సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపత్తి అంటే
భగవంతుని ద్వారం ముందు అంతా భిక్షకులమే. అయినా నిజమైన భక్తులు భగవంతుని ఏమీ యాచించరు. కారణం తనకేదీ అవసరమో ఏది ఇవ్వాలో తనకన్నా ఆయనకే బాగా తెలుసునని వారి భావం. ఆయన సంకల్పం ప్రకారం అన్నీ జరుగుతాయి. ఈ భావనకు దృఢంగా నమ్మి, ఈశ్వరునిపై భారం వేయటమే శరణాగతి.
ఇదే నాప్రతిజ్ఞ
ప్రజానీకానికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపి అనంతుని వైపు నడిపించటమే ఈ అవతార ప్రయోజనం. ధర్మాన్ని పునః ప్రతిష్టించటమే నా లక్ష్యం.
ననే్న నమ్మి అనన్య గతికులై నా మాట పాటించే నా భక్తుల నెన్నడు విడువను. ఇదే నా ప్రతిజ్ఞ.
శరణన్న పావురానికై తన కండలు కోసిచ్చిన శిబి చక్రవర్తిని నేటికీ ప్రజ మరువలేదే? శిబియే శరణన్న పక్షిని విడువనప్పుడు భగవాన్ భక్తులను విడిచిపెడతాడా?
ఆర్షవచనం
భారతీయ ఆర్ష సంస్కృతికి అద్దం పట్టే ప్రవచనాలను చూడండి. ‘ఈశ్వరస్సర్వభూతానాం’ ఈశ్వరుడే అన్ని ప్రాణులలోను ఉన్నాడు. ‘ఈశావాస్యమిదం సర్వం’ అంతా ఈశ్వరుని మయం. ‘వాసుస్సర్వమిదం’ అంతా వాసుదేవుడే.
భగవంతుడు ఒక్కడే. ఆయన అంతటా ఉన్నాడు. మతం ఒక్కటే ప్రేమ మతం. కులం ఒక్కటే. మానవకులం. భాష ఒక్కటే. అది హృదయ భాష. ఇదే నీవు గ్రహించాల్సిన సత్యం.
ప్రేమతో నీ చూపును పునీతం చేసుకొంటే గానీ ఈ సత్యాన్ని దర్శించలేవు. ప్రేమ ప్రతి వ్యక్తిలోను భగవంతుని దర్శించేందుకు దోహదం చేస్తుంది. జగత్తు మిథ్యా? కాదు జగత్తు మాయా కాదు జగత్తు దేవుని లీల. ఆయన సంకల్ప మాత్రం చేత ఈ సృష్టి అంతా సంభవించింది. ధర్మమూలంరూపొందిన అద్భుతం. గూఢంగా గాఢంగా విలసిల్లే శక్తి సంజనితం సృష్టి.
అవతరణ
యుగధర్మం గాడి తప్పితే ప్రేమ మార్గం ద్వారా దానిని తిరిగి దారిలో పెట్టాలి. ఘర్షణ గందర గోళాలతో ప్రపంచం కలుషితం అయితే శాంతిసన్మార్గాలకు పునః స్థాపించాలి. జనం పవిత్రమైన వేదాలను, శాస్త్రాలను సరిగా అర్థం చేసుకొని అనుసరించలేని పరిస్థితులలో మానవాళికి వాటి సందేశాన్ని చాటి చెప్పాలి. భూమిపై పాప భారం పెరిగి పోతుంటే తగ్గించి రక్షిస్తానని భగవానులు వాగ్ధానం చేశారు. గుర్తులేదా?
యదాయదాహి ధర్మస్య
గ్లానిర్భవతి భారతః
అభ్యుత్థాన మధర్మస్య
తదాత్మానం సృజామ్యహం
ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో , ఎప్పుడెప్పుడు అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడల్లా నన్ను నేను సృజించుకుంటూ ఉంటాను. (నేను అవతరిస్తూ ఉంటాను) ఇదీ భగవానులు ఇచ్చిన వాగ్దానం. దీనిని నెరవేర్చుకోవడానికి అచ్యుతుడు భూమిపై అవతరించాడు. వాసుదేవుడు అవని పైకి ఏతెంచాడు.
ప్రేమావతారం
గత యుగాలలో అవతారాలు వచ్చాయి. అప్పుడు కొద్దిమంది దుర్మార్గులు ఉంటే వారిని సంహరించి శిష్టరక్షణ చేశారు. కానీ ఇప్పుడు పాపం పెరిగిపోయింది. ఇప్పుడు కలియుగంలో అసురులు కానీ దుర్మార్గులు కానీ అసంఖ్యాకంగా ఉన్నారు. అందరిలోనూ ఏదో కొంత చెడు కన్పిస్తోంది. కనుక ఇపుడు కావలసింది సంహారం కాదు.. సంస్కరణ . వారిని సంస్కరించి సరియైన దారిలో పెట్టవలసిన అవసరం ఉంది. అంతా మాధవుని చేరి ఆయనలో కలిసి పోవాల్సిన వారే. కానీ చాలామంది తాము వేళ్లవలసిన దారిని మరిచిపోయారు. తప్పిపోయిన పిల్లలావారు అటూ ఇటూ తిరుగుతూ తమ అమూల్య కాలాన్ని వ్యర్థం చేసుకొంటున్నారు. వారికి దారి చూపటానికి ఈ ప్రేమావతారం వచ్చింది. ప్రేమే నా సాధనం. ప్రేమ ఎరుగని జీవి ఉందా. ఎంత హీనమైన దైనా కనీసం తన్ను తానైనా ప్రేమించుకుంటుంది కదా.
కరుణావతారం
శంకరాచార్యుల వారు ధర్మ సంస్థాపనకై వచ్చారు. తనను వ్యతిరేకించే వారిపై దండెత్తలేదు. వారిని వాదంలో ఓడించారు. నచ్చచెప్పి బోధించి వారిని తన వైపుకు తిప్పుకున్నారు. ఆయన మృదువుగా మాట్లాడినా, గట్టి నమ్మకంతో మాట్లాడారు. తమ వాదం చెప్పేందుకు అతలి వారికి అవకాశం ఇచ్చేవారు. ఒక్కోసారి అవతలి వారి వాదాన్ని ఆయనే వివరించి చెప్పేవారు. ఆధునిక యుగంలో బోధ ద్వారానే ధర్మాన్ని రక్షించగలుగుతాము. అందుకే నేను బోధలో మునిగి ఉన్నాను. ఉపదేశం ద్వారా పునర్నిర్మాణానికి పూనుకున్నాను.
మనుష్యులు అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులై నానా ఇబ్బందులూ పడుతున్నారు. వారిని ఉద్ధరించటానికే నేను అవతరించాను.
ఇంకా ఉంది