సబ్ ఫీచర్

ఇది మూడవ ప్రపంచ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుద్ధతంత్రాలు విచిత్రంగా ఉంటాయి. స్పెయిన్ దేశ చరిత్ర చదవండి.. యూరపులో యుద్ధాలు జరిగినప్పుడు అంటువ్యాధుల కంబళ్లు ఉపయోగించారు. ఒక వ్యక్తికి ఆటలమ్మ(స్మాల్‌పాక్స్) వచ్చిందనుకోండి, అతని మీద కొన్ని దుప్పట్లు కప్పాలి. ఇలా దుప్పట్లలో సూక్ష్మజీవులు ప్రవేశిస్తాయి. ఈ దుప్పట్లను శత్రుదేశాలకు పంపుతారు. ఇక విషకన్యలను పంపటం మరొక యుద్ధ తంత్రం. దీనిని చాణక్యుడు తన అర్థశాస్త్రంలో వివరించాడు కూడా. కొద్దికొద్ది మోతాదులతో విషాన్ని ఒక స్ర్తికి ఎక్కిస్తారు. ఆ అందగత్తెను శత్రురాజుల మీదికి ప్రయోగిస్తారు. ఈ విధంగా శత్రు రాజ్యాలను పాదాక్రాంతం చేసుకోవచ్చు. కొద్దికాలం క్రితం పాకిస్తాన్ కొందరు విష కన్యలను భారత సైన్యంమీదికి ప్రయోగించింది. అయితే వారిని భారత నిఘా విభాగంవారు అరెస్టుచేశారు. శశిధరూర్ అనే తిరువనంతపురం పార్లమెంటు సభ్యుని మీద పాకిస్తాన్ విషకన్యను ప్రయోగించింది. ఇది ఇటీవలి చరిత్రయే. రాహుల్‌గాంధీ మీద ఇద్దరు విషకన్యలను ప్రయోగించినట్లు ఏషియన్ ట్రిబ్యూన్ అనే పత్రిక రిపోర్టుచేసింది. వారి పేర్లు 1) నోయల్ జహర్ 2) వెరోనిక్ కార్టల్లీ. ముఖ్యంగా యుద్ధరంగంలోని సైన్యాధికారుల మీద, దేశ ప్రధానుల మీద ఇలా విషకన్యలను ప్రయోగించే సంప్రదాయం ఉంది. ప్రొఫూమో అనే బ్రిటన్ మంత్రి మీద క్రిస్టినాకీలర్ అనే విషకన్యను లోగడ ప్రయోగించారు బిల్‌క్లింటన్. నెహ్రూ, నాజర్, నిత్యానందస్వామి, రాధామనోహర్‌దాస్ వంటి వారిపైన కూడా విషకన్యల ప్రయోగం జరిగింది.
మూడవ ప్రపంచ యుద్ధంలో ఆర్థిక రంగం కీలకపాత్ర పోషిస్తున్నది. ఇటు కమ్యూనిస్టుదేశాలు అటు బూర్జువా దేశాలు తృతీయ ప్రపంచ దేశాలను ఆర్థికంగా వంచిస్తాయి. హింసిస్తాయి. అప్పులు ఇచ్చి చక్రవడ్డీలు కట్టి చిన్నచిన్న దేశాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటాయి. దక్షిణ ఆసియాలో భారత్ బలమైనశక్తిగా ఎదగకుండా ఉండే నిమిత్తం అమెరికా అధ్యక్షులు నిక్సన్ లాంటివాళ్లు పాకిస్తాన్ అనే విషకన్యను ప్రయోగించారు. ఇక చైనా ఊహాన్ ప్రావిన్స్‌నుండి ఊహాతీతంగా ఒక మహమ్మారిని సృష్టించి 2020లో ప్రపంచం మీదికి వదిలింది. ఈ జనసైడ్ బాధ్యత నుండి జిన్‌పింగ్ తప్పించుకొనజాలడు. ఇటలీ రోమన్ కేథలిక్ దేశం. అది వాటికన్ పోపు సామ్రాజ్యంలో అంతర్భాగమే. చైనా, ఇరాన్, ఇటలీలలో కరోనావైరస్ (కోవిడ్-19) మృతుల సంఖ్య అధికంగా ఉంది ఎందువలన? ‘ప్రార్థనలు చేయుడీ’! మీ రోగములు నయమగును’ అనే ఫ్రాంకోముల్లక్కర్ టి. సతీశ్‌కుమార్, విజయకుమార్‌లు ఈ కరోనా వైరస్ స్వైన్‌ఫ్లూను ఎయిడ్స్‌లను ఎందుకు ఎదుర్కోలేకపోయారు?
గొడ్డుమాంసం తినే యూరప్‌లోను, గబ్బిలాలు, పాములు తినే చైనాలోను ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించింది. సౌదీ అరేబియాలో స్నానం చేయరు. అందుకు నీటి కొరత కారణం కావచ్చు. అపరిశుభ్రమైన నీచు తింటారు. ఒక మనిషిని తృప్తిపరచడానికి ఒక భార్య చాలు. పది మంది ఎందుకు? పాత నిబంధనలో సాలమన్‌కు వెయ్యిమంది భార్యలున్నట్లు ‘రాజులు’ అదే ప్రకరణంలో వ్రాయబడి ఉంది. ఇందులో ఏదైనా సింబాలిజం ఉండవచ్చునని అనిపిస్తున్నది. సాలమన్ అంటే సోలార్‌మన్. మరి ఉస్మాన్ ఆలీఖాన్ జనానాలో వందలాది స్ర్తిలు ఎలా ఉన్నారు? ఇవన్నీ విలాసాలు కావు. విధ్వంస హేతువులు. ఎయిడ్స్ వంటి వ్యాధులు ఇలాగే వ్యాపిస్తాయి. కరోనా వైరస్ వలన స్కూళ్లు, సినిమాహాళ్లు, పర్యాటక రంగాలు మూతపడ్డాయి. వాటికన్, తిరుపతి, మక్కాలు వెలవెలబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే లక్షల బిలియన్‌ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇండియాలో పది రూపాయల నోటు తన కొనుగోలు శక్తిని కోల్పోయింది. ‘పుకార్లు వ్యాప్తి చేయకండి’, ‘ప్రజలను భయపెట్టకండి’ అంటున్నారు. హైదరాబాదు క్వరంటీన్ నల్లకుంట, గాంధీ(ముషీరాబాదు)లలో వైరస్ వ్యాధి పీడితులు ముఖ్యంగా సౌదీనుండి వచ్చినవారు ఉండటం నిజం కాదా? ఇందులో వదంతులేమున్నాయి? చైనా చేసిన పాపం మానవాళికి శాపంగా మారింది. చైనావద్ద అణ్వస్త్ర, జలాంతర్గాములూ, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నాయి. అవి ఇవ్వాళ తమ దేశ ప్రజలను రక్షించగలవా? చెప్పండి! డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాడు. ఇండియా కూడా అంతే. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌లో ప్రస్తుతం 12వేల మరణాలు, లక్ష ఇరవై వేల కరోనా కేసులు నమోదు అయినాయి. ఆరోగ్య నియమాలు పాటించకుండా నమాజు పేరు తో మసీదులకుపోతే ఈ సంఖ్య పెరిగి లక్షల మరణాలు చూడవలసివస్తుందని టీవీలో యాంకర్ ప్రకటించింది. ‘‘చైనావైరస్’’ ఇరాన్ ఇటలీలను కబళిస్తున్నది. ఎందువలన?
ఎవరు ఔనన్నా కాదన్నా ఒకటిమాత్రం నిజం. హల్లెలూయా పాటలు ఇటలీని కాపాడలేకపోయాయి. అల్లాహో అక్బర్ నినాదాలు ఇరాన్‌ను రక్షించలేవు. బాబాలు చీచీలు ముంబయిని చైనా వైరస్‌నుండి ఎందుకు బతికించలేకపోతున్నారు? సూటిగా జవాబు చెప్పండి. డబ్బుకోసం కక్కుర్తి పడకండి. పూజలు ఆపవద్దు. కాని తిరుమలలో దర్శనాలు ఆపండి. ఇవన్నీ తెలిసే భారతీయులు పూర్వం ప్రతిరోజూ ఇంట్లో యజ్ఞం చేసేవారు. ఎవరి ఇంట్లో యజ్ఞం జరుగుతుందో అక్కడికి సూక్ష్మజీవులు అంటువ్యాధులు రావు. కాని ఐలయ్యలు, కారత్‌లు, కరుణానిధులు ఎలాంటి నీచమైన భాషలో యజ్ఞాలు చేసేవాళ్లను నిందించారో మనకు తెలుసు.
షెపర్డ్‌గారూ!, పాస్టర్‌గారూ!
ఈ మహమ్మారినుండి వాటికన్‌ను రక్షింపవలసిందిగా ప్రార్థించండి. టి.సతీశ్‌కుమార్‌ల సామూహిక ప్రార్థనలు స్వస్థతా కూటములు ఇవ్వాళ మానవాళిని కరోనా, స్వైన్‌ఫ్లూ, ఎయిడ్స్, కాన్సర్‌నుండి ఎందుకు రక్షించలేకపోతున్నాయో శాస్ర్తియంగా సమాధానం చెప్పండి. స్వయంగా పోపుగారే జలుబు జ్వరంతో బాధపడుతున్నట్లు వాటికన్ నుండి వార్తలు లీకయినాయి. ప్రపంచం మీదికి కరోనా వైరస్‌ను చైనా వదిలింది. 2019 నవంబరులో బీజింగ్‌లోని వైద్యులు హెచ్చరిస్తే ‘పుకార్లు వ్యాప్తిచేస్తున్నారు’ అంటూ జిన్‌పింగ్ అనే నియంత ఆ శాస్తజ్ఞ్రులను శిక్షించాడు. ఈ పాప ఫలం ఇప్పుడు మొత్తం ప్రపంచం అనుభవిస్తున్నది. వేల బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ నష్టం పరిహారాన్ని ప్రపంచం చైనా నుండి వసూలు చేసుకోవాలి.
ఈ సందర్భంగా మనం కొన్ని సంఘటనలను పరిగణనలోనికి తీసుకుందాం.
ఇక రెండవ సంఘటన కేరళలో జరిగింది. అక్కడికి ఇద్దరు బ్రిటన్ క్రైస్తవులు, భార్యాభర్తలు వచ్చారు. వారికి కరోనా ఉన్నట్లు వైద్యపరీక్షలలో నిర్ధారణ అయింది. ఈ లోపల వారు కొచ్చిన్ పారిపోయి ఎమిరిటస్ విమానంలో దుబాయికి పోతూ ఉండగా నిఘా విభాగంవారు వలవేసి పట్టుకొని ఎర్నాకులం హాస్పటల్‌లో చేర్పించారు. (16-3-2020). దీనిని బట్టి అటు చైనా, ఇటు క్రైస్తవ, ఇస్లామిక్ దేశాలు కరోనా రక్తబీజునితో పోరాడలేక పోతున్నారు. అంతేకాదు ఇందులో బయోలాజికల్ వార్ ఏదో నడుస్తున్నట్లు అనుమానం కలుగుతున్నది. చైనా బ్రిటన్ ఇటలీ దేశాలు ఇందుకు బాధ్యత వహించాలి. ఇప్పటివరకు (మార్చి 3వవారం) నమోదైన కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా చైనాలో 49.5 శాతం రిజిస్టర్ కావటంతోబాటు ఈ వైరస్ ఇక్కడినుండే ఎగుమతి చేయబడింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్థికనష్టానికి చైనా పూర్తి నష్టపరిహారం చెల్లించేటట్లు యు ఎన్‌ఓ తక్షణ చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆర్థిక మాంద్యం మరింత పెరిగి కిలో బియ్యం వెయ్యి రూపాయలకు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. నరేంద్ర మోడీ 15-3-2020నాడు ఈ మహమ్మారిపై నిర్వహించిన సార్క్ సమావేశాలకు పాకిస్తాన్ ప్రధాని స్పందించకపోవటం ఇస్లామిక్ వ్ఢ్యౌనికి మరో నిదర్శనం.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్