సబ్ ఫీచర్

జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖంతో పాటు జుట్టుకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు మహిళలు. కొందరు జుట్టే తమ స్టేటస్ సింబల్, స్టైలిష్ ఐకాన్ అన్న ఆలోచనలో కూడా ఉంటుంటారు. వయస్సు పెరిగే కొద్దీ కొంచెం రాలినట్లు కనిపించినా, ఏమాత్రం అనారోగ్యకర లక్షణాలు ఎదురైనా మానసిక క్షోభకు గురవుతుంటారు. ఒక్కోసారి జుట్టు అనారోగ్య లక్షణాలు, శరీరంలో ఇతర వ్యాధుల ఉనికిని కూడా సూచిస్తుంటాయి. మురికి, కాలుష్యం మరియు ఇతర మలినాలతో కూడిన హెయిర్ బ్యాండ్ల వాడకం, రసాయనాల వాడకం జుట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎప్పటికప్పుడు తలస్నానం చేయడం వంటివి చేయరు. తరచూ తలస్నానం చేస్తూ, కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా జుట్టును ఎప్పటికీ ఆరోగ్యకరంగా ఉంచుకునే వీలుంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహార ప్రణాళిక, జీవనశైలి పూర్తిగా జుట్టుపై ప్రభావాన్ని కలిగిస్తుందని వేరే చెప్పనవసరం లేదు కదా! కాబట్టి ఆహారంలో కూరగాయలు, ఆకుపచ్చని ఆకుకూరలు, తృణధాన్యాలు వంటి పోషకాలతో కూడిన ఆహారాలను జతచేసుకోవాలి. కొన్ని రకాల జుట్టు ఉపకరణాలు జుట్టును ఎంతో అందంగా మలిస్తే, కొన్ని స్టైల్‌తో పాటు జుట్టు ఆరోగ్యంపై, ముఖ్యంగా జుట్టు మూలాలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే.. జుట్టును వారంలో కనీసం రెండు, మూడు సార్లైనా శుభ్రపరుచుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు, జుట్టు ఆరోగ్యం కోసం సరైన పోషకాలతో కూడిన ఆహార ప్రణాళికను అవలంభించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్, క్రమం తప్పకుండా నూనెలను ఉపయోగించడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవచ్చు. క్రమంగా జుట్టును ఇదివరకులా కాకుండా ఇంకాస్త అందంగా, ఆరోగ్యకరంగా కూడా మలచవచ్చు. కానీ కొన్ని స్వయంకృతాలే జుట్టు అనారోగ్యానికి కారకాలుగా ఉన్నాయి. కానీ తలస్నానం చేసిన తర్వాత కూడా చేయదగిన, చేయకూడని పనులంటూ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దామా..
చేయాల్సిన పనులు
* సాధారణ తువాలు కన్నా టీ-షర్ట్ తడిజుట్టును పొడిగా చేయడంలో చక్కగా పనిచేస్తుంది. తువాలు
కుదుళ్లకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. కానీ టీ-షర్టును ఉపయోగించడం మూలంగా ఈ సమస్యలు కలుగకుండా చేయవచ్చు.
* జుట్టు ఆధారితంగా కండీషనరును ఎంచుకోవాలి. అది జుట్టును నునుపుగా, మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయం చేస్తుంది. తలస్నానం తరువాత తడి జుట్టుపై కండీషనర్ ఉపయోగించడం మంచిది.
* అనేకమంది సాధారణంగా చేసే తప్పు ఏంటంటే చిక్కులు పడిన జుట్టును తొలగించడానికి దువ్వెన లేదా బ్రష్షును ఉపయోగిస్తారు. ఆ అలవాటును మానేయాలి. జుట్టు తడిగా ఉందా, పొడిగా ఉందా అనే సంబంధం లేకుండా జుట్టును ఎప్పుడూ వేళ్లను ఉపయోగిస్తూ తీయడం వల్ల జుట్టు విచ్చిన్నం కాకుండా చూసుకోవచ్చు.
చేయకూడనివి
* తడి జుట్టును పొడిచేసే క్రమంలో చాలామంది బ్లో డ్రైయర్‌ను వినియోగిస్తుంటారు. సత్వరం జుట్టును పొడిగా చేయడానికి ఉత్తమంగా పనిచేస్తుందనుకుంటారు. కానీ బ్లో డ్రైయర్‌ను వినియోగించడం వల్ల జుట్టు అనారోగ్యానికి గురవుతుంది. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు దృవీకరిస్తున్నారు. బ్లో డ్రైయర్ ద్వారా ఉత్పన్నమయ్యే వేడి, జుట్టు నుంచి తేమను దూరం చేసి పొడిగా చేస్తుంది. తరచుగా వినియోగించడం వల్ల జుట్టు పెళుసుగా మారుతుంది. క్రమంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
* తడిజుట్టును కడుతున్నారా? తడిజుట్టుతోనే జడ వేసుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా ఆపవలసిన చర్య. ఈ సమయంలో జుట్టుపై ఏ ఇతర ఉపకరణాలను ఉపయోగించినా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. తలస్నానం వెంటనే కూడా జుట్టును ముడికట్టకూడదు.
ఇలా తలస్నానం చేశాక జుట్టుకు తగిన కండీషనర్ల వాడకం, ఆహార ప్రణాళికలలో, జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే జుట్టు ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. *