సబ్ ఫీచర్

నేను సైతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైలాసం నుంచి భగీరథుడు తెచ్చిన గంగమ్మను కాపాడుకుందాం అంటూ పదకొండేళ్ల చిన్నారి గంగా నదిని ఈదుతూ ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు కృషిచేసింది. కాన్పూర్ కంటోనె్మంట్ ఏరియాకు చెందిన శ్రద్ధాశుక్లా కాన్పూరు నుంచి వారణాసి వరకు 550 కిలోమీటర్ల మేరకు గంగా నదిని ఈదుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. రోజుకు ఎనిమిది గంటల పాటు ఈదుతూ.. కేవలం డ్రై ఫ్రూట్స్, పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ గమ్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నించింది. ఈ చిన్నారి తాత, తండ్రి గజ ఈతగాళ్లు. శ్రద్ధ కూడా ఈతను చిన్నప్పటి నుంచే అలవర్చుకుంది. తండ్రి స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకుంది. అతను నేర్పిన ఈతను ఇలా గంగ ప్రక్షాళనకు ఉపయోగిస్తోంది. ఆమె స్విమ్మింగ్‌ను వీడియో తీస్తున్నారు. ఆమె ఈదే సమయంలో భారీ వర్షాలు లేకపోవటం, గంగ ఉప్పొంగి ప్రవహించకపోవటం ఈ చిన్నారికి కలిసొచ్చింది. తండ్రి శిక్షణలో రాటుదేలిన శ్రద్ధాశుక్లా ఆరేళ్ల వయసులోనే 10 కి.మీ మేరకు గంగానదిని ఈదేసింది. ఎనిమేదేళ్ల వయసులో ఎనభై నిమిషాల్లో 16 కి.మీలో గంగానదిలో స్విమ్మింగ్ చేసింది. రాబోయే కాలంలో ఒలింపిక్ ఈత పోటీల్లో పాల్గొంటానని చెబుతూ తన జీవిత లక్ష్యం ఇంగ్లీష్ చానల్ ఈదటం అని పేర్కొంది.