సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవతార రహస్యం
కృష్ణుడు తన లీలల ద్వారా (తానవతార పురుషుడనే) సత్యాన్ని వెల్లడించాడు. మట్టి తింటున్నాడని విని తన తల్లి నోరు తెరచి చూపించమంటే, అందులో అండ పిండ బ్రహ్మాండాలను ఆమెకు చూపించాడు. ఆయనను కట్టివేసేందుకు ఆమె ఎంత పొడుగు తాడు తెచ్చినా, అది పొట్టే అయిపోయింది. అది ఆయన లీలే! పదునాలుగు భువనాలను తన కుక్షిలో నింపుకొన్న భగవానుడని అంతా చెప్పుకున్నారు.
తగిన సమయం చూసి తమ రాకను, మహిమను వెల్లడించేందుకు అవతార పురుషులు పూనుకోవడం సాధారణమే. ఈ అవతారంలోనూ అలాంటి అద్భుతాల ద్వారా ప్రజలకు తన అవతార రహస్యాన్ని వెల్లడించటమే సాయి చేస్తున్నారు.
అవతార లక్ష్యం
మానవులంతా ఒకటే కుటుంబం. అంతా సోదరులే. ఈ విషయం చెప్పి అందర్నీ కలపటానికే ఈ సాయి అవతరించాడు.
ప్రతివారిలోనూ వున్న ఆత్మ నిత్యం, సత్యం. అదే పరమాత్మ. అదే సమస్త విశ్వానికీ ఆధారం. మనిషికీ మనిషికీ గల ఈ దివ్య అనుబంధం, ఈ దివ్య వారసత్వాన్నీ చాటి చెప్పేందుకే ఈ సాయి అవతరించాడు.
మనిషిలోని పశుత్వాన్ని తొలగించి, అతనిని దైవత్వానికి తీసికొని వెళ్లటమే సాయి లక్ష్యం.
అవతార సమయం
భగవంతుడు భూమిపై అవతరించేటప్పుడు ఎప్పుడవతరించేది. ఎక్కడ, ఏ కుటుంబంలో జన్మించేది నిర్ణయించుకుంటాడు. తనతోపాటు తన అనుచరులెవరో కూడా ఆయనే నిర్ణయిస్తాడు.
రామావతారం వచ్చినప్పుడు శేషుడు, శంఖము, చక్రము కూడ ఆయనతోపాటు భూమిపై అవరించాయి. భగవంతునితోపాటు కలసిమెలసి సంచరిస్తూ, ఆయనను సేవించుకొనే భాగ్యంకోసం ఎంతోమంది దేవతలు దివినుండి భువికి దిగివచ్చారు.
అంతేకాదు. అవతరించేటప్పుడు ఆయన తనకు తగిన ఉపాధినే ఎన్నుకుంటాడు. అంట్లగినె్నలో అమృతం పోయరు. అపవిత్రమైన శరీరాలలో ఆయన జన్మించడు. దొంగ అవతారాలు మీకు తటస్థపడితే వారి వెంటపడి మోసపోకండి! వారి విషయంలో మీరు దృఢంగా వ్యవహరిస్తే, వారి రోగం కుదురుతుంది. వజ్రపు కాంతిని చూసిన వారెవరూ గాజుముక్క తళతళలకు మోసపోరు. భగవంతుడు వజ్రం వంటివాడు. ఏం చేసినా గాజుముక్క వజ్రం కాలేదు. ఎవరెంతగా నొక్కివక్కాణించినా గాజుముక్క గాజుముక్కే.
అవతార తత్వం
దైవత్వం మానవరూపంలో అవతరించింది. అయినా మనిషి మాయలోనుండి బయటపడలేకున్నాడు. భగవాన్‌ను భజించలేకున్నాడు. ‘‘నన్ను జనం సామాన్య మానవుని గానే పరిగణిస్తున్నారు గాని నాలోని దివ్యావతారాన్ని గ్రహించలేక పోతున్నారు’’అని శ్రీకృష్ణ భగవానులే సెలవిచ్చారు. తమలని ఆత్మశక్తిని జాగృతం చేసికోగలిగిన ఏ కొందరో తమముందున్న శక్తి స్వరూపుని గుర్తిస్తారు.
అవతారాన్ని గుర్తించు
భగవదవతారం వచ్చినపుడు ఆయనను గుర్తించటానికి నీకు భగవద్గీత సాయపడుతుంది. భగవంతుడు అవతారం ధరించి మానవరూపంలో వస్తే, జనానికి సామాన్యంగా నమ్మకం కుదరదు. నిజంగా ఆయన భగవదవతారమేనా అనడుగుతారు. భగవానుని దర్శించి ఆయన కృపను ప్రత్యక్షంగా పొందే మహదవకాశాన్ని ఎందరో సందేహాలవల్లనే పోగొట్టుకుంటున్నారు. ఏదయినా విచారణ చేయాల్సిందే! అయితే చెప్పుడు మాటలు వినటం విచారణ కాదు. నీ అనుభవమే నీకు నిజం చెప్పాలి. నీ దారి యేదో నీవే నిర్ణయించుకోవాలి.
దివ్యశక్తి
‘నేనెవరిని, ఎలాటి వాడిని’అన్న దానిపై నీ తల బద్దలుకొట్టుకొని లాభం లేదు. నేనేం చెబుతున్నానో, దానిని అర్థంచేసికో. ‘ఎవరు చెబుతున్నారు’అన్న దానికన్నా ‘ఏం చెబుతున్నారన్న’దే ప్రధానం. నేనెవరినో తెలిసికోగలగడం నీ శక్తియుక్తులకు అందని పని. నా పనినిబట్టే నన్నర్థం చేసికోవాల్సి వుంది. అందుకే ఒక్కొక్కసారి నేనెవరినో నీకు తెలియడంకోసం నేను నా ‘విజిటింగ్‌కార్డులు’చూపిస్తుంటాను. నా విభూతులే నా విజిటింగ్ కార్డులు. మీరు మిరకిల్స్ అంటుంటారే. అవే! అందుకే నీవు మర్మమెరిగి కర్మం చేయాలి.
ఈ అవతారం గురించి చెప్పటానికి యిదే మంచి తరుణం. సత్యమే చెపుతున్నాను. నా శోభను సహించగలవారు ఎందరో లేరు. నేను చేసే ప్రతి పనిలోనూ తొణికిసలాడే దైవత్వాన్ని గ్రహించగలిగేవారూ తక్కువే. దైవానుగ్రహ ఫలితంగా జరిగే అద్భుత సన్నివేశాలను అర్థంచేసికోగల వారేరీ? ఇవన్నీ ‘మేజిక్’అనేస్తారు. నా అద్భుత చర్యలను చులకన చేయాలని ప్రయత్నంచేస్తారు. వినండి! నాది గారడీకాదూ, ఇంద్రజాలమూ కాదు. కేవలం దివ్య శక్తి.
ఇంకా ఉంది