సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సేవా దృక్పథమే ప్రార్థన’’ అని మీకు తెలియ చెప్పాలని సాయి ప్రయత్నం. ప్రేమ సేవగానే వెల్లడౌతుంది. ప్రేమ సేవలోనే వర్థిల్లుతుంది. సేవ కడుపులో ఊపిరి పోసుకుంటుంది ప్రేమ. దైవమే ప్రేమ.
ఈ అవతార మూర్తి శిశువులలో శిశువు. బాలల్లో బాలుడు. పురుషుల్లో పురుషుడు. మహిళలల్లో మహిళ ప్రతి హృదయానికి సాయి సందేశం చేరాలి. ఆనందంతో పొంగి పొర్లాలి. అందుకే ఈ అవతారంలో చేసే ప్రతికార్యం కరుణారస భరితం. ప్రేమ రస పూరితం.
బాబా
ఏసు క్రీస్తు తన శిష్యులకు దివ్య సందేశాన్నిస్తూ ఒక గొర్రె పిల్లను చూపాడు. ఆయన సందేశం ఇది మీ వద్దకు నన్ను పంపిన దైవం. మళ్లీ అవతరిస్తడు గొర్రె పిల్ల ఒక చిహ్నం. అది బా బా అంటుంది. అది ఏం చెబుతుంది.? బాబా రాబోతున్నాడని.
ఆయన రక్త వర్ణం దుస్తులు ధరిస్తారు. ఆయన కురచగా ఉంటారు. తలపైన కిరీటం ఉంటుంది. గొర్రె పిల్ల సాధుజంతువు. అది ప్రేమకు ప్రతీక.
ఏసు తాను తిరిగి వస్తాననలేదు. నన్ను పంపినవాడు అవతరిస్తాడన్నాడు. ఆయన పేర్కొన్న అవతారం బాబాయే. కిరీటం వంటి శిరోజాలతో ఎర్రని గౌను ధరించి భగవాన్ సాయిగా అవతరించాడు.
వస్త్రాపహరణం
వస్త్రాపహరణం అంటే ఏమిటి? ధర్మాన్ని అంటే ధరించిన దానిని లాగి వేయటం. అప్పుడు కృష్ణుని కృప వల్ల ద్రౌపది వొంటి పైన తీసిన కొద్దీ చీర వచ్చింది.
ప్రస్తుతం భారత మాత ధరించిన చీర అయిన సనాతన ధర్మాన్ని ఆమె దరిద్రగొట్టు సంతానమే ఎలాగో ఒకలాగా లాగి వేయాలని చూస్తున్నారు. అందుకే భగవాన్ ఆమెకు అభయం ఇవ్వటానికి ధైర్యం చెప్పటానికి అవతరించాడు. ఆమె అవమానింపబడిన దర్బారు హాలు ప్రతి ద్వారం నుండి ఆమె ఒడిలోకి ఎన్ని చీరలు వచ్చి పడుతున్నాయో చూడు. భారత సంస్కృతి ని సంప్రదాయాన్ని రక్షించటానికి వచ్చిన అవతార మూర్తి చే సే ఈ అద్భుతాన్ని తిలకించు.
నా వాణియే
నీ అంతర్వాణి
నేను వచ్చింది
ధర్మ
స్థాపన
కోసం. అందుకు నేను ప్రజలంతా తమ తమ జీవితాలలో ధర్మాన్ని పాటిస్తూ ఉండాలని నొక్కి వక్కాణిస్తూ ఉంటాను. ధర్మం అంటే ఏమిటి అది నీ అంతర్వాణి. అదే పరమాత్మ వాణి. తరతరాలుగా మహర్షులు ప్రబోధించిన ధర్మం అది. శతాబ్దాలుగా నీకు ముందు వచ్చి వెళ్లిన పెద్దల అనుభవాల సముదాయ ఫలితం ఇది. అది చరిత్రలో బోధించే పాఠం. తన ఆదేశాన్ని ఉల్లంఘించరాదని అది నిన్ను హెచ్చరిస్తున్నది.
ఏక సత్యం....
లోక సంక్షేమాన్ని కాపాడేవి ఏడు. అవి గోవు, బ్రాహ్మణుడు, వేదాలు, పాతివ్రత్య, సత్యం, నిస్సంగం, ధర్మం. ఇవన్నీ ఇప్పుడు క్షీణదశలో ఉన్నాయి. వాటిని తిరిగి పునీతం చేసి, సుప్రతిష్ఠితంగా చేయడానికే సాయి నేడు అవతరించారు.
బత్తుడు భక్తుడు
భగ్న హృదయాలనూ కలుషితమైన మనస్సులనూ బాగు చేయడానికి నేను వచ్చాను. కొట్టి సాగదీసి అతికి వాటిని బాగు చేసే బత్తుణ్ణి నేనే. భక్తుని పూజాగృహం బయట భక్తుని కోరికలు తీర్చటానికి వేచి ఉండే బంటుని నేను. భగవంతుడే భక్తునికి బంటు అయినపుడు భక్తుడే అసలు ప్రభువు.
క్రీడా మైదానం
కొంతమంది నేను కర్మ శేషం కొద్ది జనకునిలా జన్మించానని చెబుతున్నారు. గీతలో చెప్పినట్లు నాకే కర్మశేషమూ లేదు. మహాశక్తి మాయాశక్తి రూపంలో మానవాళి రక్షణ కోసం అవతరించింది. నాకే కోరికా లేదు. కనుక నన్ను బంధించే కర్మాలేదు.
నీకే కోరికలుంటున్నాయి. అవి నినే్నక దారుల వెంట లాక్కుని పోతుంటాయి. చింతకు మూలం ఏమిటి ? కోరికలే. కొరికలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయటంలో ప్రయాస అవి సఫలం కాకపోతే ఆశాభంగం. కోరికలన తగ్గించుకుంటే చింత తగ్గిపోతుంది. అందుకు చింతన ఒక దారి. మీరంతా ఇక్క డ ప్రశాంతి నిలయం వరండాలో గుమికూడుతారు. నాతో వ్యక్తిగతం గా ఇంటర్ వ్యూ కోంస తాపత్రయపడతారు. కడుపులో పుట్టెడు కోరికలతో వస్తారు. వాటినన్నిటినీ నన్ను తీర్చమంటారు. ఎందుకు అనవసరంగా ఆ భారం. ఒక్క కోరిక చాలదా. దేవుని అనుగ్రహం ప్రాప్తించాలి. అని నీకేది మంచిదో ఆయనకు తెలుసుకదా. అదే అనుగ్రహిస్తాడు. మిగతాది ఆయనకు వదిలేయి.
ఇంకా ఉంది