెస్ గురించీ వాళ్లుచేసే వ్యాఖ్యానాలు నేనెరుగనివి కావు. అయితే అవేవీ నాకు పట్టవు. నే కోరేది ఒకటే రండి! చేతనయితే సర్వస్య శరణాగతులు కండి! మీ మిత్రులకూ భక్తులకూ వంచన నేర్పకండి! పైకి ఇస్ర్తి బట్టలేసుకొని, ఠీకుఠాకున తిరగ్గానే సరిపోతుందా? లోపల మనసుకున్న మకిల ఎలా వదుల్తుంది?

ఇంకా ఉంది