సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతి సోపానాలు
మానవులమధ్య వుండవలసిన న్యాయం, ధర్మం అడవులపాలై, అడవులలో కనిపించాల్సిన క్రౌర్యం. ద్వేషం మానవ సమాజంలో నివాసమేర్పరచుకొన్నాయి. అందుకే మానవ జీవితము అనేక చిక్కులతో, చింతలతో నిండిపోయింది. విశ్రాంతి మందిరాల నెన్నిటినో నిర్మించుకొంటున్నారు. కాని విశ్రాంతీ, శాంతీ కరువయ్యాయి. మనశ్శాంతి లేక ఆరోగ్యము లేదు. ఆరోగ్యములేక ఆనందం లేదు. కనుక ముందు శాంతిని పొందే ప్రయత్నం చేయి. కరుణ, ప్రేమ, సంతృప్తి ఇవే శాంతికి సోపానాలు.
అన్నానే్వషణ
ఎల్లప్పుడు మనిషి సత్యానే్వషణలో మునిగి వుండాలి. కాని అతడు అన్నానే్వషణతోనే సతమతవౌతున్నాడు. కోరికలను పెంచుకొంటూ కాలాన్ని వృథాచేస్తున్నాడు.
తన జీవిత పరమార్థం ఏమిటి? కోరికలను తీర్చుకోవడమేనా? ఒక కోరిక వెంట మరొకటి రాదా? కనుక మానవుడు మనోనిగ్రహాన్ని పెంపొందించుకొని ఆత్మదర్శనంకై సాధన సాగించాలి.
**
ఆనందయోగం
‘నేను’వెనుక మూడు
ప్రతి వ్యక్తివీ మూడు కోరికలుంటున్నాయి. ‘నేను బతకాలి’! అనేది మొదటిది. బతకాలి అన్న కోరిక అన్నిటికన్నా బలమైంది. నిజానికి జీవునిలో సహజంగా వుండే నిత్యుడు కావాలన్న యిచ్ఛ యిది.
తెలుసుకోవాలన్న కుతూహలం రెండవది. తీరని తృష్ణ యిది. ‘నేనెవర్ని?’ అన్న జిజ్ఞాసకు మూలం.
మూడవకోరిక ఆనందం పొందాలన్నది. సామాన్యంగా మనిషి ఇంద్రియ సుఖాలను ఆనందంగా భ్రమపడతాడు. కాని ‘నేను’అనుకొనే ఆత్మలోనే అంతులేని ఆనందామృత ధారలున్నాయి. వాటిని వెదికి పట్టుకోవడమే జీవిత పరమార్థం. జన్మకు సాఫల్యం.
రేరుూ, పగలూ
ఆనందం నీకు ఎంతో అవసరం. ఈ సంగతి మాత్రం నీవు వెంటనే వొప్పుకుంటావు. కాని అది ఏ దుకాణంలోనూ అమ్మేది కాదే! దానిని సొంతంగా కష్టపడి సంపాదించుకోవాలి. ఎలా? మంచి పనులు చేస్తుండు. చెడునుండి తొలగిపోతుండు. కుళ్లిపోయినవీ, మంచివీ రెండూ ఒకే గినె్నలో పెడతామా? అలాచేస్తే, మంచి పదార్థాలుకూడా చెడిపోతాయి. రాత్రిపగలూ జత కడతాయా? కనుకనే మంచివేపు మొగ్గుతూనే చెడునుండి దూరంకావాలి. దైవచింతనలో మనసును లగ్నం చేయి.
రామో విగ్రహవాన్ ధర్మః
‘రామో విగ్రహవాన్ ధర్మః’ - రాముడు రూపెత్తిన ధర్మం. మనిషి ఆచరించవలసిన ధర్మాలన్నిటికీ ఆయన ప్రతీక. యజమాని, భర్త, కొడుకు, సోదరుడు, మిత్రుడు, ఆఖరికి శత్రువుకూడా ఎలా వుండాలో చూపే ఆదర్శవ్యక్తి రాముడు.
ఆయన వలెనే ఆయన సోదరులూ ఆదర్శమూర్తులు: భరతుడు సత్యశీలి, శతృఘు్నడు శాంతి పురుషుడు, లక్ష్మణుడు ప్రేమమూర్తి.
ఆనందమయ జీవితాన్ని గడపాలంటే ఏ ఆదర్శాలను పాటించాలో తెలుసుకునేందుకు మీరు రామాయణం చదవండి! మీకు చక్కని ప్రయోజనం కలుగుతుంది. అప్పుడే మీరు యథార్థంగా ముముక్షువులనిపించుకోగలుగుతారు.
ప్రశాంతి నిలయ చిహ్నం
మీరు ఏ ఆదర్శాలననుసరించాల్సి వుందో వాటికి ప్రశాంతి నిలయ చిహ్నం సూచికగా వుంటున్నది. అది జయకేతనం. నిరంతర సాధన ద్వారా కామ లోభాలపైనా, కుత్సిత, వంచనలపైనా సాధించిన విజయానికి అది గుర్తు. ఆత్మనిగ్రహం, ఆత్మదర్శనం ద్వారా అందుకున్న ప్రశాంత పరమానందానికి అది ప్రతీక!
ధర్మం చర
దేవుని దిశగా నడిపించే దారి కర్మయోగమే, కాని అది ధర్మయోగం కావాలి. అదే సంతోషానికి, సంతృప్తికీ మార్గం.
అయితే యిప్పుడా బాట నిండా ముళ్లపొదలు పెరిగాయి. రోడ్డువెంట వంతెనలన్నీ దెబ్బతిని వున్నాయి. జనం ఆ బాటను ప్రస్తుతం వాడటల్లేదు. అది వుందనే సంగతే వాళ్లు మరచిపోయారు.
అయితే ఆనందం అనే గమ్యం చేరాలంటే ఆ బాట తప్ప మరో దారిలేదు. ఎవరెటు తిరిగినా, ఏంచేసినా చివరకు అంతా ఆ బాటకు రావలసినవారే. గమ్యాన్ని చేరాల్సినవారే.
అనాదిగా వేదం ప్రబోధించిన సత్యమార్గమదే: ‘సత్యంవద! ధర్మంచర’! (సత్యం పలుకు, ధర్మాన్ని ఆచరించు.)
ఆయనే ఆనందం
నీ గమ్యం ఏమిటి? భగవత్సాక్షాత్కారం, కాని దేవునికి ఆకారంలేదు. ఆయన నిర్గుణుడు, నిరామయుడు, మంచీ, చెడూ రెంటికీ అతీతుడు. ఆయన కెవరిపట్లా కోపం లేదు. పక్షపాతం లేదు, ఆయనకు కావలసినవారు లేరు. అక్కరలేనివారూ లేరు.
ఆయనను జ్ఞాన స్వరూపుడు, సత్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు అంటున్నావు. కాని ఆయనకే స్వరూపమూ లేదు. ఆయనే సత్యం. ఆయనే జ్ఞానం. ఆ ఆనందాన్ని రుచిచూసిన వారి అనుభవం ఇది!
ఇంకా ఉంది