సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తపం, పశ్చాత్తాపం
దీపానికి ఎదురుగా నడువు. నీడ నీ వెనక్కుపోతుంది. వెనక్కు తిరుగు. నీ నీడ నీకన్నా ముందు నడుస్తుంది.
దేవునివేపు ఒక్కొక్క అడుగే వేయి, మాయ నీ వెనక్కు జారుతుంది. అప్పుడది నిన్ను లోబరచుకోలేదు.
స్థిరంగా వుండు. పట్టుదలతో నడువు, తప్పటడుగో, తప్పుటడుగో వేసి తర్వాత వస్తాయించకు.
ముందు ‘తపం’చేయి, పశ్చాత్తాపంతో పని వుండదు.
దైవకృప లభించాలంటే
నీవూ దివ్యమైన గుణాలను ప్రేమ, శాంతి, ధర్మం, సత్యం కరుణ వంటివి- అలవరచుకో. అంతే కాని, వాడిపోయే పూవునో, మగ్గిపోయే పండునో, వడలిపోయే ఆకునో, యింకిపోయే నీటినో యిచ్చి, దైవకృపను సంపాదించుకోవాలని చూస్తే కుదరదు.
నా సంగతంతా తెలిసినట్లు మాట్లాడేవాళ్లూ, రాసేవాళ్లూ కొందరుంటారు. నా గురించి నిజంగా వాళ్లకేం తెలుసు? ఇంకో వేయి జన్మాలెత్తినా నన్నూ, నా తత్త్వాన్నీ వారు గ్రహించలేరు.
నన్ను తెలియాలంటే నాఅంత ఎత్తుకు ఎదగాలి! సముద్రం లోతు కనుక్కోవడం చీమల తరమా?
స్వామి ఆంతర్యం
విశాల హృదయం వుండాలి. అప్పుడు నీ మార్గం విశాలంగా అవుతుంది. ఇక నీకు యిరుకుబాటలు నచ్చవు. అందర్నీ ప్రేమించు. పై అంతస్థులో వున్నారని ఎవరిపట్లా అసూయవద్దు. వారూ నీవారే. అంతా కలిసే ప్రయాణిస్తున్నాం.
నన్ను గురించి ఒక సంగతి తెలుసుకో. చేసే పనివల్ల ఏం జరుగనున్నదో ఆలోచించకుండా స్వామి ఏ పనీ తలపెట్టడు.
ఆచరణ ప్రణాళిక
ఇక్కడకు వచ్చి, ఇక్కడ చూసినవీ, విన్నవీ మీ హృదయాలలో భద్రపరచుకొనే అవకాశం మీకు చిక్కింది. ఇక వాటిని ఆచరణలో పెట్టేందుకు పూనుకోండి! ఆచరణలో పెట్టాలనుకోడం, ఆచరించటం రెండూ ఒకేసారి జరగాలి! వాటిని ఎలా ఆచరించాలీ అన్నదానిపై మీరంతా ఆలోచించుకొని ఒక మాస్టర్‌ప్లాన్ వేసుకోండి! దానిని వెంటనే అమలుచేయటం మొదలుపెట్టండి!
ఇది అన్ని దేశాల్లో జరగాలి! సాయిది ఆంధ్రప్రదేశ్ వొక్కటే అనుకోకండి! అన్ని ప్రదేశాలూ సాయివే! ప్రపంచం అంతా వొక్కటే! కలియుగంలో రుూ సత్యాన్ని గ్రహించేందుకు, రూపించేందుకూ మీరు కృషిచేయాలి! మీకీనాడు నేనిచ్చే సందేశం ఇదే!
మీ కోర్కెలన్నీ నేను తీరుస్తున్నాను. నా రుూవొక్క కోరికా మీరు తీర్చాలి! మీ అందరికీ చిరాయురారోగ్య సుఖ శాంతి సౌభాగ్యాలు కలగాలి! మానవాళి సంక్షేమానికీ, దేశ సేవకూ మీరంతా మీ కాయిక, మానసిక, మేధాశక్తులనూ, ఆధ్యాత్మిక బల నైపుణ్యాలనూ అంకితం చేయాలి!
ప్రశాంతి యోగం
ముక్కాలి పీట
దైవమే వరదుడు. ప్రాపంచిక విజయాలూ, సంపదలూ ముక్తినివ్వలేవు. సత్యం, శివం, సుందరం అన్న ముక్కాలిపీటపై ముక్తి అధిష్ఠించి వుంది.
అది అనేక రూపాలు ధరిస్తుంది. అదే శాంతం! అది అనేక నామాలతో పేర్కొనబడింది. అన్నీ లయించేది అందులోనే. అదే శివం! అదే సత్, చిత్, ఆనందం! అదే సుందరం!
ఆత్మతత్వం
ప్రతి దినం నీవు నిద్రిస్తావు. నిద్రించేటప్పుడు నీవెక్కడికిపోతున్నావు? ఏమవుతున్నావు? అసలు నీవెవరు? నిద్రించేటప్పుడు నీ యింద్రియాలు పనిచేయవు. నీ తెలివితేటలు స్తబ్దంగా వుంటాయి. నీ మనసు కలలో తన లోకాన్ని తాను సృష్టించుకొని కాసేపు దానితో క్రీడించి మగతలోకి జారుకుంటుంది. అదే నిద్ర. దాదాపు సమాధి స్థితికి చేరుకున్నట్లే. శాంతిని కల్గించే ఆత్మతత్వంలో జీవించు. నీలో రాగద్వేషాలుండగా నీకు స్వస్థత ఎక్కడ? ఆత్మతత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకో. నీవే భగవాన్ కాగలవు.
శాంతి స్వరూపులు
ప్రశాంతి నిలయం అంటే శాంతికి అత్యున్నత రూపమైన ప్రశాంతికి స్థానం అని అర్థం. నిజానికి మీరంతా మీలో ప్రతి ఒక్కరూ ప్రశాంతి నిలయాలే. అందుకే నేను తరచుగా మిమ్మల్ని ‘శాంతి స్వరూపులారా!’అని సంబోధిస్తూ ఉంటాను. మీ సహజస్థితిశాంతి, సమత, అనాతురత, నిస్సంగం, అక్కడ లేని దానిని నీవుతీయలేవు. కనుకనే శాంతి నీలోనే ఉన్నది నీ హృదయంల గూఢంగా లోన ఎక్కడో దాగి ఉంది. దానిని వెలికి తీయి.
రాచమార్గం
జీవితంలో కలిగే ఒడుదుడుకులను సంతోషంగా స్వీకరించటమే శాంతికి రాచమార్గం. అందరికీ సుఖం, శాంతి కావాలి. కానీ వాటిని ఎలా సాధించుకోవాలో చెప్పేవారు లేరు. శాంతి కాముకులకు రామాయణ భారతాలు జ్ఞాన సముద్రాలు. చిన్నచిన్న ఉపాఖ్యానాలతో నిండి అవి ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉంటాయి. ఆ ప్రబోధాలను మనసుకు పట్టించుకుంటే పవిత్రత చేకూరుతుంది. పవిత్ర హృదయంతో భగవంతుని రూపాన్ని మననం చేయటమే వైకుంఠం అదే కైలాసం.
ఇంకా ఉంది