సబ్ ఫీచర్

పాత దుస్తులతో పనికొచ్చే వస్తువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత దుస్తులుంటే మనమేమి చేస్తాం. మూటగట్టి అటకెక్కిస్తాం. లేదంటే పారేస్తాం. కాని హంసిని హరన్ మాత్రం వాటితో ఇంటిని అందంగా అలంకరిస్తోంది. కుషన్ కర్టెన్లు మొదలుకుని కీ చెయిన్ల వరకు పాత దుస్తులతోనే అందంగా కొత్తవి తయారుచేసి వ్యాపారం చేస్తోంది. కళాత్మక వస్తువులకు కాదేది అనర్హం అన్నట్లు కొందరు ప్లాస్టిక్ వస్తువులను పారేయకుండా ఫ్లవర్‌వేజ్‌లాంటివి తయారుచేస్తుంటే.. హంసిని హరిహరన్ పాత దుస్తులతోఇంటికి అవసరమయ్యే వస్తువులను తయారుచేస్తూ తాను ఉపాధి పొందుతూ..మరో నలుగురికి ఉపాధికల్పిస్తూ వ్యాపారవేత్తగా ఎదుగుతుంది. పాత దుస్తులతో తయారుచేసిన వస్తువులా! అని చిన్నచూపు చూడకండి. హంసిని చేతిలో రూపుదిద్దుకున్న ఆ వస్తువులతో ఇంటిని అలంకరించుకుంటే ఆ ఇల్లే అందాల హరివిల్లు అవుతుంది. అందుకే ఆమె తయారుచేసిన ఉత్పత్తులకు పెద్ద కాంట్రాక్టులు సైతం దక్కుతున్నాయి.
కాస్తంత సృజనాత్మకంగా ఆలోచిస్తే పనికిరాదని పారేసి ప్రతి వస్తువుతోనూ పనికొచ్చే వస్తువులు తయారుచేయవచ్చంటారు హంసిని హరిహరన్. మానసిక ఉల్లాసానికి హస్తకళలు వంటివి ఎంతోగానో దోహదం చేస్తాయని నమ్మే హంసిని చిన్నప్పటి నుంచి కూడా పారేసే వస్తువులతో అందమైన రంగుల్లో ఇంటికి ఉపయోగపడేవిధంగా అలంకరణ వస్తువులు తయారుచేయటం అలవాటు. ఓ సారి పాండిచ్చేరిలోని పేపర్ మిల్లుకు వెళ్లింది. అపుడు హంసిని చిన్న పిల్ల. అక్కడి వేస్ట్ పేపర్‌తో వస్తువులు తయారుచేసుకోవచ్చుకదా అనే ఆలోచన వచ్చింది. ఓ రోజు ఆమె స్నేహితురాలు తన వెడ్డింగ్ కార్డును చేతితో తయారుచేసి ఇవ్వమని కోరింది. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా అందమైన పెండ్లి ఆహ్వాన పత్రికను తయారుచేసి ఇచ్చింది. ఆ తరువాత తన ఇంటి పక్కన ఉన్న స్టూడియోలో పాత దుస్తులతో ఇంటికి అలంకరణగా ఉపయోగపడే ఒక వస్తువును తయారుచేసి ఇచ్చింది. ఫ్యాక్టరీలో తయారుచేసిన వస్తువుకంటే మన్నికగా, అందంగా ఉండటంతో అక్క డ నుంచి ఆమె అవకాశాలు రావ టం ప్రారంభించాయి. అలా 2013లో తానే సొంతంగా ఎందుకు వ్యాపారం చేయకూడదని భావించి పాత దుస్తులను సేకరించి వాటితో కుషన్ కవర్లు, దుప్పట్లు తయారుచేసి స్నేహితురాలి ఇంటిని అందంగా అలంకరించింది. ఆమెలోని సృజనాత్మకతకు గుర్తించిన కస్టమర్లు వారికి అవసరమైనవాటిని తక్కువ ధరలో తీసుకువెళ్లటం ప్రారంభించారు. ఇపుడు బెంగుళూరు అనే పింక్ సిటీలో చాలామంది ఇళ్లల్లో హంసిని తయారుచేసిన పాతదుస్తుల అలంకరణ వస్తువులు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇపుడ హంసిని కుషన్ కవర్లు, దుప్పట్లతో పాటు హ్యాండ్ బ్యాగ్ తరహాలో చేతకి తగిలించుకునే బ్యాగ్స్, బంగారు, వెండి ఆభరణాలు వేసుకునే సంచులు, సెల్‌ఫోన్ పెట్టుకునే పౌచుల్లాను,స్టోల్స్, దుప్పటా, కీ చెయిన్లు, స్క్రాప్లు తదితరవాటిని తయారుచేసి సరఫరా చేస్తోంది. తొలుత వ్యాపారంలో నష్టం వచ్చినప్పటికీ భర్త హరన్, కుటుంబ సభ్యుల ప్రోత్సాహాంతో ప్రస్తుతం కస్టమర్లు పెరిగి కొన్ని ప్రాజెక్టులు చేజెక్కించుకుని వ్యాపారాన్ని లాభాల బాట పట్టించింది. ఇపుడు ఓ పెద్ద సంస్థ బనియన్లు తయారుచేసే ప్రాజెక్టును ఆమెకు ఆప్పగించింది. చాలామంది యువతులు ఆమె వద్ద పనిచేస్తున్నారు. పాత కంజీవరం చీరలు తీసుకుని వాటితో సంప్రదాయమైన దుప్పట్లు తయారుచేసే కాంట్రాక్ట్ కూడా హంసిని చేతికి దక్కింది. ప్రస్తుత పోటీ రంగంలో నిలదొక్కుకుంటూ ఈ వ్యాపారంతో పాటు బుక్ కవర్ పేజీ డిజైనింగ్ చేయటం, ఎంబ్రాయిడరీ పనులు చేస్తూ ముందుకు సాగుతుంది.