సబ్ ఫీచర్

అన్ని వ్యవస్థల్లోకి చొచ్చుకు పోయన అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వం పాలనా సిద్ధాంతాల నుండి దూరంగా జరిగిపోతోందని పలువురు ప్రభుత్వ పాలనా సిద్ధాంతకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకోసం ప్రభుత్వం అనే ప్రాథమిక సిద్ధాంతానికి విరుద్ధంగా ప్రభుత్వం కోసం ప్రజలు అన్నట్లుగా తయారైంది. ప్రభుత్వం ఏర్పాటు జరిగింది మొదలుకొని ప్రజలకి ఇబ్బందులు ఇక్కట్లు మొదలయ్యాయని విమర్శలు బయల్దేరాయి. నవ్యాంధ్ర రాష్టవ్య్రాప్తంగా వివిధ శాఖలు వాటి వాటి అధికారులు అంతా ఏదేదో జరుగుతున్నట్లుగా భ్రమింపచేయాలని నానా తంటాలు పడుతున్నట్లు ఉంది. మన రాష్ట్రంలో పరిపాలన అంతా అభూతకల్పన మీదనే నడిచిపోతోంది. అంతా అర్థంకాని గందరగోళం ఎవరేం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఎలా చస్తున్నారో ఎవరికీ ఏమీ అర్థంకాదు. అంత పరుగే పరుగో పరుగు. ఆగకుం డా ఆపకుండా పరుగో పరుగు ఎందుకో? ఏమో! ఎవరికోసం? ఏమో! ఎందాక? ఏమో? అంతా ఏమో ఎందుకో ఎంతవరకో ఎవరికీ ఎవరు చెప్పలేకపోతున్నారు. అంతా అందరూ పరుగో పరుగు? పరిగెత్తి సాధించిందేమిటో ఎవరికీ అర్థంకాదు. రాష్ట్రంలో ఆదాయం అప్పులు ప్రభుత్వ నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించే ఏ ప్రయత్నమూ ప్రభుత్వ పెద్దలు చేసుకోవట్లేదు. ఆదాయం, ఖర్చు, అప్పులు ప్రభుత్వ నిర్వహణ వ్యయం మంత్రుల జీతభత్యాలు, శాసనసభ్యులు ఎంత ఏ విధంగా ఇస్తున్నారో ఇంతవరకూ ప్రభుత్వం ఏమీ చెప్పటంలేదు.
ఆర్థిక పరిస్థితి అధ్వాన్నం అయితే సరే! ఎలా చక్కదిద్దాలి? ఎటువంటి రంగానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎటువంటి వాటిని పెంచాలి. తగ్గించాలనే విషయంపై ప్రజలకి అవగాహన కల్పించి ప్రజలకి అవసరమైన పారదర్శకతని ప్రదర్శించాలి. రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ రెవిన్యూ వసూళ్ళు ప్రభుత్వ ఖర్చులు ఇతరత్రా జీతభత్యాలు పెన్షన్‌ల వంటి వాటిపై తప్పకుండా ప్రభుత్వ పాలకులు అవగాహన కల్పించాలి. ఖర్చులు రాబడి మధ్య వ్యత్యాసాన్ని చూపాలి. పొదుపు చర్యలు చేపట్టాలి.
ప్రస్తుత పరిస్థితులో ప్రభుత్వం ప్రజలనుండి దూరం అయిందనే చెప్పాలి. రాష్ట్రంలో వున్న స్థితిలో ఎవరైనా ముఖ్యంగా ధరల అదుపు చేయటం ధరలు పెరగకుండా నియంత్రించటం, అక్రమ సరుకు నిల్వలపై తగినంత విజిలెన్స్ దాడులు నిర్వహించి మార్కెట్‌లో ధరలు అదుపుకై సరుకులు విడుదల చేయాలి అనే సంగతిని పూర్తిగా విస్మరించారు. ప్రభుత్వం ఎపుడైతే తన ఉద్యోగుల ద్వారా చేయవలసిన పనులు చేయకుండా ఉద్యోగులవద్ద తన అవినీతి ధోరణిని ప్రదర్శిస్తుందో అప్పటినుండి పతనం ప్రారంభం అవుతుందని ప్రభుత్వ పాలన సిద్ధాంతాలు చెబుతున్నాయి. వాస్తవంగా అధికారులు చాలామంది అవినీతి మార్గానికి అలవాటుపడిపోయి అటు రాజకీయ నాయకులకి కాసులు వసూలుచేసి పెట్టే వారుగా వ్యవహరించి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల ప్రాపకం సంపాదించి మెచ్చుకోలు మాటలతో వారిని తమ చెప్పుచేతల్లో పెట్టి వీరు ప్రత్యేక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించి లక్షల నుండి కోట్లు వందల కోట్లు వసూళ్ళుకి పాల్పడుతూ ఉన్న వైనం మనం చూస్తున్నాం. ఒక పక్క రాజకీయ నాయకులు వారికి కాళ్ళు ఒత్తే అధికార యం త్రాంగం అందరూ షరీకైపోయి ప్రజాధనాన్నిలూటీ చేసు తన్న వైనాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారి ఏకంగా ఐదువందల కోట్ల రూపాయల ధనానికి పగడలెత్తాడంటే అతని వెనుక ఏ స్థాయి వ్యక్తుల అండదండలున్నాయో ఎవరికైనా అర్థమవుతుంది. కాల్‌మనీ వ్యవహారాన్ని చూస్తుంటే ఇవన్నీ ముందుగా ప్రభుత్వానికి తెలియకుండా ఇంత స్థాయి దుర్మార్గాలు జరుగుతున్నాయా అన్నది ప్రశ్నార్థకమే. ఎవరో మహిళ ఫిర్యాదు ఇస్తే తాము ఎంక్వైరీ చేస్తున్నామని ఎపీ ముఖ్యమంత్రి చెప్పటం ఎంతవరకూ బాధ్యతను నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది.
స్ర్తిలని లైంగికంగా వేధిస్తున్న దుర్మార్గుల గురించి సమాచారం ముందుగా పసిగట్టి పట్టించే ఇంటిలిజెన్స్ డిపార్టుమెంటు వారందరూ ఏం చేస్తున్నట్టు? వీరంతా ఎవరికి కాళ్ళు ఒత్తుతున్నట్టు? వీరందరూ తమతమ నిఘా కార్యక్రమాలు ఏ స్థాయిలో చేస్తున్నట్లు? మన స్టేట్ ఇంటిలిజెన్స్ వారికి సి.ఐ.డి వారికి ఇంతింత నేరాలు ఘోరాలు జరుగుతుంటే పసికట్టే ముందస్తు వ్యవస్థలు ఉన్నట్టా లేనట్టా? ఉండీ లేనట్లా? ఇటువంటి వైఫల్యాలపై ఏపీ ప్రభుత్వం ఇచ్చే వివరణ ఏమిటి అన్నది ప్రజలు కోరుతున్నారు. రాష్టవ్య్రాప్తంగా రాజకీయ నాయకులు చోటా నుండి మోటా వరకూ అందరూ అనునిత్యం పరిపాలనా వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయి ఉద్యోగులని వారి వారి విధులు సక్రమంగా నిర్వహించనివ్వటం లేదు. అందరికీ ఎవరో ఒకరు రికమెండేషన్స్. ఏ సీటులో ఏ పోస్టులో అదనపు ఆదాయం వస్తుందో ఆ సీటుకోసం ఎంతకైనా తెగించే ఉద్యోగులు ఉంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అనేక డిపార్టుమెంట్లు అవినీతి కాసారాలుగా తయారయ్యాయి. విద్యుత్‌శాఖని రాష్ట్రంలోస్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాలంలో క్రమేణ ఏటా ఖర్చు పెట్టిన సొమ్ము లక్షల కోట్లయినప్పటికీ ఏర్పడిన ఆస్తులు వస్తువులు అంటే ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు, టవర్లు, సేబ్‌స్టేషన్లు వగైరాలు స్థూల విలువ లక్షల కోట్లల్లో ఉన్నప్పటికీ ప్రస్తుత పాలకులు గత పాలనా కాలంలో కేవలం 17000 కోట్లకి అమ్మకం చేశారంటే పారదర్శకత ఏ పాటిదో అందరికీ అర్థం అవుతుంది. అందరూ నీతిపరులే కానీ అవినీతిని అలవాటుగా చేసుకొని నీతిపరంగా వాక్యాలు వల్లెవేస్తుంటారు.

- పిడుగు రామలింగయ్య