సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగం
ఉద్యోగం పురుష లక్షణం..అన్నారు. ఉద్యోగం అంటే ఏమిటి? ఏదో ఒక కొలువు అని సామాన్యంగా అనుకొనే సంగతి. అది తప్పు. దద్ అంటే ఉచ్చస్థాయి. యోగం అంటే ఆధ్యాత్మిక సాధన, నీవే ఉద్యోగం చేసినా దానిని ఉచ్ఛస్థాయి, సాధనగా భావించు. అదే పురుషుని లక్షణం,. అర్థం అందరకూ కావాలి. దానిని ధర్మబద్ధంగా సంపాదించినపుడే ‘పురుషార్థ’ అన్న పేరు దానికి సార్థకం కాగలదు. పురుషార్థం అప్పుడు పరమ పురుషార్థం అవుతుంది. ‘పర’ అంటే ఉన్నతమైన, శాశ్వతమైన విలువలను సాధించే కృషిలో ధర్మబద్ధంగా పురుషుడు సంపాదించుకునే అర్థం పరమ పురుషార్థం. శాంతి సోపానం అదే.
ఇంటింటి భాగోతం
ఈ రోజుల్లో ప్రతి ఇంటా అనారోగ్యం తాండవిస్తోంది. చిన్న పిల్లలక్కూడా కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి. యువకులు కూడా జుట్టుకు రంగేసుకుంటున్నారు. పళ్లు కట్టించుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటి? ఆధునిక గృహాలలో నెలకొని ఉన్న కృతకమైన వాతావరణమే ఏ ఇంట చూసినా ఏం కనిపిస్తున్నది? ఏదో హడావుడి , ఆందోళన , ఆత్రుత, అసూయ, అసంతృప్తి , ఆడంబరం, దుబారా, అసత్యం, కపటం, ఉత్తర కుమార ప్రజ్ఞలు. ఇవేగా. ఈ రకమైన కలుషిత వాతావరణంలో అనారోగ్యంగా కాక ఎవరయినా ఆరోగ్యంగా ఎలా ఉండగలదు? ఇంటిలో సంతృప్తి శాంతి రాజ్యమేలుతుంటేనే ఇంటిలోని వారు ఆరోగ్యంగా హాయిగా ఉంటారు.
దేహి వేరు
నీ దుఃఖాలన్నిటికీ కారణం ఏమిటో తెలుసా? ఈ దేహమే నీవు అనుకోవడం నీవు ఈ దేహంలో వుంటేవాడినే కానీ దేహానికి కావు. ఈ సంగతి నీకు అర్థమయిన కొద్దీ సుఖసంతోషాలు శాంతి నిన్నావరించుకుంటాయి.
పాపాత్ముడా!
దేవుడు కనపడడేం?అనడుగుతావు. కానీ తప్పెవరిది?యనను చూసి కూడా గుర్తించకలేకపోయిన నీదే. భగవంతుడు అనేక రూపాలు ధరిస్తాడు. ఈ రూపాలన్నీ ఆయనవే. నీవూ ఆయన రూపానివే. కానీ నవది గ్రహించటల్లేదు. నిన్ను నీవు ఒక పాపాత్ముడను కొంటున్నావు. పాప పంకిలంలో పడి దొర్లే కీటకాన్ననుకుంటున్నావు. నీ మాట నమ్మిన వారెవరయినా నిన్ను ‘హల్లో పాపాత్ముడా’ అని పిలిచారనుకో. నీకు తగని కోపంవస్తుంది. ఎందుకని ? నీ అసలు స్వభావం పవిత్రత కనుక సంతోషం కనుక, శాంతి కనుక.
జ్యోతి ప్రకాశం
ప్రవర్తన మంచిగా ఉండటం ఎంతో ముఖ్యం. ప్రవర్తన సరిగా లేకపోతే ఆనందం లభించదు.
ఒక వ్యక్తికిగానీ, ఒక సంస్థనుగానీ వాళ్లు చూపే నిజాయితీని బట్టే చూడాల్సి వుంటుంది. మనో వాక్కాయ కర్మలలో తేడా రాకూడదు. అలాంటి క్రమశిక్షణ. ఋజువర్తన ఉన్న కర్మే శాంతిని ప్రసాదించగలదు. ప్రశాంతి నుండి ప్రకాంతి వస్తుంది. ప్రకాంతి నుంచి పరంజ్యోతి ఆవిర్భవిస్తుంది. పరంజ్యోతి పరమాత్మ ప్రకాశమే.
మనశ్శాంతి
‘ఇది కావాలి’, ‘అది కావాలి’ అన్న కోరికలకు జ్ఞాని చోటివ్వడు. క్షేత్రాన్ని చైతన్యవంతం చేసే సాక్షీభూతుడు క్షేత్రజ్ఞుడున్నాడనీ, ఆయనే అంతటికి అధిపతి అనీ జ్ఞాని ఎరుగును.
వ్యాసులవారు వేదాలను నాలుగు భాగాలుగా కూర్చారు. బ్రహ్మ సూత్రాలను రచించారు. అష్టాదశ పురాణాలను రాశారు. పంచమవేదం అని పేరుపడ్డ భారతం ఆయన రాసిందే. అయినా ఆయనకు మనశ్శాంతి లభించలేదు. ఆయన రచనల్లో అద్భుత పాండిత్యం ఉంది. సునిశిత మేధస్సు ఉంది. మనోహరమైన కవిత్వం జాలువారింది. తత్వం వెల్లివిరిసింది. కాని అనుభూతి పూర్వకమైన ఆత్మానందం మొగ్గుతొడగకపోవటమే ఆయనకు కలిగిన అశాంతికి కారణం.
భగవత్కుటుంబం
భగవత్కుటుంబం ఎప్పుడూ శాంతి, సామరస్యాలతో కూడి వుంటుంది.
శివుడు పాములను ఆభరణాలుగా ధరిస్తుంటాడు. ఆయన చిన్న కొడుకు కుమారస్వామి నెమలిని వాహనంగా పెట్టుకున్నాడు. నెమలికీ పాములకూ పడదు.
పెద్ద కొడుకు గణపతి మూషిక వాహనుడు. ఎలుక పాములకు ఆహారం.
గణపతి ముఖం ఏనుగు ముఖం. ఏనుగు సింహానికి ఆహారం.
అమ్మవారి వాహనం మరి సింహమే! ఆమె ఎక్కడో దూరంగా వుంటుందా? ఉహూ! శివునిలో సగం శరీరం ఆమే! అయ్యగారి వాహనం ఎద్దు. అమ్మగారిది సింహం. ఆ రెంటిక్కూడా నిప్పులో ఉప్పే.
శివుని నుదుట అగ్నినేత్రం వుంది. దానికి కొంచెం పైన గంగ వుంది. నిప్పుకూ, నీళ్లకూ అసలే పడదు.
అయినా కైలాసంలో అంతా ఎంత హాయిగా కలిసి మెలసి ఉన్నారో చూడు!
ఇంకా ఉంది