సబ్ ఫీచర్

రాజకీయాల్లో ఇక క్రిమినల్స్ వుండరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం కూడా వుంది. 70 సం.ల చరిత్ర మనది. దురదృష్టంకొద్దీ రానురాను మన దేశ రాజకీయాలు చాలా దిగజారిపోతున్నాయి. గెలుపు ఒక మలుపుగా మారి ప్రజల జీవితాలు ఎంతో బాగుపడతాయని ప్రతి ఎన్నికల సమయంలో మనందరం ఆశిస్తాం. ఒక్క మంచి చెడే గెలుపునకు మూలం కాదు. అనేక అడ్డదారులు త్రొక్కడంవల్ల కూడా చాలామంది ఎన్నికల్లో గెలుపు పొందుతున్నారు. ఎన్నికల సమయంలో ధనం, మద్యం, కులం, మతం అత్యంత కీలకపాత్ర వహిస్తున్నాయి. అవినీతి వృక్షం మహావృక్షంలా పెరిగిపోతూ ఎన్నికల్ని, ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ దౌర్భాగ్యపు లక్షణాలు ఒక ఎత్తయితే, క్రిమినల్స్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి గెలవడం మరో ఎత్తు. చాలా కాలం వరకు క్రిమినల్స్ రాజకీయ పార్టీల గెలుపుకోసం పరోక్షంగా తెర వెనుక సహాయపడేవారు. కానీ మన దౌర్భాగ్యం ఇప్పుడు ఎక్కువ శాతం క్రిమినల్సే అధికారంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల్లో నిల్చోవడం, ప్రజల్ని మభ్యపెట్టి గెలవడం, ఆ తర్వాత వీళ్ళే మంత్రులుగా కూడా అయి మన దేశ చట్టాల్ని రూపొందిస్తున్నారు. ఈ పరిణామం మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో మనం తల వంచుకొనేలా చేస్తున్నాయి. క్రిమినల్స్ అధికారానికి రావడం దొంగల చేతికి తాళాలీయడమే! ఈ క్రిమినల్స్‌లో హత్యలు చేసేవాళ్ళు, కిడ్నాప్‌లు చేసేవాళ్ళు, హత్యాచారాలు చేసేవాళ్ళు, దొంగలు, దోపిడీలు చేసేవారు ఇలా అన్ని అవలక్షణాలున్నవారు కూడా వున్నారు. తలదించి సిగ్గుపడాల్సిన నేరగాళ్ళు రాజకీయాల్లో చేరి, పార్టీల జెండా కప్పుకొని కాలర్ ఎగరేసి బ్రతుకుతున్నారు. చాలాకాలం కాంగ్రెస్ పాలకుల్లో కూడా క్రిమినల్స్ వుండేవారు. కానీ వైవిధ్యమైన, స్వచ్ఛమైన పాలన అందిస్తామంటూ ఊదరగొట్టి గద్దెనెక్కిన మోదీ మంత్రివర్గంలో ఆనాడు 8 మంది క్రిమినల్స్ మంత్రులుగా వుండడం అత్యంత విడ్డూరం అనిపించింది. ఎవరికి ఎవరూ తక్కువకాదు. ఏం చేద్దాం! గోవుల్లో తోడేళ్ళు చేరిపోతున్నాయి. పవిత్ర గంగానదిలో మూసీలాంటి నదులూ కలసి కలుషితమై పోతున్నాయి. దేశంలోని విద్యావేత్తలు, మేధావంతులు మాలాంటి పెద్దలు ఈ దుష్పరిణామాలన్నీ వీక్షిస్తూ, ఏంచేయలేక తలలు బాదుకుంటున్నాం. అలాంటి నిరాశాజనక భారతావనిలో ఫిబ్రవరి 13, 2020న సుప్రీంకోర్టు ఓ సంచలన ప్రకటనతో జనాల్లో కోటి ఆశల్ని చిగురింపచేసింది. నవ శకానికి బీజం వేసింది. ఇందులో కొంత చీకటివున్నా ఎక్కువ వెలుగే కన్పిస్తుంది. అదేంటో ఒకసారి పరిశీలిద్దాం.
ఈ నిర్ణయం వెనుక ఓ చిన్ని నేపథ్యం కూడా దాగి వుంది. రాజకీయాలు నేర పూరితం కావడం, అన్ని పార్టీల్లో క్రిమినల్స్ అభ్యర్థులుగా నిలబడడంతో 2018 సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టు ఒక ‘దిక్సూచి’ లాంటి తీర్పు నిచ్చింది. అందులో సారాంశం ఎన్నికలలో నిలబడే అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ నేరాలు బహిర్గతం చేయాలన్నది ప్రధానాంశం. నేర చరిత్ర వున్న వారిని రాజకీయాల్లోకి రాకుండా అరికట్టేందుకు సుప్రీంకోర్టు చేసిన మొదటి యత్నం ఈ తీర్పు. మరి ఈ తీర్పు ఇచ్చి దాదాపు రెండేళ్ళు కావస్తున్నా అమలులో ఎలాంటి పురోగతి కన్పించడం లేదు. దాదాపు అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ తీర్పును పట్టించుకొన్న దాఖలాలేదు. 2019లో మనకు పార్లమెంటు ఎన్నికలు కూడా జరిగాయి. మరి సుప్రీంకోర్టు ఆనాడు పార్లమెంటును ‘మాలిగ్‌నాన్సీ’ (డిసీజ్ వితవుట్ కంట్రోల్)ని నయం చేయాలంటే, రాజకీయాల్లో నేరగాళ్ళను తొలగించేలా చట్టం తీసుకొచ్చి తీవ్రమైన నేరారోపణలున్న వ్యక్తులు రాజకీయాల్లోకే ప్రవేశించకుండా చూడాలని స్పష్టంగా ఆదేశించింది. కలుషితమైపోయిన రాజకీయాల్ని ఈవిధంగా శుద్ధిచేయాలని అభిలషించింది. జస్టిస్ దీపక్‌మిశ్రా ఆధ్వర్యంలోని 5గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ దుర్లక్షణాన్ని మొగ్గగా వున్నప్పుడే నిర్మూలించకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని హెచ్చరిక కూడా చేసింది. ఈ సందర్భంగా నీతాలాల్ మాట్లాడుతూ ‘్ళళ్ఘశ ఔ్యజఆజషజ్ఘశ ఒ్యఖశజూఒ జరీళ ఘశ యనక్య్యూౄశ, ఘ ఇళళజూ ఆ్ద్ఘఆ శ్య యశళూ ఉనజఒఆఒ‘ అనే భావం వ్యక్తంచేశారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై ‘అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్’అనే సంస్థ చేసిన విశే్లషణను టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంటూ ఓ వ్యాసాన్ని ప్రచురించింది. ఈ వార్త 2018 సెప్టెంబర్‌లోని సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా వుండడంవల్ల పెద్ద చర్చనే దేశమంతా లేవనెత్తింది. సుప్రీం ఆదేశాలు బుట్టదాఖలైనట్లుగా ఆ విశే్లషణ తెలియచేసింది. 2019లో పార్లమెంటుకు నెగ్గిన అభ్యర్థుల్లో 50 శాతం మందిపై క్రిమినల్ చార్జిలు వుండడం అత్యంత విచారాన్ని మిగిల్చింది. 2014కన్నా ఈ సంఖ్య దాదాపు 26శాతం పెరిగింది. ఇది చాలా పెద్ద ప్రమాదకరం కూడా. మొత్తం ఎంపీలలో 233 మందిపై అనగా 43 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో తిలాపాపం తలా పిడికెడు. రెండవసారి అధికారాన్ని చేపట్టిన బీజేపీలో 116 మంది అనగా 39 శాతం మందిపైన, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి నెగ్గిన 29 మందిపై అనగా 57 శాతం, జెడి(యు) నెగ్గిన 13మంది అనగా 81 శాతం మందిపైన, డి.ఎం.కె. నుండి నెగ్గిన 10 మంది అనగా 43 శాతం మందిపై, తృణమూల్ కాంగ్రెస్ నుండి నెగ్గిన 9 మందిపై అనగా 41 శాతం మందిపై తీవ్రమైన ఆరోపణలు వున్నాయి. ఇది 2018 సుప్రీం సూచనలకు భిన్నం అనే చెప్పవచ్చు. ఇంకో విచారకర విషయం ఏమంటే 2009లో పార్లమెంటులో 30 శాతం క్రిమినల్స్ కాగా, 2014కు 34 శాతం, 2019కు 43 శాతానికి పెరిగారు. అందులో కూడా చాలా తీవ్రమైన కేసులున్నవారు 14 శాతం, 21 శాతం, 29 శాతంగా వున్నారు. క్లుప్తంగా చూస్తే 2009లో 162 మంది క్రిమినల్స్ పార్లమెంటులో వుండగా 2014కు 185 మంది, 2019లో 233 మంది క్రిమినల్స్ ఎంపిక అయ్యారు.
ఇక మొన్నటి సుప్రీంకోర్టు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకిచ్చిన ఆదేశాన్ని చూద్దాం. అన్ని పార్టీలు కూడా తమ పార్టీనుండి ఎన్నికైన శాసనసభ, పార్లమెంటు సభ్యుల గూర్చిన పూర్తి వివరాలు తమ వెబ్‌సైట్లలో పెట్టాలి. ఎన్నికల్లో పోటీకి ఎంపికచేసిన అభ్యర్థుల్లో కనుక నేర చరితులుంటే వారి కేసులగూర్చి పూర్తి సమాచారాన్ని వుంచడమేగాక వారిని ఏ కారణాలతో ఎంపికచేయాల్సి వచ్చిందో అన్న రీజనింగ్ కూడా ఆయా పార్టీలు విధిగా వివరించాలి. పార్టీలన్నీ తమ అభ్యర్థుల్ని ఎంపిక చేసిన 48 గంటల్లోగా లేదా నామినేషన్లు ఆరంభ తేదీకి కనీసం రెండు వారాల ముందుగా వారి పూర్తి నేర చరిత్రను ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషియల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతోపాటు, జాతీయ, స్థానిక వార్తాపత్రికల్లోనూ ప్రముఖంగా ప్రకటనలు ఈయాలని సుప్రీం ఆదేశించింది. ఎవరైనా, ఏ పార్టీ అయినా ఈ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే తమకు (సుప్రీంకు) ఆ పార్టీల వివరాల్ని తెలుపవలసి వుంటుందని చెప్పింది. ఫిబ్రవరి 14, 2020న సుప్రీంకోర్టు ఎందుకు ఇంత పెద్ద విప్లవాత్మక నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చిందో తెలుసుకొందాం. రాజకీయాలు నేరపూరితం కాకూడదని 2018లో సుప్రీం ఇచ్చిన తీర్పు అమలుకావడం లేదని, 2019 ఎన్నికల్లో ఈ ఆదేశాన్ని అన్ని పార్టీలు ఉల్లంఘించాయని, ఇది కోర్టు ధిక్కరణక్రింద పరిగణించి చర్యలు తీసుకోవాలని కొందరు దాఖలుచేసిన పిటీషన్‌పై విచారించిన జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం తాజా తీర్పును ఇచ్చింది. హైకోర్టు లాయర్ సప్నానరంగ్ ఈ తీర్పుపై మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 సవరించకపోతే ఈ తీర్పు ఫలవంతంకాదు అని అంటారు. మనకు స్వాతంత్య్రం వచ్చాక 1952లో మొదటిసారిగా ఏప్రిల్ 17న పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వోటర్లు కేవలం 17.3 కోట్లు మాత్రమే. అదిప్పుడు 90 కోట్లకు చేరింది. ఆనాడు కాంగ్రెస్ 45 శాతం వోట్లతో 364 సీట్లు గెలుపొందింది. స్వతంత్రులు 37 మంది, కమ్యూనిస్టుపార్టీ నుండి 16 మంది, సోషలిస్ట్ పార్టీ నుండి 12 మంది గెలుపొందారు.
2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 90 కోట్ల ఓటర్లు పాల్గొన్నారు. 464 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో తమతమ అభ్యర్థుల్ని నిలిపాయి. ఫలితాలు మాత్రం ఆనందాన్ని కల్గించలేదు. 233 మంది గెలిచిన అభ్యర్థులు తమకు నేర చరిత్ర వున్నట్లు వారి అఫిడవిట్లలో పేర్కొన్నారు. గెలిచాక అందరం ముక్కుమీద వేలేసుకొంటున్నాం. ఇది కథకాదు. మన చరిత్ర చెప్పే సత్యం. ఇటీవల ఇండియా టుడే క్రిమినల్స్ అనే వ్యాసాన్ని ప్రచురించింది. కేరళలోని కాంగ్రెస్ ఎంపీ డీన్ కొరియాకోస్‌పై 204 క్రిమినల్ కేసులున్నట్లు తెలిపింది. ఇడుక్కి పార్లమెంటు నుండి నెగ్గిన ఈయనే దేశంలోనే ఎక్కువ క్రిమినల్ కేసులున్న వ్యక్తిగా చెప్పచ్చు. మరి నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన కేరళీయులు ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నారో అని ఆశ్చర్యం వేస్తుంది. ఇతనిపై లేని కేసులంటూ లేవు. వైష్ణవ్ అనే పరిశోధకుడు తన పరిశోధనలో మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియచేశాడు. పోటీలో నిల్చొన్న మంచివారికి గెలుపు అవకాశాలు 6 శాతం కాగా, నిల్చొన్న క్రిమినల్స్‌కు 18 శాతంగా వున్నట్లు పేర్కొనడం మంచికి స్థానం లేదేమో అని నిరాశకు గురిచేస్తుంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో రాజాభయ్యా అనే రఘురాజ్ ప్రతాప్‌సింగ్‌ను గూర్చి కూడా చెప్పుకోవాలి. ఇతను దాదాపు 7సార్లు ఉత్తరప్రదేశ్‌లోని ‘కుంద’ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఇతనిపై లెక్కలేని క్రిమినల్ కేసులున్నా ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, జైళ్ళ పర్యవేక్షణ శాఖ మంత్రిగా అఖిలేష్‌యాదవ్ కేబినెట్‌లో పనిచేశారు. జైలు జీవితం అనుభవించినా ప్రజలు వోటేయడం ఆశ్చర్యం కల్గిస్తుంది.
మన న్యాయవ్యవస్థలో కూడా లోపాలున్నాయి. కోర్టుల్లో ఆలస్యం కావడంవల్ల, అంతవరకు ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకోవడం సాధ్యంకాదేమో.. మరి ప్రాథమిక దశలోనే ఇలాంటి వారికి అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే పిటీషన్‌దార్లు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇది గడ్డు సమస్యే. మరి దోషులుగా కోర్టులు తీర్పు ఈయకముందే వారిని పోటీనుండి అడ్డుకోవడం మా చేతుల్లో లేదని, ఈ విషమ, సందిగ్ధ సమస్యను తేల్చాల్సింది పార్లమెంటు మాత్రమే అన్నది కూడా కోర్టు తీర్పులో వుంది. ఇది మాత్రం వొక భేతాళ సమస్యగానే మిగిలిపోనుంది. మరోవైపు ఎలాగైనా గెలుపే ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో దూకుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బుల్ని ఎరగావేయడం ఆరంభం అయిన నాటినుండి ఎన్నికల్లో గెలవడానికి అన్ని పార్టీలు కూడా ప్రజాబలంతోపాటు, డబ్బుల బలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అలాంటి పరిశీలనలో వడగట్టబడ్డ వ్యక్తుల్లో క్రిమినల్స్ కూడా ఎక్కువ టికెట్లు పొందకల్గుతున్నారు. ‘పుణ్యభూమి నాదేశం నమో నమామి’ అంటూ జాలాదిగారి పాట, పాడుకోవడానికి బాగానే వుంటుంది. ఈ నేరగాళ్ళు ఎలాగైనా నెగ్గాలని, అప్పుడు రాజ్యాంగం అండ కల్పిస్తుందని ఎంపీ, ఎమ్మెల్యేలుగా తిరుగులేని బావుటా ఎగురవేయాలని విచ్చలవిడిగా డబ్బులు, మద్యం వెదజల్లుతున్నారు. క్రిమినల్స్ కావడంవల్ల కొందరు ఓటర్లని భయపెటి ఎన్నికల్లో నెగ్గుతున్నారు.
సుప్రీం తీర్పులో మరికొన్ని లోపాల్ని కూడా చర్చించుకోవాలి. గత కాలంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామాలు మనందరం చూశాం. అలా అన్యాయంగా కేసుల్లో ఇరుక్కొన్నవారిని పోటీనుండి బహిష్కరించడం కూడా న్యాయం కాదు. అందుకనే సుప్రీంకోర్టు కూడా వాటి జోలికి వెళ్ళకుండా కేవలం తమపై వున్న కేసుల వివరాల్ని, ఎందుకు పోటీచేయాల్సి వచ్చిందో తదితర వివరాలన్నీ పార్టీలు బహిర్గతం చేయాలని మాత్రం సూచించింది. ఇంతకాలం అభ్యర్థులు ఏదో మొక్కుబడిగా ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం తమ వివరాల్ని వెల్లడించేవారు. అవేవీ ప్రజలకు తెలిసేవి కావు. వ్యక్తిగత వివరాలు వెలుగుచూసేవి కావు. మరి సుప్రీం తాజా ఆదేశాల ద్వారా అభ్యర్థుల గూర్చి వివరాలు న్యూస్‌పేపర్స్ ప్రకటనల ద్వారా తెలుసుకొనే వీలు కలుగుతుంది. ఎన్నికల కమిషన్ కూడా యుద్ధప్రాతిపదికన విప్లవాత్మక ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది.

- డా. విజయకుమార్, 93907 45775