సబ్ ఫీచర్

ఆయుర్వేదంపై అవగాహన పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాడు యావత్ ప్రపంచానికి దిక్సూచిగా పనిచేసిన ఘనత భారతదేశానికే దక్కుతుంది. అయి తే, అదే భారతదేశం ప్రస్తుతం పలు రంగాలలో చుక్కాని లేని నావలా సాగుతున్నది. పాశ్చాత్య దేశాలు నేడు ఎంతో అభివృద్ధి చెంది, అన్ని రంగాలలో దూసుకెళ్తున్నాయి. దీనికి కారణం, పాశ్చాత్యులు సైన్స్‌ను మతం, రాజకీయాలు నుంచి వేరుచేయడమే. అదే మన దేశంలో మతం చుట్టూ రాజకీయాలు, సైన్స్ పరిశోధనలు జరుగుతున్నాయి. మన రాజ్యాంగంలో మనది లౌకిక రాజ్యమని చెప్పుకొన్నప్పటికీ, ఓట్లకోసం అన్ని రాజకీయ పార్టీలు మతపరమైన విషయాలను పట్టించుకోవు. మతతత్వ సంస్థలు సేవా కార్యక్రమాల ముసుగులో మత మార్పిడులకు పాల్పడినా పట్టించుకోరు.
యావత్ ప్రపంచానికి శస్తచ్రికిత్స అంటే ఏమి తెలియని రోజులలోనే సుశ్రుతుడు అనే ఆయుర్వేద వైద్యుడు పలు శస్త్ర చికిత్సలు నిర్వహించాడు. నేడు ప్రపంచంలో అత్యంత ఎక్కువగా జరుగుతున్న సర్జరీలలో రైనో ఫ్లాస్టీ ఒకటి. వంకర ముక్కు లేదా ముక్కు ఆకారం సరిగా లేకపోతే వాటిని సరిచేసేందుకు చేసే శస్త్ర చికిత్స రైనో ఫ్లాస్టీ అంటారు. ఈ శస్త్ర చికిత్స 2600 సంవత్సరాల క్రితం అంటే 6 బి.సి.లోనే సుశ్రుతుడు నిర్వహించాడు. అందుకే ఆయనను ఇప్పటికీ ‘్ఫదర్ ఆఫ్ ఫ్లాస్టిక్ సర్జరీ’ అని పిలుస్తారు. శుశ్రుతుడు సిజేరియన్‌లు, మూత్రపిండాలలో రాళ్ళు తొలగింపు వంటి శస్త్ర చికిత్సలను నాడే చేశాడు. శస్త్ర చికిత్సలు నిర్వహించడంకోసం నాడు శుశ్రుతుడు రూపొందించిన పలు పరికరాలను నేటి వైద్యులు కూడా వినియోగిస్తున్నారు.
శుశ్రుతుడు వైద్య విజ్ఞానానికి సంబంధించి ‘‘శుశ్రుతసంహిత’’ అనే గ్రంథాన్ని రచించాడు. నేటికి ఆయుర్వేద వైద్యానికి ఇదే ప్రమాణిక గ్రంథం. అయితే, భారతదేశంపై తొలుత ముస్లిం రాజులు తరచు దండయాత్రలు చేసి, భారతీయ వైజ్ఞానిక సంపద నిక్షిప్తమై ఉన్న పలు తాళపత్ర గ్రంథాలను నాశనం చేశారు. కొన్నింటిని తమతోపాటు తీసుకువెళ్ళారు. అనంతరం, వ్యాపారం పేరుతో వచ్చిన యురోపియన్‌లు భారతీయుల కన్న తాము అధికులమనే భావంతో, భారతీయ వైజ్ఞానిక సంపదను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో వారు వ్యాపారంతోపాటు, దేశంలోని పలు ప్రాంతాలను ఆక్రమించుకోవడం, క్రైస్తవ మత వ్యాప్తికి కృషిచేశారు. బ్రిటిషర్లు మరో అడుగుముందుకేసి, దేశాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడంతోపాటు, ఆంగ్ల భాషా నేర్చుకోకపోతే, భవిష్యత్ అనేది ఉండదనే భ్రమను కల్పించారు. దీంతో, భారతీయులు తమ పూర్వీకులు అందించిన వైజ్ఞానిక సంపదను నిర్లక్ష్యం చేశారు.
అదే సమయంలో సంస్కృతం అంటే హిందూ మతానికి సంబంధించిన భాషా అనే భావనను భారతీయుల మెదళ్ళలోకి ఇంజెక్ట్ చేయడంలో పాశ్చాత్యులు సఫలీకృతులయ్యారు. భారతదేశానికి చెందిన వైజ్ఞానిక సంపద అంతా సంస్కృత భాషా గ్రంథాలలో ఉంది. పాశ్చాత్యులు సేవ పేరిట ఆలోపతి వైద్యాన్ని మన దేశంలో ప్రవేశపెట్టారు. అది నేడు మన దేశంలో మర్రిచెట్టు వూడల మాదిరిగా విస్తరించిపోయింది. ఆయుర్వేదంపై మన దేశంలో జరుగుతున్న పరిశోధనల కన్నా పాశ్చాత్య దేశాలలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయుర్వేద వైద్యం కొన్ని కుటుంబాల వారికే పరిమితం అయింది. వారు ఆయుర్వేద వైద్యం గురించి ఇతరులకు చెప్పరు. అదే సమయంలో పాలక పక్షాలు కూడ ఆయుర్వేదం అభివృద్ధికి, పరిశోధనలు జరపడానికి తగినన్ని నిధులు కేటాయించడం లేదు. ఆయుర్వేదం, యునాని, యోగ వంటి వాటిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్ అనే ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసింది. అయితే, ఆయుర్వేదంపై పరిశోధనలు జరపడానికి తగినన్ని నిధులు మాత్రం కేటాయించలేదు.
అలోలపతి వైద్యంలో సైడ్ ఎఫెక్ట్‌లు ఎక్కువగా ఉండటంతో, ప్రజలు క్రమక్రమంగా ఆయుర్వేదం వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో, పలు బహుళ జాతి కంపెనీలు ఆయుర్వేదంపై పరిశోధనలు చేస్తూ, పలు ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. పూర్వం భారతీయులు ఉప్పు, బొగ్గు, వేపపుల్ల, గానుక పుల్ల తదితరాలతో దంతధావనం చేసేవారు. పలు బహుళ జాతి కంపెనీలు వాటితో దంత ధావనం చేస్తే పళ్ళు పాడైపోతాయని భయపెట్టి, ప్రజలను టూత్‌పేస్టు వాడేలా చేశాయి. ప్రస్తుతం, అవే బహుళ జాతి కంపెనీలు మీ టూత్‌పేస్టులో ఉప్పు ఉందా? వేప ఉందా? అంటూ ప్రచారం చేస్తున్నాయి. దీన్నిబట్టి బహుళజాతి కంపెనీలు భారతీయులను ఏ విధంగా మోసచ చేస్తున్నాయనే విషయం తేటతెల్లం అవుతున్నది. ఆయుర్వేద వైద్యంపై పలు అపోహలు సృష్టించారు. దీంతో, సరైన ఆదరణ లేకపోవడం, పరిశోధలు జరగకపోవడంతో ఆయుర్వేద వైద్యం అటకెక్కింది. ప్రస్తుతం పలు బహుళజాతి కంపెనీలు అదే ఆయుర్వేదం ఉత్పత్తులను మార్కెట్ చేస్తూ, కోట్లాది రూపాయలు దండుకొంటున్నాయి.
ప్రస్తుతం భారతదేశం మధుమేహ వ్యాధిగ్రస్తుల నిలయంగా మారుతున్నది. వీరు తప్పనిసరి పరిస్థితులలో అలోపతి వైద్యాన్ని ఆశ్రయించి, సాలీనా వేలాది రూపాయలు మందులకోసం ఖర్చుచేస్తున్నారు. ఆయుర్వేదంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి మందులు ఉన్నాయి. అయితే, ఆ దిశగా మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. అదే జరిగితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు మందులకోసం చేసే ఖర్చు తగ్గుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడ ఉండవు. సంస్కృత భాషను మనం నిర్లక్ష్యం చేయడం, ఆయుర్వేదానికి సంబంధించిన గ్రంథాలు అన్నీ సంస్కృతంలో ఉండటం కూడ నేడు భారతీయుల పాలిట శాపంగా మారింది.అటు ఆయుర్వేదం ఇటు సంస్కృత భాషలపై ఉన్న హిందూమత ముద్రను తొలగించి, వాటిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వపరంగా తగిన కృషి జరగాల్సిన అవసరం ఉంది. అప్పుడు మన దేశంలో మంచి వైద్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. సైన్స్ కూడ బాగా అభివృద్ధి చెందుతుంది.

చిత్రం... సుశ్రూతుడు

- పి. భార్గవరామ్