సబ్ ఫీచర్

ధార్మిక సందేహాలు ( ధర్మజిజ్ఞాస)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శుక్లాం భరధరం.. శ్లోకం అర్థం ఏమిటి?
ఇంట్లోగాని, దేవాలయాల్లోగాని ఏ వైదిక కార్యం జరిగినా విఘ్నేశ్వరుడినే మొదట పూజించే సంప్రదాయం మనది. పూజ ప్రారంభంలో మొట్టమొదట ఈ శ్లోకం చదవడంవల్లనేమో, ఈ శ్లోకం అందరికీ సుపరిచితమై ప్రసిద్ధంగా మారింది. నిజానికి ఈ శ్లోకంలో విఘ్నేశ్వర ప్రార్థనకన్నా పరమాత్మ ప్రార్థన ఉన్నట్లనిపిస్తుంది. ఇంకో విశేషమేమిటంటే, హిందువులు తమ సంప్రదాయంలో మొట్టమొదట దేవతా ప్రార్థనకన్నా, పరమాత్మ ప్రార్థన చేసినట్లు తోస్తుంది. పూర్ణ గాయత్రీ మంత్రంలా ఇది 32 అక్షరాల మంత్రం. ఈ శ్లోకం గణపతికే కాకుండా శ్రీమహావిష్ణువు రూపం తెలిపేవిధంగా అన్వయించబడింది. ఈ శ్లోకార్థం గమనిస్తే పై విషయాలు స్పష్టమవుతాయి.
శుక్ల=స్వచ్ఛమైన, అంబర= ఆకాశాన్ని, ధరం=్ధరించిన, శశివర్ణం=చంద్రుని వంటి కాంతి కలిగిన, చతుర్భుజం= నాలుగు భుజాలుగలవాడు, ప్రసన్నవదనం=చిరునవ్వులొలికించే ముఖం కలవాడు. ప్రసన్నము అన్న పదానికి ఏనుగు అనేఅర్థం వుండడంవల్ల ఏనుగు ముఖం కలవాడని, ఇది గణేశుని స్తుతి అని కొందరు పండితుల అభిప్రాయం. విష్ణుం=సర్వ వ్యాపకుడైన (విష్ణువును), ధ్యాయేత్= ధ్యానిస్తున్నాను. స్వచ్ఛమైన తెల్లని వస్త్రాన్ని ధరించి చంద్రునివంటి కాంతి కలిగిన నాలుగు భుజాలను కలిగి, ప్రసన్న వదనం కలిగి అంతటా వ్యాపించిన శ్రీమహావిష్ణువు, అన్ని అడ్డంకులను తొలగించి శాంతిని కలిగించుగాక- అని ఈ శ్లోక భావం. విష్ణువు పరంగా ఇలా వుంటే పరమాత్మ పరంగా ‘స్వచ్ఛమైన తెల్లని వస్త్రాన్ని ధరించి, చంద్రునివంటి కాంతి కలిగి, చుతుర్విధ పురుషార్థాల్లా, నాలుగు వేదాల్లా, నాలుగు భుజాలు కలిగి ప్రసన్నవదనం కలిగి అంతటా వ్యాపించి వున్న ధర్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానిస్తున్నాను’ అంటూ అర్థం చెప్పవచ్చు. శైవ వైష్ణవమ మత సంఘర్షణలవల్ల శుక్లాం భరథరం.. శ్లోకాన్ని విష్ణువు పరంగా అన్వయం చేస్తున్నారని వాదించేవారూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ శ్లోకం వినాయకుడికి సంబంధించినదని భావించేవారు ఎక్కువ. కానీ ఇందులో వినాయకుడికి సంబంధించిన రూప విశేషాలు లేకపోవడం గ్రహించాలి.
* ఎందరో దేవతలున్నా వినాయకుడికే మొదటి పూజార్హత ఎందుకు?
శివగణాధిపత్యం, విఘ్నాధిపత్యం కోసం గజానన, షడాననులిద్దరూ పోటీపడి, ఆధిపత్యం నిర్ణయం చేయమని తమ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్లారు. భూమిపైన కల అన్ని తీర్థక్షేత్రాలను ఎవరు ముందు సందర్శిస్తారో, ఎవరు ముందు భూప్రదక్షిణ చేస్తారో వారికే శివగణాధిపత్యం, విఘ్నాధిపత్యం లభిస్తుందని ఉమామహేశ్వరులు చెప్పారు. కుమారస్వామి నెమలి వాహనంపైనా, వినాయకస్వామి మూషిక వాహనంపైన ఎక్కి సమస్త భూమండల ప్రదక్షిణకు బయలుదేరడానికి సిద్ధమవుతారు. కుమారస్వామి సాహసం చేసి ముందుకు సాగారు కానీ, వినాయకుడు మాత్రం తాను స్థూలకాయంతో ఈ చిన్ని మూషికంపై ప్రదక్షిణం చేయలేనని తల్లిదండ్రులతో మొరపెట్టుకుంటే, వారు నారాయణ మంత్రోపదేశం చేశారు. సర్వజగత్తును పరిపాలించే ఉమా మహేశ్వరుల్లోనే సమస్త తీర్థక్షేత్రాలు దాగివున్నాయని భావించిన విఘ్నేశ్వరుడు నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. దాంతో కుమారస్వామికి ప్రతి క్షేత్ర తీర్థంలో వినాయకుడే ముందు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న షడాననుడు తల్లిదండ్రుల వద్దకువెళ్లి విఘ్నాధిపత్యం, శివగణాధిపత్యం వినాయకుడికే ఇవ్వాల్సిందిగా కోరాడు. అప్పటినుంచి వినాయకుడు విఘ్నాధిపతిగా, విఘ్నేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. విఘ్న నివారణ కోసం వినాయకుణ్ణి మొదట పూజించే సంప్రదాయం ఏర్పడింది. వినాయక పూజనే వైష్ణవ సంప్రదాయంలో ‘విష్వక్సేన పూజ’గా భావిస్తారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేనుడు సర్వసేనాయకుడు. తన పరివారంలో ఎందరో గజముఖులను కలిగినవాడు. సర్వవిఘ్న నివారకుడు. ఈయనను కూడా భాద్రపద శు.చతుర్థినాడే సర్వవిఘ్నాల నివారణకు పూజిస్తారు. ‘గణానాం త్వాం గణపతిం హవామహే..’ అన్న ఋగ్వేదమంత్రం బృహస్పతికి సంబంధించినదైనా, ఈ మంత్రం కూడా వినాయకుడికే అన్వయించబడింది. గణపతి విఘ్న నివారకుడు, విఘ్నకారకుడు కాబట్టి మొదట ‘అవిఘ్నం’కోసమే వినాయకుణ్ణి పూజిస్తారని చెబుతారు. వైష్ణవ సంప్రదాయంలో వినాయకుడిని, షడానుణ్ణి, హయాననుణ్ణి విష్వక్సేనుడి క్రింది సేనానులుగా చెప్పడం జరిగింది.
ఇంకాఉంది

డా॥ పి.భాస్కరయోగి