సబ్ ఫీచర్

శ్రీ సాయి గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యం, శివం, సుందరం
సత్యం, శివం, సుందరం! ఈ మాటల్లో ఎంతో అర్థం వుంది. అందరిలో నిండివున్న ఆయన గురించే ఇవి చెబుతాయి. మీ అందరి వౌలికమయిన ఉనికే సత్యం. అందుకే అబద్ధాలకోరు అనిపించుకోడానికి ఎవరూ యిష్టపడరు. యథార్థమైన ‘నీవు’ నిర్మలమైనది. కనుక అసత్యారోపణను అది సహించదు. ఆ యథార్థమైన ‘నీవు’ సుఖం, సంతోషం, మంగళం, అది ‘శవం’కాదు, శివం! శుభం, నిత్యం, ఆనందం సత్, చిత్, ఆనందమ్! అందుకే ‘వికారంగా’వున్నావంటే నీవెలా సహించగలవు?
ఆత్మ దేహంలో బందీ! దానికది నచ్చదు. నీవు ఆత్మను దేహంగా భ్రమపడ్డప్పుడు, దేహానికి వుండే బలహీనతలనూ లోపాలనూ తనకు అంటగట్టినప్పుడు ఆత్మ సిగ్గుతో తలవంచుకోవాలి!
పిదప బుద్ధులు
‘లోకం శోక హతం’అన్నారు. ఈ కాలం జనాన్ని చూసినా, వారి నాయకులను చూసినా ఏం కనిపిస్తుంది? ఏవేవో కోరికలతో కిందామీదా అవుతుండటం చూస్తాం. నీచమైన కోరికలను తీర్చుకోవాలంటే, నీచమైన పనులుచేయాల్సి వుంటుంది. దానినే ‘దిగజారుడుతనం’అంటాం.
మనిషి వస్తుతః దివ్యత్వం కలిగినవాడే కానీ పశువుగా బతుకుతున్నాడు. మనిషిగా జీవించగల్గేవారు ఎక్కడో ఒకరు కన్పిస్తారు. ‘మనీషి’గా బతకగల్గినవారు మరీ అరుదు.
లోకమంతా అశాశ్వతం. ఈ లోకంలో ఏదీ శాశ్వత సుఖాన్నివ్వలేదు. ఆత్మ ఒక్కటే నిత్యం. అదొక్కటే నమ్ముకోదగినది.
అయితే మనిషి ఆత్మ సంగతి మరచి ప్రాపంచిక సుఖాలకై ప్రాకులాడుతున్నాడు. ఆస్తులను సంపాదించటం అనే పిచ్చిలోపడి పోతున్నాడు. లౌకిక అవసరాలను తీర్చుకోవాల్సిందే కాని అందుకోసం ఆధ్యాత్మిక విలువలను వదులుకొనటం తప్పు. సచ్ఛీలం, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక వివేకం- ఇవీ నిజమైన సంపదలు.
హృదయ వాణికి వేవ్ లెంగ్త్
మన లోపలా, బయటా వున్న ప్రకృతి భగవద్విలాసమే! ఎటన్నా చూడండి! దేన్నయినా తిలకించండి! ఆ అనంతుని సౌందర్యం, సద్భావం, జ్ఞానం, శాంతి, శక్తీసాక్షాత్కరిస్తాయి? అయితే ఆయనను గుర్తించే నైపుణ్యం మనలో కొరవడింది. అందుకే ఆయనను కానలేక ‘కానని వారంగా’ కాలం గడిపేస్తున్నాం.
మన చుట్టూవున్న వాతావరణం అంతా ప్రపంచంలోని రేడియోస్టేషన్లన్నిటి నుండీ వెలువడే తరంగాలతో నిండి వుంది. కాని, ఒక్కముక్కా చెవి సోకదు. ఆ స్టేషన్లన్నీ వున్న సంగతే మనం గమనించం. రేడియో రిసీవర్ ఒకటి నీదగ్గరుండి, దానిని నిర్ణీత వేవ్‌లెంగ్త్‌కు సరిగ్గా ట్యూన్‌చేస్తే, ఏ స్టేషను కార్యక్రమాలను వినాలనుకున్నా వినవచ్చు. సరిగా ట్యూన్ చేయలేకపోయారో, న్యూస్‌కు బదులు న్యూసెన్స్ వస్తుంది.
అలాగే భగవానులు అంతటా వున్నారు. కిందా, పైనా పక్కనాచుట్టూ దగ్గరా, దవ్వునా; ఆయనను దర్శించటానికి యంత్రంకాదు కావాల్సింది. మంత్రం! ధ్యానంలో చితె్తైకాగ్రత వుందే. అది బాండ్‌పై సరయిన స్టేషనును గుర్తించటం, ప్రేమే సరిగా ట్యూన్ చేయటం; దివ్యానందాన్ని పొందటమే చక్కగా, స్పష్టంగా స్టేషన్ ప్రసారం చేసే కార్యక్రమాలను వినటం!
సాధూనాం దర్శనం పుణ్యం
హనుమంతుడు రామలక్ష్మణులతో మధురంగా, ప్రీతికరంగా సౌమ్యంగా మాట్లాడాడు. ఆయన ప్రసంగంలోని వ్యాకరణశుద్ధి రాముడిని ఆకట్టుకొంది. ఆంజనేయుడి ప్రశ్నలన్నిటికీ వాళ్లు జవాబు చెప్పారు. వాళ్ల నిజాయితీ పట్ల హనుమంతునికి నమ్మకం కుదిరింది. వాళ్లను తన రాజువద్దకు తీసుకొనిపోవటానికి అతడు అంగీకరించాడు.
రాముని దర్శనంతో పాపాలుపోయాయి. స్పర్శనంతో పూర్వజన్మ సంచితం నశించింది. సంభాషణంతో ఆనందం పొంగిపొర్లింది.
దివ్యత్వాన్ని దర్శించిన వారందరి అనుభవం అదే!
శాశ్వతానందం
ఆనందం అంటే ఏమిటి? ఇంద్రియాల లాలసను తీర్చుకొనటం ఆనందమా? అది తాత్కాలికం. లేక, మనసును అంతర్ముఖంచేసి, సమాధిస్థితిలో పొందే ఆత్మానందం ఆనందమా? ఇది శాశ్వతమైనది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రవచించే ఆత్మానందమే ప్రాపంచికానందం కన్న మిన్న అన్న సంగతిని గ్రహించవచ్చు. విశ్వమయుని మనస్సులో నిల్పుకోవడంవల్ల ఆనందం ఎందుకు కల్గుతున్నది? భగవంతుడే ఆనంద స్వరూపం కనుక.
ఇంకా ఉంది