సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు- కొసరు
నా దగ్గరకు వచ్చేవాళ్లు తమ యిబ్బందులను గురించీ, రోగాలను గురించీ విన్నవించుకొంటుంటారు. వాళ్ల రోగాలను నయం చేయటం, యిబ్బందులను తొలగించటం-యిదేనా నా పని? కాదు నేను వచ్చిన పని అంతకన్నా ఎంతో ముఖ్యమైనది.
మామిడి చెట్టు వుంది. దానికి ఆకులూ, కొమ్మలూ, మొదలూ అన్నీ వున్నాయి. ఒక్కొక్కటి మనకు ఒక్కొక్క రకంగా వుపయోగపడుతుంది. మామిడి చెట్టు వుపయోగం అంతేనా? మామిడి పండ్లు ప్రధానం-యివి కాదు.
అరటి చెట్టువల్ల ఎన్ని వుపయోగాలున్నాయి? అరటి ఆకు వేసుకొని భోం చేస్తాం. అరటి పూవును, వూచను కూరచేస్తావు. కాని ఇవన్నీ కొసరు. అరటి పండ్లు అసలు.
అలాగే వేదశాస్త్రాలను భరత వర్షంలో పునఃప్రతిష్ఠచేయటం, వేద విజ్ఞానాన్ని తిరిగి వ్యాప్తిచేయటం నా ప్రధాన లక్ష్యం. భక్తుల బాధలను తొలగించటం అన్నది అనుషంగికం మాత్రమే.
ఈ రోజు ప్రపంచమంతటా సత్యసాయి కీర్తి మార్మ్రోగుతూ వుండటం మీరు చూస్తున్నారు. ఎప్పుడో భవిష్యత్తులోకాక ఈ శరీరం యిక్కడ వుండగానే, రుూ సంగతి మీకు కనిపిస్తూ వున్నది. కానీ, ఇదేదీ నాకు పట్టదు. సనాతనమైన ధర్మం, ప్రజలందరి సంక్షేమంకోసం వేదాలచే ప్రతిష్ఠితమైన ధర్మం, తన సహజ స్థాయిలో తిరిగి స్థాపించబడే రోజు తొందరలోనే వస్తున్నది. అదే నేను కోరేది. వేద ధర్మ పునఃస్థాపనమే సాయి సంకల్పం. నా విభూతులచే ప్రజలను ఆకర్షించటమేకాదు, నా సంకల్పంతో ధర్మాన్ని తిరిగి స్థాపించటం కూడా జరుగుతుంది. అసత్యాన్ని నిర్మూలించి, సత్యాన్ని ప్రతిష్ఠించటం, మిమ్మల్నందర్నీ ఆ విజయోత్సాహంతో పరవశింప చేయటమే సాయి సంకల్పం.
ఇదీ నా తత్వం
నేను ప్రేమ స్వరూపాన్ని అని మీరు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. ప్రేమద్వారా నేను ఇచ్చేది ఒకటే- ఆనందం! నా పనల్లా ఓదార్పునివ్వటం; ధైర్యం చెప్పటం; శాంతిని స్థాపించటం. అంటే ఏమిటి? నా తత్వం సనాతనం. అవతారం మాత్రమే నూతనం. వివరంగా చెప్పాలంటే నా కోరిక యిదే; నీవు దివ్యత్వంకోసం మరింతగా తపించాలి. ఆ కోరిక నెరవేరటానికి నేను ఈ రూపాన్ని ధరించి మీమధ్యకు రాక తప్పలేదు.
మనిషి శరీరంలో బందీగా వున్నంతకాలం అతని దేవుడు కూడా అలాటి శరీరంలోనే కనిపించాల్సి వుంటుంది. దేవునికి కళ్లూ, ముక్కూ, చెవులూ, నాలుకా మొదలయినవి వుంటాయో అని కొందరు చికాకు పడుతుంటారు. ఒక వ్యక్తికి యివన్నీ వున్నాయి. అతడు తన దేవుడిని కూడ తన రూపంలోనే భావించుకుంటాడు. కనుక కళ్లూ, ముక్కూ, చెవులూ మొదలైనవి అన్నీ అతనికీ దేవునికీ వున్నట్లే. అప్పుడే అతడికి తన పూజ అర్థవంతంగా కన్పిస్తుంది. అందుకే మొదట సాకారదైవానే్న పూజించాలి. నరుడు తన రూపాన్ని మరచినప్పుడే నిరాకారుని భజించ గల్గుతాడు. దేవునికి ఒక శరీరం వుంది అంటే నవ్వులాటగా మాట్లాడేవాళ్లు, తాము ఒక శరీరంలో యిరుక్కొని వున్నదానిపై నవ్వుకోక పోవటం చిత్రం!
మనిషిని చైతన్యవంతుడిని చేయటానికే ఆయన మనిషిగా అవతరించి, వారితో వారి భాషలోనే, వారి పద్ధతిలోనే మాట్లాడాల్సి వచ్చింది. వారనుసరించాల్సిన పద్ధతులను వారికి బోధించాల్సి వచ్చింది.
పక్షులకూ, జంతువులకూ అవతారాలతో పనిలేదు. ఎందుకని? వాటికి తమ తమ ధర్మాలను తప్పి సంచరించటంలో ఆసక్తిలేదు. తన ధర్మాన్ని మరిచి, గమ్యాన్ని మరచి సంచరించేది మనిషి వొక్కడే.
పక్షులనూ, జంతువులనూ, చెట్లనూ చూడండి! అవేవీ తమతమ సహజ స్వభావాలు వదలుకోలేదు. మనిషో! తానేదో వెలిగిస్తున్నానన్న భ్రమలో పడి తనను తానెంత దారుణంగా వికృతరూపిని చేసికొన్నాడో గమనించండి!
అందుకే మనుషులలో ఒక మనిషిగా భగవదవతారం సంభవించింది. ఆప్తుడుగా, మిత్రుడుగా, శ్రేయోభిలాషిగా, బంధువుగా, మార్గదర్శిగా, గురువుగా, వైద్యునిగా కలసి పనిచేసే సాటివానిగా భగవాన్ వ్యవహరిస్తున్నారు. ఆయన వచ్చింది ఎందుకు? ధర్మాన్ని ఉద్ధరించటానికి. ధర్మాన్ని నీవు పాటించు. ఆయన ఆనందిస్తాడు. తృప్తి పడతాడు.
తరింపచేసే తండ్రి
అవతారమూర్తి వచ్చినది ఎందుకు? మానవాళి రక్షకోసమే. అందుకే ఆయనకు తానెందుకు వచ్చిందీ, ఎటు వెళ్లాల్సిందీ, ఏం చేయాల్సిందీ, ఏ గమ్యాన్ని చేరుకోవాల్సిందీ తెలుసు. సృష్టికి నాథుడాయనే. ఆయన తన శక్తిని తాను బాగా ఎరుగు. ఆయనకు భూత భవిష్యద్వర్తమానాలు తెలుసు. తరణోపాయం చూపేదీ ఆయనే. తరింపచేసేదీ ఆయనే.
సచ్చిదానందమూర్తి
గజేంద్రుని రక్షించినదెవరు? కుచేలుని అనుగ్రహించినదెవరు? ప్రహ్లాదునికి దిక్కెవ్వరు? ధర్మానికి శ్రీరామరక్ష ఎవరు? ఆ శక్తే దిక్కులేనివారికి దిక్కుగా రుూనాడు భూమికి దిగివచ్చింది. శాంతి దైవంగా అవతరించింది. సామరస్యం, సచ్ఛీలాలకు వొరవడిదిద్దింది. అఖిల లోక నాయకుడు ఆయనే. సచ్చిదానందమూర్తి ఆయనే. మిమ్మల్ని అనుగ్రహించే అవతారమూర్తి ఆయనే!

ఇంకా ఉంది