సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవా!
‘మానవా!’అనే పదము అర్థం- ‘మ’అనగా కాదు, ‘నవ’అనగా క్రొత్త. క్రొత్తవాడవు కాదు నీవు. పాత వాడవే. నీకు నాకు అనేక జన్మల నుండి సంబంధం వుంటున్నది. కాని ‘క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి’ పుణ్యం ఖర్చయితే మానవ లోకంలో జన్మిస్తాడు. ఆ పవిత్రమైన కాలం దాటిపోయింది. దాని తరువాత పుణ్యకార్యాలు నీవు చేయలేకపోతున్నావు. అందువలన నీకు నాకు ఎడబాటు జరిగింది. ఎప్పుడు ప్రాప్తి చిక్కిందో, స్వామి సన్నిధి చిక్కింది. సన్నిధి చిక్కినప్పుడు దానిని మరింత ప్రాప్తిగా పోషించుకోవాలి. అప్పుడు నీవు అభివృద్ధిగాంచగలవు. కాని ఉన్న దానితో అనుభవించావు గాని మరల క్రొత్త దానిని సంపాదించుకోలేదు. అదే పొరపాటు తిరిగి చేయక ఎక్కువ ప్రాప్తిని సంపాదించుకోవాలి.
బింబ ప్రతిబింబాలు
బాబా ఎవరు? నేనెవరు? అని ఆలోచించుకో. దీనికి జవాబు ఏమిటి? బాబా ప్రతిబింబమే నీవు. బాబా అసలు రూపం. నీవు ప్రతిబింబానివి. అదే మన సంబంధం. అదే మన అనుబంధం. నీకు తెలిసినా, తెలియకపోయినా రూప ప్రతిరూపాలు ఒకటిగా నీకు కనిపించినా, కనిపించకపోయినా - ఇది యింతే.
నీవు రోజూ ధ్యానం చేస్తావు. శ్రవణం, కీర్తనం, పాదసేవనం, వందనం, దాస్యం, అర్చనం, సఖ్యత, ఆత్మనివేదనం అన్న భక్తిమార్గాలను అనుసరిస్తావు. ఇదంతా ఎందుకు? అస్పష్టమైన ప్రతిబింబంగా వున్న నీవు స్పష్టంగా శుద్ధంగావున్న ఆయన అసలు రూపంలో లీనం కావటం కోసమే.
సత్య దర్శనం
మీకు సత్యరూపం గురించి ఎంతో చెప్పాల్సి ఉంది. ఎందుకని?సత్యాన్ని గురించి మీరు మననం చేయాలని సాయి కోరిక. మననం చేయటం వల్మీలో పరివర్తన రావాల. పరివర్తన మీకు క్రమశిక్షణను నేర్పాలి. ఆత్మ విచారం దిశగా మిమ్మల్ని నడిపించాలి. మీరు ఆత్మ దర్శనం చేసి, గుండెల నిండా ప్రేమామృతాన్ని నింపుకోగలగాలి. మీ మనసు నిండా ఉన్న సాయి ఎవరో కాదు మీరేనన్న సత్యాన్ని ఆవిష్కరించుకోగలగాలి.
వచ్చిన దారినే వెళ్లు
చాలామంది భక్తులు స్వామి వద్దకు వచ్చి నాకేమైనా మార్గము చూపించమని కోరుకుంటారు. ఒరే పిచ్చివాడా! కొత్త మార్గములు నీకు అవసరంలేదు. వచ్చిన మార్గమునే నడచుకుని వెళ్లు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్లు. ఎందుకు కొత్తమార్గం. ఆత్మనుంచి వచ్చావు. తిరిగి ఆత్మను చేరుకోవడాకే ప్రయత్నించు.
ప్రారబ్ధం
పూర్వజన్మ సుకృతంవల్ల అవతారమూర్తి సాన్నిధ్యంలో కొంత సమయం గడిపే అవకాశం లభిస్తుంది. జన్మ అంటే ఏమిటి ? పూర్వ జన్మలో చేసికొన్న దానిని అనుభవించటం కోసమే మళ్లీ జన్మ ఎత్తుతారు. ప్రతివ్యక్తీ కొద్దో గొప్పో శిక్షాకలాన్ని ఈ లోకంలో జన్మించి పూర్తి చేసుకోవాల్సిందే. ప్రతిపాటుకూ దెబ్బ తగలక మానదు. ప్రతి దోషాన్ని సరి చేయవలసిందే. ప్రతి పాపం క్షఆళన జరగాల్సిందే. ప్రతి జీవి ఈ లోకంలో ఒక ఖైదీయే.
క్రమ శిక్షణ
ప్రశాంతి నిలయానికి రావటం ఒక మహదవకాశం. దానిని చక్కగా వినియోగించుకో. దీనిని చులకగా చూడకు. ఇక్కడ ఉండగా ఆషామాషీగా ప్రవర్తించకు శద్ధ్రాసక్తులతో నడుచుకో. ఎంతో విలువైన కాలాన్నీ, ధనాన్నీ వెచ్చించి, శ్రమకోర్చి ఇక్కడకు వచ్చావు. కానీ భగవాన్ పాద పద్మంపై వికసిత కుసుమంలగా ఉంటున్నావా? సాధన ఎలా చేయాలో నేర్చుకుంటున్నావా? ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తున్నావా క్రమశిక్షణతో మెలగుతున్నావా.. ఉదాహరణకు ఇక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలి. తప్పని సరిగా మాట్లాడాల్సి వస్తే నెమ్మదిగా మాట్లాడాలి. ఇక్కడకు వచ్చిన వారిని లంకించుకుని వారి చెవులో నీ గొడవలన్నీ నూరి పోయకు. వాళ్ల మాటలు వాళ్లకున్నాయి. నీ బరువెక్కడ మోస్తారు వాళ్లు.
చెరుకును స్వీకరించు
ప్రశాంతి నిలయంలో ఉండే వారికి కొన్న నియమాలూ, నిబంధనలూ ఉన్నాయి. వాటిని నిర్దేశించింది నేనే.
ఇక్కడకు వచ్చే వారంతా , ఇక్కడ ఉండేవారయినా, కొత్తగా వచ్చేవారయినా ఆనిబంధనలను పాటించాలి ఇక్కడకు వచ్చినందుకు ఫలితాన్ని పొందాలి. మీరు తిరిగి వెళ్లేటపుడు ఆ మార్పు మీలో కనిపిస్తున్నదా? కుక్కలకు చెరకు సహించదు. అవి బొమికెల కోసం వెతుక్కుంటాయి. దురదృష్ట వంతులకు భవగద్గోష్ఠి అంటేనే తేళ్లూ జెర్రులూ పాకినట్లుంటుంది. భగవంతుని గురించి సత్ప్రవర్తన గురించీ , సాధన గురించీ వారికి తెలుసుకొనే అవకాశమేది? కానీ నీవలా కాకూడదు. మురికి వాడల నుండీ సందు గొందుల నుండీ బయటపడు భగవంతుని సన్నిధికి రాజమార్గాన పయనించు. భగవన్మసిమను కీర్తించు. ఆ ప్రకాశంలో నీవూ వెలిగిపోగలవు. సత్యాన్ని నమ్ముకో. భయం పోతుంది. ప్రేమ మొలకెత్తుతుంది.
ఇంకా ఉంది