సబ్ ఫీచర్

వ్యాపార రంగంలో రాణించాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మహిళలు కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. అయితే వ్యాపారంలోకి వచ్చేటప్పుడు కేవలం ఆ ఆలోచనే కాదు.., అదనంగా గుర్తపెట్టుకోవాల్సిన అంశాలు కూడా కొన్ని ఉంటాయి. అవేంటంటే..
* వ్యాపారం మొదలుపెట్టాం కాబట్టి.. ఇక దానే్న చూసుకుంటే చాలని అనుకోవడం సరికాదు. ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. వాటిని అమలుపరచడానికి ప్రయత్నించాలి. అప్పుడే మనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.
* సొంతంగా ఏదైనా చేయాలనుకునేటప్పుడు సవాళ్లు సహజం. ఏ పనీ అనుకున్నంత సాఫీగా జరగకపోవచ్చు. మీరు అనుకున్న దాన్ని, మీ సామర్థ్యాన్ని ఎవరూ నమ్మకపోవచ్చు. కాబట్టి వాటన్నింటికీ సిద్ధం కావాలి.
* ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని ఎప్పటికప్పుడు ఎలా చేరుకోవాలి అని ఆలోచించాలి. ఇలా ప్రతి పనికీ ఒక డెడ్‌లైన్ పెట్టుకుని.. దాన్ని ఆ సమయానికి పూర్తిచేసేలా చూసుకోవాలి.
* ఒక పెద్ద అవకాశం వచ్చేవరకూ ఒడిదొడుకులు మామూలే.. వాటిని తలచుకుని బాధపడటం కన్నా.. సహనంతో లక్ష్యం చేరుకోవడం తెలిసి ఉండాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కష్టపడి పనిచేయడానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
* వ్యాపారం చేయాలనుకునేవారు ముందుగా వారు తమ బలాలను పెంచుకోవాలి. ముఖ్యంగా భావవ్యక్తీకరణ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. నలుగురిలో ఆకట్టుకునేలా మాట్లాడే కళ కూడా తెలిసి ఉండాలి. అలా నైపుణ్యాలు పెంచే బృందాలు కూడా కొన్ని ఉన్నాయి. అవసరం అనుకుంటే శిక్షణ కూడా తీసుకోవచ్చు.
* ఇలా.. తమకంటూ ఓ దిశానిర్దేశం జరగాలంటే కచ్చితంగా ఒక మెంటార్‌ను పెట్టుకోవాలి. అప్పటికే వ్యాపారంలో రాణిస్తోన్న వారిని ఎంచుకుంటే వాళ్ల వ్యాపార అనుభవాలు మీ వ్యాపారానికి ఉపయోగపడతాయి. ఇలా కృషి, పట్టుదలకు చిన్న చిన్న ఆలోచనలు తోడైతే అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకోగలరు. *