సబ్ ఫీచర్

బాల్యానికి భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆరోగ్యమే మహాభాగ్యం’, నేటి బాలలే రేపటి పౌరులు’ అనే నినాదాలు మనం వింటూనే ఉన్నాము. సమాజం అభివృద్ధి చెందాలంటే ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సి వుంటుంది. బాలల చిరునవ్వు జాతికే గర్వకారణమంటారు కానీ ఇటీవల ఐక్యరాజ్య సమితి వారు విడుదల చేసిన నివేదిక దానికి విరుద్ధంగా ఉంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్లకు మెరుగైన జీవితం, సౌకర్యం అందించాలి. వాతావరణంలో మార్పు వంటి సమస్యలు భవిష్యత్తులో వారికి హాని కలిగించకూడదు. దానివల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. భారత్‌లో చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని ఐక్యరాజ్యసమితి సమితి (ఐరాస) హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యూనిసెఫ్), ది లానె్సట్ మెడికల్ జర్నల్ ఏర్పాటుచేసిన 40 మంది అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. వీరు 180 దేశాలలో అధ్యయనం చేసి బాలల ఎదుగుదల సూచీ (చైల్డ్ ఫ్లరిషింగ్ ఇండెక్స్) సుస్థిరాభివృద్ధి సూచిక (సస్టెయినబిలిటీ ఇండెక్స్)ను విడుదల చేసింది. ఇండియా సుస్థిరాభివృద్ధి సూచికలో 77వ స్థానంలో నిలిచింది. పిల్లల సర్వేవల్ రేటు, సంక్షేమం, ఆరోగ్యానికి సంబంధించిన ‘్ఫ్లరిషింగ్ ఇండెక్స్’లో 131వ స్థానం పొందింది. బాలల ఎదుగుదల సూచీకి సంబంధించి ఆయా దేశాల్లో ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యం, తల్లుల ఆరోగ్యం, అందుబాటులో మాతా శిశు ఆరోగ్య సేవలు, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పేదరికం, విద్య, పోషణ, హింస నుంచి రక్షణ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. పిల్లలకు సుస్థిర భవిష్యత్తును అందించేందుకు ప్రపంచంలో ఏ దేశమూ తగినంతగా కృషిచేయడం లేదంది. అంతేకాక పిల్లలకు ఆరోగ్యకరమైన భవిష్యత్ ఇచ్చేందుకు తగిన పరిస్థితులు కల్పించడం లేదని పేర్కొంటూ మన పొరుగు వున్న శ్రీలంక (68), చైనా (43), భూటాన్ (11.3) మన దేశంకన్నా ముందుండటం గమనార్హం. పాకిస్తాన్ (14.0), బంగ్లాదేశ్ (14.2) నేపాల్ (14.4) మాత్రమే వెనుక ఉన్నాయి. ఈ జాబితాలో నార్వే మొదటి స్థానంలో నిలిచింది. శిశువుల భవితవ్యాన్ని అంధకార బంధురంగా చేసేవిగా రెండు అంశాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ఒకటి పర్యావరణ మార్పు, రెండోది పిల్లల్ని లక్ష్యంగా భావించి ప్రబలుతున్న వాణిజ్య కుసంస్కృతి బెంబేలెత్తిస్తున్నవి. నార్వే, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో శిశు సంక్షేమం మెరుగని కితాబిచ్చింది. మధ్య ఆఫ్రికా, చాద్, సోమాలియా వంటి చోట్ల అది అధమమని ఈసడించింది. టీవీలు, ఇతర మాథ్యమాల్లో వస్తున్న వేలాది ప్రకటనలు, బాలలను తప్పుదోవ పట్టిస్తున్నాయని నివేదిక హెచ్చరించింది. దీంతో చిన్నారులు చిరుతిండ్లు, శీతల పానీయాలు, ఇతర అనారోగ్యకరమైన ఆహార పదార్థాలకు ఆకర్షితులై అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు కొనితెచ్చుకుంటున్నారని తెలిపింది. 1957లో ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులు, పెద్దలు కలిసి 1.10 కోట్లమంది ఊబకాయలుంటే, 2016 నాటికి 11 రెట్లు పెరిగి ఈ సంఖ్య 12.4 కోట్లకు చేరిందని వెల్లడించింది. తప్పుడు ప్రకటనల ప్రభావం యువతపై సైతం ఉంటున్నదని హెచ్చరించింది. అల్లర్లు, వివాదాలు, విపత్తులు, క్లైమేట్ ఛేంజ్ వంటి సమస్యలు తీవ్రంగా ఉండటంవల్ల అభివృద్ధి నిలిచిపోయిన ప్రాంతాల్లో దాదాపుగా 200 కోట్లమంది పిల్లలు నివశిస్తున్నారని పేర్కొంది.
పిల్లలకు హానికర మార్కెటింగ్‌వల్ల తీవ్రమైన ముప్పు ఉందన్నది వాస్తవం. కొన్ని దేశాల్లో పిల్లలు టీవీల్లో ఒక్క ఏడాదిలోనే 30 వేల ప్రకటనలు చూస్తున్నారు. పిల్లలను ప్రభావితం చేసే ప్రకటనలపై ఆస్ట్రేలియా, కెనాడా, మెక్సికో, న్యూజీలాండ్, అమెరికా దేశాల్లో సేల్స్ రెగ్యులేషన్ విధానం సరిగాలేదట. పిల్లల రక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా పిల్లలనుంచి, పిల్లలకోసం ఒక భారీ ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని నివేదికలో నిపుణులు అభిప్రాయపడ్డారు.
పిల్లలకోసం ఏమి చేయాలంటే అన్ని దేశాలు కార్బన్‌డయాక్సైడ్ ఎమిషన్లను వెంటనే కంట్రోల్ చేయాలి. పిల్లల ఆరోగ్యం కోసం హక్కుల రక్షణకోసం అన్ని రకాల పెట్టుబడులు పెట్టి కొత్త పాలసీలు అమలుచేయాలి. పిల్లలకు హానికరమయ్యే కమర్షియల్ మార్కెటింగ్‌ను నియంత్రించాలి. మన దేశంలో జీవనశైలి వ్యాధుల ప్రకోపం, విష వాతావరణ ప్రభావం ఎంతగా ఉన్నాయంటే- ఏడు శాతానికి పైగా పిల్లలు మూత్రపిండాల వ్యాధుల పాలబడుతున్నారు. పంతొమ్మిది ఏళ్లలోపు వారిలో సుమారు 10 శాతానికి మధుమేహం దాపురిస్తోంది. ఆహార సమస్య రెండు పార్శ్వాలైన పోషకారలేమి, స్థూలకాయం ఏకకాలంలో ప్రజ్వరిల్లిన దేశాల్లో ఇండియా సైతం ఒకటి కావడం. 2015-30 మధ్య విశ్వవ్యాప్తంగా ఐదేళ్లలోపు శిశవులు ఏడు కోట్లమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని, అందులో అధమపక్షం 18 శాతం వాటా ఇండియాదే అన్నది ఐరాస భవిష్యదర్శనం! మాతృత్వానికి, బాల్యానికి గొడుగు పట్టడమే జాతి దీర్ఘకాల ప్రయోజనాల సంరక్షణకే. ఈ వాస్తవిక దృష్టిని అందరూ పట్టించుకొన్నప్పుడే భారత్ ఆరోగ్యపరంగా అగ్రదేశాల సరసన నిలబడగలదు.
ఇటీవలికాలంలో గ్రామీణుల్లో ఊబకాయం సమస్య పెరుగుచున్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఊబకాయం, అధిక బరువు పెరగటానికి 80 శాతం ఆహారపు అలవాట్లు, సంప్రదాయ ఆహారాన్ని విస్మరించడమేనని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకునే ఆహారంలో తక్కువ మోతాదులో పోషకాలు ఉండటం, అన్ని రకాల పోషకాలు కలిగిన పాలు, పాల పదార్థాలు, పండ్లు, కూరగాయలు తినకపోవడంవల్లనే ఊబకాయం, అధిక బరువు, ఎనీమియా వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రపంచంలోని బాలల్లో 20205 నాటికి 5 నుంచి 17 ఏళ్ల పిల్లల్లో 26.8 కోట్లమంది అధిక బరువు సమస్యతో సతమతమయ్యే అవకాశం ఉందట. ఊబకాయం నేడు చిన్నారులను బాధిస్తున్న ఆందోళనకర సమస్య. దీనికి కారణం ఎక్కువ తిండి, తక్కువ పని, వ్యాయామం లేకపోవడం కారణాలు. జంక్‌ఫుడ్ చిన్నారుల ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపే అవకాశమున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఐదేళ్లలోపు 50 మిలియన్ల చిన్నారులు పౌష్టికాహారంతో బాధపడుతున్నారు. ఉష్ణోగ్రతలో మార్పులు, ఆహార వనరులు మరియు సహజ వనరులను ప్రభావితం చేస్తాయి. పిల్లల ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి. మెరుగైన పోషకాహారం, సకాలంలో టీకాలు, యాంటీ బయాటిక్స్ సమకూరిస్తే ఇండియాలో లక్షల సంఖ్యలో శిశుమరణాలు అడ్డుకునే వీలుంది. అందుకే పిల్లల బాగోలు చూసుకోవటంలో ఇటు తల్లిదండ్రులు, అటు సమాజం, ప్రభుత్వం పాత్ర ఎంతో వున్నది.

- కె. రామ్మోహన్‌రావు