సబ్ ఫీచర్

కిడ్నీ వ్యాధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ శరీరంలో ద్రవాలను వడపోసే అత్యంత ముఖ్యమైన భాగంగా కిడ్నీ కీలకపాత్ర పోషించడం జరుగుతుంది. రక్తంలో చేరే మలినాలను ప్రమాదకర పదార్థాలను శుద్ధి చేసి బయటకు పంపి శరీర అవయవాలలో కిడ్నీ కీలకమైంది. దాని పనితీరు ఆధారంగా మిగతా శరీరభాగాలు సమతుల్యం చెంది సమర్థవంతంగా పనిచేసి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. ప్రస్తుత కాలంలో అత్యాధునిక వైద్యపద్ధతులు ఎన్ని వచ్చినా ఆందోళన కలిగించే దీర్ఘకాల వ్యాధుల జాబితాలో కిడ్నీ సమస్య ఒకటి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేధిస్తోంది. కిడ్నీ వ్యాధులకు అనేక కారణాలు ఉన్నా ప్రధానంగా జీవనవిధానంలో మార్పులు, నొప్పుల మాత్రలు ఎక్కువగా వాడటం, అధిక రక్తపోటు, షుగరు, గాలి, నీటి కాలుష్యంతో పాటు శరీరంలో ఇతర అవయవాల పనితీరు దెబ్బతిన్నప్పుడు కూడా ఆ ప్రభావం కిడ్నీ మీద పడి దాని పనితీరు దెబ్బతిని కిడ్నీ వ్యాధి బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది.
మనదేశంలో 10 కోట్ల మంది కిడ్నీ బాధితులు ఉండగా, ఏటా రెండు లక్షల మంది కొత్తగా కిడ్నీ వ్యాధుల బారినపడుతున్నట్లు అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 850 మిలియన్‌ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంతర్జాతీయ వైద్య ఆరోగ్య గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి ఏటా దీర్ఘకాల కిడ్నీ వ్యాధులతో 2.4 మిలియన్‌ల మంది చనిపోతున్నట్లు అంచనా వేయగా, ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా నిర్థారణ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో 2040 నాటికి మరణాల్లో 5వ స్థానాన్ని ఈ వ్యాధివల్ల చనిపోయిన వారే ఆక్రమిస్తారని ప్రపంచ ఆరోగ్య అధ్యయనాలు పేర్కొంటున్నాయి. సగటున ప్రపంచవ్యాప్తంగా 11 శాతం, మనదేశంలో 16 శాతం ప్రజలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ధనిక దేశాల్లో డయాలసిస్, కిడ్నీ మార్పిడికి వారి ఆరోగ్యబడ్జెట్‌లో 2-3% వినియోగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కిడ్నీ సమస్యలకు గురైనప్పుడు వారికి అందించాల్సిన వైద్యసేవలు అందుబాటులో లేక ప్రాణరక్షణ లేక మరణాలకు దగ్గరవుతున్నారనేది విచారించదగ్గ విషయం.
కిడ్నీ వ్యాధుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి లక్షణాలను తెలియజేస్తూ నివారణ చర్యలు చేపట్టడానికి కేంద్ర, రాష్ట్ర, జిల్లా వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ప్రతీ సంవత్సరం ఈ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉచిత డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచుతూ కిడ్నీ మార్పిడి సౌకర్యాన్ని కల్పించాలి. శుద్ధి చేసిన మంచినీటిని ప్రతి కుటుంబానికి అందించాలి. కిడ్నీ సమస్యల నివారణకై పాఠశాల స్థాయి విద్యార్థులకు కేరళ తరహా ‘వాటర్ బెల్’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా విద్యాశాఖలు అమలు చేయాలి. మూత్రపిండాల పనితీరు మందగిస్తున్న విషయాన్ని తెలియజేస్తూ కొన్ని లక్షణాలు బయటపడతాయి. అందుచేత ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పనిచేసే బృందం ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా వైద్యశాఖ చర్యలు చేపట్టాలి.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో నాణ్యమైన ఉచిత చికిత్సా సదుపాయాలతో పాటు మందులు అందించాలి.

- సంపతి రమేష్ మహరాజ్