సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోగం వెంట రోగం!
జీవితంలో సుఖమూ, దుఃఖమూ రెండూ వుంటాయి. రెంటినీ అనుభవించేందుకు తయారుగా వుండాలి.
‘్భగం’అనే మంత్రిగారిని ఆహ్వానిస్తావు. ఆనందమే! కాని ఆయన వెంటనే ఆయన పి.ఏ. ‘రోగం’గారుంటారు! ఆయన పెట్టే అవస్థలకు సిద్ధపడాలి, మరి!
అలాకాకుండా వేరే మంత్రులున్నారు ‘త్యాగంగారూ’, ‘యోగం గారూ’, వాళ్లని పిలువు. ‘్భగం’వాళ్ల పి.ఏ.గా వస్తాడు. అప్పుడు ఇబ్బందిపెట్టడు. అంతా ఆనందమే!
చాతక పక్షి
చాతకపక్షి ఉరుములను, మెరుపులను లెక్కచేయక ఆకాశము నుండి పడే మొట్టమొదటి వర్షబిందువులకై నోరు తెరచుకొని పైకి ఎగిరి వెళ్లుతుంది. దానికా తొలకరి బిందువులతోనే ఆకలి తీరుతుంది. ఆ తరువాత నేలపై వాన నీరు వరదకట్టినా పెద్ద ప్రవాహమై పారినా దానికై అది ఆశపడదు. అట్లే, భగవదానందమును అందుకోవాలి అంటే ప్రాపంచిక సుఖాలను తిరస్కరించవలసి వుంది.
పంచమాతృకలు
స్ర్తిమాతృమూర్తి, ప్రథమ గురువు కూడా. శిశువుకు తల్లే. పంచమాతలలో ప్రథమస్థానము కని పెంచే తల్లిదే.
పంచమాతలెవరు? నిన్ను గన్నతల్లి నిజమాత, దేహమాత మొదటిది. దేహ పోషణకవసరమైన క్షీరాన్నిచ్చేది గోమాత. దేహానికి కావలసిన ఆహారాన్ని అందించేది భూమాత. ఆసరానిచ్చి, బాసలుకల్పించి సంస్కృతీ సంప్రదాయాలతో పెంచి పెంపొందించే దేశమాత. నీ మాతృభూమి నాల్గవది.
మానవ జీవిత పరమార్థాన్ని తెల్పి, ఆ పరమార్థాన్ని సాధించే బాటను చూపించే తల్లి వేదమాత- అయిదవది.
దేహమాత మిగిలిన నలుగురు మాతల గొప్పతనాన్ని పిల్లలకు వివరించాలి. ఆనందపథంలోకి వారి మనసులను లేతగా వున్నప్పుడే మళ్లించాలి.
ఆనందోబ్రహ్మ
ప్రార్థన అంటే ఏమిటి? మతానికి వూపిరి! దేవునికీ జీవునికీ సంధానం!
ధ్యానం అంటే ఏమిటి? కృష్ణుని వేణుగానాన్ని ఆలకించటం. మానసికంగా చెవియొగ్గి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించటం!
యోగం అంటే ఏమిటి? మనసను ఏకాగ్రంచేసి తననుతాను మరవటం. ఆత్మదర్శనంతో ఆనందాన్ని అందుకోడం!
అన్నంనుండి ఆనందానికి
అరవిందుడే మనిషిగా అవతరిస్తాడు. గోవిందుడై, హలధారియై నర్తిస్తాడు. ఎందుకని? ముందు ఆహారం ముఖ్యం అని చెప్పటానికి. ‘అన్నం బ్రహ్మ’ ముందు ఆహారం! తరువాతనే ‘జ్ఞానంబ్రహ్మ’, ఆపైన ‘ఆనందోబ్రహ్మ’!
అన్నం, జ్ఞానం, ఆనందం-ఇదీ క్రమం.
త్రిపురాసురులు
ఆనంద స్వరూపుని మననం చేయి. దుఃఖం విడిపోతుంది. ఆనందం కలుగుతుంది. త్రిపురాసురులు ముగ్గురు. స్థూల, సూక్ష్మ, కారణ దేహాలే ఆ ముగ్గురు రాక్షసులు. వారిని సంహరించటానికి శివుడు బయలుదేరాడు. ఆయనకోసం దేవతలొక రథాన్ని సిద్ధంచేశారు. ఆ రథాన్ని చూసి శివుడు నవ్వాడు. ఎందుకని? ఆ రథసారథి విష్ణువు. ఆయన యోగ నిద్రలో వున్నాడు. రథమేమో భూమి. రెండే చక్రాలు సూర్యుడూ, చంద్రుడూ. ఆ రెండూ ఎప్పుడూ ఒకేరకంగా తిరిగేవి కావు. శివుని నవ్వుకే అసురులు డీలాపడిపోయారు. వారిమీదికి దండెత్తాల్సిన అవసరం లేకపోయింది. ఇంతకూ ఆ ముగ్గురు రాక్షసులూ ఎలా చనిపోయారు? ఆనందం వున్నచోట వారు జీవించలేరు. ఎందుకంటే వాళ్లు చింతనుండి జన్మించారు. ఆనందాన్ని పెంచుకో, దుష్టశక్తులు నినే్నమీ చేయలేవు.
ఈశ్వర
‘ఈశ్వర’అనగా సకలైశ్వర్య స్వరూపుడు. ఐశ్వర్యమనగా ఏమిటి? కేవలం ధన కనక వస్తువాహనాదులు మాత్రమేకాదు. ఆరోగ్యము ఒక ఐశ్వర్యమే. మేధాశక్తి ఐశ్వర్యమే. భుజబలమూ ఐశ్వర్య స్వరూపమే. కనుకనే ‘ఈశ్వర’ అనగా సకల ఐశ్వర్యములను చేకూర్చేటటువంటిది ఈశ్వరత్వము అని అర్థం.
అయితే ఈ ఆనందమనేటటువంటి దానికి రూపమేమిటి? ఈ ఆనందమనే దానికి అనుభూతే రూపము. ఈ ఆనందమనేది కేవలం ఒక్క దైవంచేత మాత్రమే ప్రసాదింపబడుతుంది గాని అన్యమార్గములో లభ్యంకాదు. సర్వత్రా ఉండినది ఒక్క ఆనందమేకాని అది కనిపించదు. కనిపించకపోయినంత మాత్రాన లేదని వాదించరాదు. కనుక ఈశ్వరత్వమనేది సర్వత్రా వ్యాపించినటువంటిది.
ఇంకా ఉంది